1970 వచ్చేప్పటికి అరసం ప్రగతివాద కవిత్వం మార్కి్సస్టు తత్తా్వనికి కట్టుబడవలసిన అవసరంలేదని నొక్కి చెప్పింది. మరొకవైపు తీవ్ర వామపక్ష భావ సంచలనంలో ఊగిపోతున్న సిి. విజయలక్ష్మి విషాదభారతం, `తిరుగబడు కవులు' దీనితో విభేదించారు.
ఇన్నేళు్లగా సాగుతున్న వస్తుపరచర్చాధోరణి వల్ల కవిత్వాంశానికి ప్రాధాన్యం తగ్గుతున్నదేమో నన్న సంశయం చాలామందికి కలిగింది. కవితారచనకు కవిత్వ స్పృహ వుండటం అత్యవసరం అనేది ఒక తీవ్రభావమై కవిత్వజగత్తు అట్టడుగుభాగాన్ని స్పందింపజేయటం మొదలైంది. 1971లో అఖిలభారత తెలుగు రచయితల ఐదవ మహాసభలో కవి సమ్మేళనం అధ్యక్ష పీఠంనుంచి బోయిభీమన్న ఈ ఆవేదనకు అక్షర రూపం కల్పించాడు. `నీవు నిజంగా కవివే అయితే/నిజంగా కవిత్వం వ్రాయి/నినాదాలు మానెయ్యి (26) భూమినుంచి పుట్టేది కవిత్వం/కార్ఖానాల నుంచి పుట్టేది పాండిత్యం / ప్లాస్టిక్ పువు్వల్ని చూచి భ్రమసిపోకు/ఎంత చిన్నదైనా నీ తోపని మానకు (33) సాహిత్యానికి దేశకాలాలు లేవు/సరస్వతి నిత్యయౌవని సనాతని/ఆనాడు కంచి పట్టు చీరలు కట్టింది/ఈనాడు నైలాన్ సిల్కువోణీలు వేస్తున్నది (43) సమాజానికి రసభావ సౌందర్యదాతవు/సమైక్యానికి సాక్షాత్ పరమేశ్వరుడవు (48) జీవితాన్ని నలుముఖాలుగా అనుభవించు/అనుభవం నుంచి ఆనందమధువును వెలయించు (53).
బోయి భీమన్న ఆలోచనలు అలంకార శాస్త్ర సంప్రదాయాన్ని పునఃస్థాపించాయి. మమ్మటుడ చెప్పిన, `నియతికృత నియమ రహితాం హ్లాదైకమయీం అనన్య పరతంత్రాం నవరసరుచిరాం,' అన్న వాక్యాలకు స్థూలమైన వ్యాఖ్యానాలు. తన నాటికి కవిత్వంలోనికి ప్రవేశించిన బింబసంయోజనంలోని సంక్లిష్టతను, ప్రతీకల గందరగోళాన్నీ విమర్శిస్తూ `వాల్మీకిశ్లోకం నీ పద్యంకంటే సరళం / కాళిదాసు డెందం నీ కందం కంటే సరసం' అని నూతనాభివ్యక్తి పేరున ఎంతటి అభివ్యక్తుల కీకారణ్యంలోనికి ప్రవేశిస్తున్నామో వివరిస్తున్నారు.
విరసం ఏర్పడటానికి ముందే కవితారంగంలో ప్రకాశించిన బైరాగి, తిలక్‌లను గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. `తిలక్ అటు భావకవి ఇటు అభ్యుదయ కవి కాడు. అందుకే ఆ రెండు సంప్రదాయాలలోని కొన్ని లక్షణాలను తనలో సంగమింప చేసుకొని తానొక తీర్థప్రాయుడయ్యాడు' (కె.వి.ఆర్. `ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర పే. 221) నూతిలో గొంతుకల్లో బైరాగి ఆధునిక నాగరికతా వైఫల్యాలను, అది ఆత్యంతికంగా కలిగించిన వైక్లబ్యాన్ని చిత్రించాడు.
దాశరథికీ తిలక్‌కూ కొన్ని పోలికలు ఉన్నయ్. విస్తృతమైన సమాజమూ, కవితా భూమిక ఇద్దరికీ సమానం. దాశరథి ప్రగతివాదం నుంచి బయటకు వచ్చి కొనసాగినట్లే, తిలక్ ప్రగతివాదపు దారినుంచి నిష్ర్కమించి వచ్చాడు. `అమృతం కురిసిన రాత్రి'లో తిలక్ ఎంత ఎత్తు ఎదిగినా `పునర్నవం'లో దాశరథి అందుకున్న శిఖరాలకు చేరువ కూడా కాలేకపోయాడు.
`1970లలో అటు విరసం రూపుదిద్దుకుంటున్న తరుణంలోనే సరికొత్త కవిత్వానికి పునాదులు పడ్డట్లు మనం గ్రహించవచ్చు. మే 1969లో సంకలితమైన `చితిచింత', మార్చి1972లో వచ్చిన `చెట్టు నా ఆదర్శం', 1974లో వెలువడిన శేషేంద్ర `మండే సూర్యుడు' అజంతా వెలువరిస్తున్న కవితలు ఈ కొత్త కవిత్వానికి రూపురేఖలు దిద్దినట్లు మనం అర్థం చేసుకోవచ్చు.' (కవిత్వం ఒక ఆత్మఘోష, సుమనశ్రీ పే. 44). అటు విరసం మార్గం సాగుతూ వుండగానే బలంగా మరొక మార్గం కవిత్వానుభవం ప్రధానంగా సాగిన అంశాన్ని మనం గుర్తించుకోవచ్చు.
ఈ అంతర్ముఖ స్రవంతికి దోహదంగా వరంగల్లుకు సమీపంలో తాటికాయలలో నిశ్శబ్దంగా తన ఊహలకు రూపమిస్తూ వస్తున్నాడు పొట్లపల్లి రామారావు. `చుక్కలు' 60లలో తొలిసారి అచ్చయినా విస్తృత ముద్రణం 1974లో వచ్చింది. రామారావు జీవితాన్ని అన్ని స్తరాలనుంచి పరిశీలించి చేసిన కవితామయమైన రచనా విశేషమిది. వచనకవిత్వం తాత్తి్వకంగా రూపుదిద్దుకోబోతున్న భవిష్యత్తును ఈ రచన సూచించినట్లు సువ్యక్తమయింది.
అంతర్ముఖ బహిర్ముఖాలుగా రెండు ధోరణులూ వేరువేరుగా సాగుతూవున్నా నడుమ ఒక నిశ్శబ్దమైన ధోరణి సాగివస్తున్నది. దాని కేతనం దాశరథి పునర్నవంలో ఎత్తాడు. యుగసంకేతంలో (1969) మాదిరాజు రంగారావు `మతాల విచ్చుకత్తుల మెరుపులలో బ్రతుకును వెలిగించలేను. ఇజాల చిక్కుటుచ్చుల తలపులతో బ్రతుకును బంధించలేను' (52) `నిన్నటి పరివర్తనాలు నేటి దృష్టిలో సంప్రదాయం, రేపటి పరివర్తనం నేటి దృష్టిలో అభ్యుదయం (15) ముక్తకాలు (1970)లో అని వాఖ్యానిస్తున్నారు. విమర్శకుల దృష్టి అంతగా పడలేదు కాని 1971లోనే అనాదినుంచి నేటివరకు మానవుని జీవితంలోని ఉత్థాన పతనాలను చిత్రించిన మహాకావ్యం `మానవీయం' రచించాడు.
అత్యంతమైన ప్రతిభాశక్తితో కవిత్వంలో శబ్దాలను శిల్పాలుగా తీర్చిన ఒక తనదైన `దర్శనం' గల కవి అరిపిరాల విశ్వం. `రేపటి స్వర్గం', `కాలంగీస్తున్న గీతలు' `హళేబీడు' మొదలైన సంకలనాలలో ఈయన ఎంతో శక్తిశాలిగా కనిపిస్తాడు. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే `విశ్వం' సృష్టించే కావ్యభాష శేషేంద్ర సృష్టించిన కావ్యభాషతో బుజాలు ఒరిపిడి పెడుతూ వుంటుంది. `అంతర్గోళాలు' `చిరంతన' రచనలతో ఒక విలక్షణమైన కవితాముద్ర వేసికొన్న కవి దుర్గానంద్. గోపాలచక్రవర్తి, శీలా వీర్రాజు. మిరియాల రామకృష్ణ, పరిగి రాధాకృష్ణ, పణతుల రామచంద్రయ్య మొదలైన కవులు ఈ సంధి కాలంలోని వాళ్లే.
1955నుంచి 1970 వరకు కొత్త కవిత్వం ఏదో వెతుక్కున్నట్లు కొనసాగింది. ఒక స్పష్టమైన లక్షణం జాతీయ ప్రజాస్వామ్యంపైన అచంచలమైన విశ్వాసం. వదులుగానైనా కొందరు సామ్యవాదాన్ని ఆశ్రయిస్తే, మరికొందరు ఏకాంత రహస్య గుహాసీమల్లోని వెలుగులకోసం రహస్యవాదాన్ని ఆశ్రయించినవాళు్ల. `నగరంలో వాన', `అముద్రిత కావ్యం' రచనల దగ్గరకొచ్చేప్పటికి కుందుర్తి కూడా సదసత్సంశయంలో పడి సత్తువైపు ప్రయాణిస్తున్నాడు.
1976లో ఆర్.ఎస్. సుదర్శనం రచించిన `నిశాంతం' వెలువడింది. `నిశాంతం' మార్మిక కవితా ధోరణికి స్పష్టమైన అభివ్యక్తినిచ్చింది.
ఎన్ని జన్మలు పూవులో నెన్నిరేకు
లెన్ని మధురవాసనలు నా హృదయమందె
యుగయుగము్మల కాలము్మ నొదిగి ెుుదిగి
పుచ్ఛమును మ్రింగబోవు పామువలె నుండు
సృష్టి అనుస్యూతిని జన్మపరంపరల అనంత చక్రాకారాన్ని సూచిస్తున్నదీ పద్యం. త్టోను మ్రింగే పాము అనడంలో జన్మమృత్యువులనే బిందువులు ఒకేచోట సంగమించటం అనే జీవన రహస్యం ఇక్కడ వ్యక్తమవుతున్నది.
`ఈనాటి సమాజంలో ఉన్న పరిస్థితులకు ప్రతిరూపంగా కవిత్వమూ వివిధ భావధోరణులతో కనిపిస్తున్నది. రామాయణ కల్పవృక్షం పూర్తిఐంది. మహాసర్గ అవతరించింది. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి ప్రభవించాయి. వందేమాతరం వినిపించింది. విశ్వంభర ఉదయించింది. దిగంబరంచేతనావర్తంవిప్లవం ఇట్లా అనేకం భావావేశం లక్ష్యశుద్దితో తెలుగులో కవిత్వం స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తున్నది. జాతీయభావన, సంస్కరణం, పరివర్తనం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, విప్లవం, సంప్రదాయ పరంపరా పార్వా్శలతో గోచరిస్తుంది. వీరిలో ఒక్కొక్క రచయిత వ్యక్తిత్వంలో ఒక్కొక్కటి ఆధిక్యం వహిస్తూ లేదా కొన్నింటి కలయికచేత విశిష్టరూపాన్ని పొందుతూ పరిశీలనలో గోచరిస్తాయి.' (ఆధునిక కవిత్వం సమాలోచన. మాదిరాజు రంగారావు పే.45) ఈ పరిణతికి ఆధారభూతంగా ఒక సంస్కృతి అవిచ్ఛిన్నంగా సాగివస్తున్నదని పేర్కొంటు న్నాడు విమర్శకుడు. ``ఏ దేశమైనా ఏ సాహిత్యమైనా పరంపరగా వచ్చే సంస్కృతీ భావన ఒకటి వుంది. ఈనాటి జీవనవ్యవస్థలో నిరసనకు గురైన దురాచారాలు చెల్లని నియమాలు అహేతుకమైన ధోరణులు తీసివేస్తే సారభూతమైందీ సంస్కృతీ ప్రస్థానంలో శిఖరంగా నిలిచే సంప్రదాయ పరంపర ఉంది. ఇది ప్రతి భాషా సాహిత్యానికి వర్తిస్తుంది. (ఇదే పే.44) ఈ మాదిరాజు రంగారావు అభిప్రాయంలో ఒక సంతులనం ఉన్నది.
No comments:
Post a Comment