అంతకు పూర్వం సి.పి.బ్రౌన్ వేమన పద్యాలను ఆకాశానికెత్తటం వెనుక ఉన్న రాజకీయం ఇంతకంటే మించింది. వేమన పద్యాలలో విగ్రహారాధనాదికాలైన `హిందువుల ఆచార వ్యవహారాలను పరిహసించటం, నిరసించటం వెనుక ఆతని అచల యోగ సంప్రదాయము, అవధూత లక్షణాలు ఉన్నాయిగాని, వాటి వెంట ఆత్యంతికమైన వ్యతిరేకత లేదు. ఈ సంప్రదాయ వైవిధ్యంలోని ఆభాస వైరుధ్యాన్ని అర్థం చేసుకోలేక బ్రౌను వేమన రచనను క్రైస్తవ దృష్టిలో చూచి ఆయన సాహిత్యాన్ని సర్వేతరాంధ్ర సాహిత్యానికన్నా అధికంగా భావించటం జరిగింది. ఈ ప్రకటంగా కనిపించే ఆచార వ్యవహార నిరసన మాత్రం ప్రధానంగా భావించి- అతని యోగాన్ని దివ్య జీవన సాధనకు ఉపేక్షించి విమర్శకులు `ఉపరిశోధనలు' చేస్తూ వచ్చారు.తెలుగు సాహిత్యంలో వైదికి నియోగి భేదాలు 1910 తరువాత ఎక్కువగా విజృంభించాయి. తిరుపతి వెంకటకవులు కొప్పరపు కవుల విభేదాలు అనేక కవిత్వ వివాదాలకు కారణాలయ్యాయి, నన్నయ్య భట్టుకు తిక్కనతో సమానమైన- అధికంగా కాకపోయినా స్థానం లభించటానికి తరువాత కనీసం నలభై యేళ్లయినా పట్టింది.సుమారుగా ఈ ప్రాంతంలోనే జస్టిస్ పార్టీ ఉద్భవించింది. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు పెచ్చరిల్లాయి. గుంటూరు ప్రాంతంలో త్రిపురనేని వారు దీనికి నాయకత్వం వహించారు. నెల్లూరు ప్రాంతాలలో రెడ్లు ఈ ఉద్యమానికి నాయకులయ్యారు. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి ఉద్గమ స్థానం మదరాసు కావటంవలన నెల్లూరు అక్కడికి సమీపంలో ఉండటం వలన, అంతకు పూర్వమే గ్రామంమీద పెత్తనం ఉండటంవలన రెడ్లు రాజకీయాలలో మొదట అధికారంలోకి వచ్చారు.
గుంటూరు ప్రాంతంలోని రైతులుగా ఉన్న కమ్మవారు క్రమంగా సాహిత్యరంగంలోకి, పత్రికారంగంలోకి, వ్యాపార రంగాలలోకి వచ్చి బలపడ్డారు.ఈ సంధిలో పుట్టిన `కవిత్వ తత్త్వవిచారం' అలంకార శాస్త్ర మర్యాదలను పునాదులు కూలగొట్టి వస్తు ప్రాథమ్యానికి పట్టం కట్టింది. మహా కావ్యాల చట్రాన్ని తిరస్కరించింది. అభివ్యక్తి వైచిత్రిని కాదన్నది.అప్పటికే ప్రతిష్ఠితమైన కావ్య సంప్రదాయాలను కాదని నూతన సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఔపదేశికతను - అనగా వస్తువునకు పురస్కృతి కలిగింది. తమిళదేశంలో తిరువళు్ళవర్‌కు పట్టంకట్టిన విధంగానే నీతి బోధనకతకు, సామాజిక వ్యాఖ్యకు, కుల భేదాల నిరాకరణకు, అస్పృశ్యతను కాదనటానికి ముఖ్యత వచ్చింది. సరిగ్గా ఇదే కాలంలో ఈ అంశాలలో అధికాంశాలకు ప్రాధాన్యమిచ్చిన గాంధీ నాయకత్వం దేశంలో స్థిరపడింది.కుల భేదాల నిరాకరణం వెనుక కులాల ఆలసత్వమును ప్రకటించుకోవటం ముఖ్యాంశమే అయింది. యోగిగా, జ్ఞానిగా పరిగణింపబడిన వేమన వేమారెడ్డి - `మహాకవి' అయినాడు గోన బుద్దారెడ్డి రంగనాథ రామాయణకర్తగా నిరూపించబడ్డాడు. రాళ్లపల్లివారి వేమన ఉపన్యాసాల సందర్భంలో, రంగనాథ రామాయణం ప్రచురణ సందర్భంలో కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్‌గా ఉండటం అవిస్మరణీయమైన అంశం. ఈ కాలంలోనే మొల్ల రామాయణం ప్రశస్తి పెరిగింది. నన్నెచోడుడు, శ్రీకృష్ణదేవరాయల వంటి రాజకవులకు ప్రాధాన్యం కలిగింది.జాతీయోద్యమానికి వ్యతిరేకంగా కొనసాగిన సామ్యవాదోద్యమం భారత జాతీయతను ఏక దేశ భావనను కాదన్నది. క్విట్టిండియా ఉద్యమాన్ని త్రోసిపుచ్చింది. బ్రిటీష్ ప్రభుత్వాన్ని బలపరచిన దానిని స్తోత్రం చేసిన కందుకూరినీ, గురజాడనూ, ప్రాచీన సాహిత్యంతో సంబంధం తెలియకుండానే త్రెంచే ప్రయత్నం చేసిన వ్యావహారిక వాది గిడుగు రామమూర్తినీ, ఆధునికాంధ్ర మహాపురుషులుగా గుర్తించి ప్రచారం చేసింది. కాశీనాథుని నాగేశ్వరరావునూ, కొమర్రాజు లక్ష్మణరావునూ ఎప్పుడూ అలా ప్రశంసించలేదు.సామ్యవాదోద్యమంలో జస్టిస్ పార్టీవారి వ్యతిరేకాంశాలు ప్రథమంగా చోటు చేసుకున్నవి. స్వాతంత్య్రోద్యమ భావన గర్భితంగా ఉన్న `ప్రతాప రుద్రీయం' వారి ప్రశంసలకు ఎప్పుడూ స్థానం లేదు. వీరి సాహిత్య పార్శ్వం అరసం `ప్రాచీన సాహిత్యమంతా జన సామాన్యానికి ద్రోహం చేసింది' అన్న మూల సూత్రంతో ఉద్యమం ప్రారంభించింది. రామలింగారెడ్డి ప్రారంభం చేసిన వస్తుప్రాధమ్యం. క్రమంగా వస్తువే సాహిత్యమన్న పారమ్య స్థితికి చేరుకున్నది. కాల్పనిక కవిత్వంలోని దేశభక్తి ప్రణయం ఆదిగా పార్శా్వలు దూషితాలయినాయి.
ఈ నడుమ హిందూ భావనకు, విశ్వాసాలకు వ్యతిరేకంగా క్షతికలిగే విధంగా పురాణ, ఇతిహాస ఘట్టాలకు అపవ్యాఖ్య చేయటం ప్రారంభం అయింది. చలం, ముద్దుకృష్ణ, నార్లవంటి వారు ఈ మార్గంలోని వారు.నార్ల కమూ్యనిస్టు వ్యతిరేకిగా కనిపించినా లోతుగా ఎన్నో వ్యతిరేకతలు ఆయన రచనలలో ఉండేవి. ఆయన పత్రికా నిర్వహణలో కొందరు రచయితల ప్రసక్తి నిషిద్ధమై ఉండేది. అంతగా `భావ స్వేచ్ఛ'ను ఆదరించిన వ్యక్తి ఆయన. ఆయన పత్రికలో `చలం - విశ్వనాథ - శ్రీశ్రీల ప్రసక్తి నిషిద్ధం. ఈ అంశం పరిశీలించినప్పుడు ఆయన నిషేధం విధించటంలోని తాత్తి్వక మూలాలు బ్రాహ్మణ వ్యతిరేకోద్యమం దాకా కొనసాగవలసి ఉంటుంది.ఇన్ని ఇబ్బందులలోనూ ఏ ఇబ్బందికీ పట్టుబడకుండా ఏ స్థిరబిందువుమీదా నిలువకుండా కాలానుగుణంగా కదిలిపోయిన వ్యక్తి కృష్ణశాస్త్రి అనిపిస్తుంది. కాల్పనికోద్యమంలో మూలవిరాటై్ట, అభ్యుదయ కవిత్యోద్యపు `పతాకై' మతం వద్దు, గతం వద్దు మారణహోమం వద్దు అంటూ లౌకికవాదై, `రామచరణం రామచరణం రామచరణం మాకు శరణం' అంటూ భక్తివాదియై ప్రవర్తించాడు.నార్ల వ్యతిరేక దృక్పథం వల్ల తెలుగు వాళ్లకు రావలసిన జ్ఞానపీఠ ప్రథమ పురస్కారం రాకుండా పోయింది.1956-57లలో హైదరాబాద్‌లో తెలంగాణా రచయిత సంఘం వార్షికోత్సవాలు జరిగాయి. ఆ వేదిక మీద నుంచి విశ్వనాథ అఖిలాంధ్ర సాహిత్య పరిషత్తు ఏర్పడాలని పిలుపునిచ్చారు. ఆ భావనతో కార్యాచరణకు పూనుకుని ఆ పరిషత్తు ఏర్పరచేందుకు ఒక సన్నాహక సమావేశం హైదరాబాదులో జరిగింది. దీని ఆధిపత్యం తనకు అనుకూలం కానీ వారికి లభించవచ్చునన్న ఊహతో నార్ల, అబ్బూరిని కలుపుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒప్పించి కొద్ది రోజులలోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీని ఏర్పడేట్లు చేశారు.అయితే కొన్నేళ్ల తరువాత అకాడమీల రద్దుకు ఆయన కారణమయ్యారు.
ప్రాంతీయవాదంవైపు వస్తే తొలి రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాల కవి మండలి సాహితీ సమితిగా సాహిత్యాన్ని ఆవరించింది. తరువాతి కాలంలో ఉత్తరాంధ్ర రచయితలకు ప్రముఖమైన లాబీగా అవతరించింది. తెలంగాణా ప్రాంతంలోగానీ, రాయలసీమలోగానీ ఇలాంటి ప్రబలమైన రచయితల పరస్పర ప్రచారక మండలి ఏర్పడలేదు.మన లౌకికవాద వామపక్ష రచయితలకు మైనారిటీ మతమంటే ఎంతో ముద్దు. గజనీనుంచి కాశీం రజ్వీదాకా వెయ్యేండ్లు విధ్వంసం చేయబడ్డ దేశం. మనుష్యుల మీద ప్రకటించిన క్రౌర్యం, బాగా సంస్కృతుల అణచివేత ఈ కవులకు వస్తువు కాలేకపోయింది. గోద్రా రైలు దహనం వంటి అమానుష చర్య కలిగించిన పరిణామాలు మాత్రమే వస్తువులయి కవులు గుజరాత్ గాయం పేర `ఏకాహా'లు నిర్వహించారు. బాబ్రీ సంఘటనను నిరసించే ఈ కవి సమూహం తరువాత విధ్వంసమైన కాశ్మీరులోని ముప్పయి నలభయి దేవాలయాల సంగతి పట్టించుకోలేక పోయారు. మార్కి్సస్టుల ఎజెండాలో ఇటీవల స్త్రీవాదం, దళిత వాదం, మైనారిటీ వాదం వస్తువులు కావటం- వారి అనుబంధ సంస్థలు ఈ అంశాలకు ప్రచారం ఇవ్వటం ఆత్యంతికంగా ఈ దేశం `హిందూత్వ'ను నిర్మూలించే లక్ష్యమనేది స్పష్టం అవుతుంది. మనకు ఈ ఆపదనుంచి ఎవరూ రక్షించగలరు?
మీరు పేరాలుగా విభజించి వ్రాస్తే చదువరులకు సౌకర్యంగా వుంటుంది.
ReplyDeleteఅత్భుతంగా చెప్పారు!! మీలాంటి పెద్దవాళ్ళు ఈనాటి యువతకి ముందుకి *నిజాలను* తీస్కురావాలి. *భావస్వేఛ* ప్రగతికి మాత్రమే ఉప్యోగపడెలా మార్గోపదేశం చేయాలి.
ReplyDeleteనిజమే హిందూత్వంపై నలువైపులనుండీ దాడి జరుగుతోంది. బి.జె.పి పుణ్యమాని హిందూత్వమంటే ఒక రాజకీయం అనే అర్ధాన్ని మూటగట్టింది. అలా అని హిందూ మతానికి వారు ఒరగబెట్టిందీ లేదు. హిందువుల అనాసక్తే దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. మన దేశంలో వివిధ జాతులు వివిధ మతాలు ప్రశాంతంగా జీవిస్తున్నాయి అంటే దానికి కారణం దేశంలో అతి పెద్దదైన హిందూ మతం ప్రజలకు నేర్పిన సుగుణాలే. మీలాంటి పెద్దలు నడుం కట్టి వీలైనంత మందికి హిందూ మతం గురించి మరోసారి వివరించాల్సిన అవసరం ఉంది.
ReplyDeleteవలసవాద భావజాల సాహిత్యం గురించి చరిత్రని బాగా చెప్పారు. కానీ ఆఖరికొచ్చేసరికీ...
ReplyDeleteమీ అంత పెద్దవారిపై వ్యాఖ్యానించేంతవాణ్ణి కాకపోయినా...
ReplyDeleteచాలా బాగా రాశారు సర్ !
నాకనిపిస్తుంది - ఇంకో జన్మంటూ ఉంటే తెలుగువాడిగా పుట్టాలా ? అక్ఖర్లేదా ? అనే మీమాంసకి గుఱిచేస్తుంది, మనవాళ్ళు అనేకకోణాల్లోంచి అడుగడుగునా ప్రదర్శించే అట్టర్ స్టుపిడిటీ. కులలావారీ, శాఖలవారీగా, ప్రాంతాలవారీగా ఈమధ్యనేమో జెండర్ వారీగా...
మన రాష్ట్రపు విశ్వవిద్యాలయాల్లోని ఇంగ్లీషు డిపార్ట్ మెంట్ లలో అన్ని ఖండాల సాహిత్యమూ చదువుతారు, చాలా విశాలహృదయంతో ! మన తెలుగు సాహిత్యం దగ్గఱికొచ్చేసరికి ఎందుకిలా "మా కులంవాడు అవునా ? కాదా ? మా శాఖ అవునా ? కాదా ? మా ప్రాంతం అవునా ? కాదా ?" అనే విచికిత్స ? తల్చుకుంటే చాలా బాధ కలుగుతుంది. మంచి ఎక్కడున్నా ఆదరించాలనే ఎఱుక వీళ్ళకెప్పుడు కలుగుతుంది ? నశించిపోయే లక్షణాలే తప్ప బాగుపడే లక్షణాలు ఈ జాతికి ఏ కోశానా లేకపోవడానికి కారణమేంటి ?
దేవుడా ! రక్షించు నా తెలుగుజాతిని !
సుప్రసన్న రాసిన వ్యాసం సత్యమును వ్యక్తం చేస్తున్నది.ఈనాడు ఆంధ్ర దేశం లోనే కాదు భారత దేశం మొత్తం మీద ఇటు రాజకీయ వేత్తలు,పత్రికలూ ఇతర మాధ్యమిక సాధనాలు అన్ని కూడా ప్రత్యేకంగా పని కట్టుకొని హిందూ వ్యతిరేక ధోరణిని అవలంభిస్తున్నాయ్. ఇలా భారతీయతను అవహేళన చేయటం వాళ్ళకొక పెద్ద ఫ్యాషన్. అలా చెయ్యటమే నాగరికత అని వాళ్ళు భావించటం ఒక దౌర్భాగ్యం.దీనిని ఎవ్వరైనా వ్యతిరేకిస్తే వాళ్ళు దేశ ద్రోహులుగా కాషాయ మూకలుగా ముద్రిమ్పబడుతున్నారు. తెలుగు సాహిత్యంలో ఆధునిక కాలంలో మొదటి నుంచి కూడా జాతీయ భావ శ్రోతస్సును అందుకున్న కవులు విమర్శకులు చాల తక్కువ మంది. అలా అందుకున్న వాళ్ళు కూడా సాహిత్యంలో నిర్ల్యక్ష్యం చేయబడ్డారు.అంటే వాళ్ళను గుర్తించ కుండా వాళ్ళకు గుర్తింపు రాకుండా ఎన్ని ప్రయత్నాలు జరగాలో అన్ని ప్రయత్నాలు జాతీయ భావ వ్యతిరేక శక్తులు చేసాయి.అందుకే బ్రిటిషు వాళ్ళను నెత్తికెక్కించుకున్న గురజాడ , వీరేశ లింగం పంతులు లాంటి వాళ్ళు వామపక్షీయుడైన శ్రీ శ్రీ లాంటి వాళ్ళను ఈనాటికీ కూడా మహా వ్యక్తులుగా నెత్తిన పెట్టుకోవడం మనలోని జాతీయ భావ దారిద్ర్యానికి పరాకాష్ట.అలాగే జానపద,మైనారిటీ స్త్రీవాద --- మొదలైన సాహిత్య వాదాలు కూడా జాతీయ భావాన్ని వ్యతిరేకిన్చేవే.ఇలా చూస్తె నిన్న మొన్నటి చరిత్ర మొదలు ఈనాటి చరిత్ర వరకు భారతీయులలో భారతీయతను నాశనం చేయటానికి జరుగుతున్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.ఈనాడు కావలసింది సుప్రసన్న రాస్తున్న సత్యపూరితమైన వ్యాసాలే కానీ చరిత్రను సత్యాన్ని వక్రీకరించే వ్యాసాలు కావు.సుప్రసన్న గారికి అభినందనులు.
ReplyDelete----కౌండిన్య----
చాలా బాగా రాశారు. మీరు ఇలాటివాటిని ఇంకా రాస్తారని ఆశిస్తూ ...
ReplyDeleteచాలా బాగా వ్రాసారు సర్.
ReplyDeleteఎ కళ అయినా ఎలా బతుకుతుంది? ఆదరించే వాళ్ళు ఉంటేనే. పూర్వం రాజులు తమకు ఇష్టమైన మతాన్నో, కళ నో ప్రోత్సహించే వారు. డబ్బు కానుకలు ఇచ్చి వ్రాయించే వారు. ఇప్పుడు డబ్బు ఎక్కడ నుంచి వస్తోందో ఆలోచిస్తే మనకు రెండు రకాలుకన్పిస్తాయి.
(1) ప్రత్యెక మైన ఆశయం తో కొందరు మిషనరీస్ , ఉగ్రవాద సంస్తలు పని కట్టుకొని హిందూ వ్యతిరేక, వేర్పాటు వాద రకమైన సాహిత్యాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఏది వ్రాస్తే ప్రచురిస్తారో తెలుసు కనుక కొందరు రచయితలు అది వ్రాస్తున్నారు.
(2) ఇది కాక main stream రచనలు, ఏవైతే ప్రజల్లో పాపులర్ విషయాలో వాటి మీదే వస్తున్నాయి. వ్యక్తిత్వ వికాసం, డబ్బు, కెరీర్ సంబదితం, భక్తి రచనలు వీటిలో ముఖ్యం. సస్పెన్స్ మొ|| వి ఇప్పుడు సినిమాల్లో చూస్తున్నారు కాని పుస్తకాల్లో చదవటం లేదు.
నా ఉద్దేశ్యం ప్రకారం ఒకటవ రకం వి ప్రమాదకరమైనవి. మంచి సాహిత్యం కాక పోయినా పర్వాలేదు కాని ప్రత్యెక ఉద్దేశ్యాలతో మనుషుల మద్య అగాధాలు పుట్టించే సాహిత్యాన్ని తక్షణం ఆపాలి. ఆంగ్లేయుల డబ్బుతో కొన్నాళ్ళు, పులుల డబ్బులతో కొన్నాళ్ళు ఎంత కలుషితమైన సాహిత్యం తమిళం లో వచ్చిందో చెప్పలేము. ముఖ్యం గా డబ్బును ఆపితే ఈ సమస్య తీరుతుంది. ఆనక ఏది నిజమో అది నిలిచి ఉంటుంది.
సమస్య నిజమైనది అయితే దానికి అందరి స్పందనా ఉంటుంది. అది హిందూ మతం లో నిజమైన లోపమైతే తప్పక మతం సంస్కరించ బడుతుంది. అది సృష్టించ బడ్డ సమస్య అయితే తేలిపోతుంది. డబ్బుతో పుస్తకాలు ప్రచురిచ గలరు కాని అందర్నీ ఒప్పించలేరు. కొందరు గాలి వాటం గాళ్ళను మాత్రం ప్రభావితం చెయ్యగలరు.
ప్రపంచంలో ప్రతీ దేశానికి ఒక ప్రత్యేకత ఒక విషయంలో ఉన్నతి ఉన్నట్టే భారత దేశోన్నతి దాని ఆధ్యాత్మికతలో ఉంది,ధర్మ నిరతిలో ఉంది.భారతదేశం మీద దాని ఎల్లలపై జరిగిన దాడుల కన్నా దాని సంస్కృతి పై జరుగుతున్న దాడులు ప్రమాదకరం.ఆ దాడుల్లో భాగంగానే నేడు బ్రాహ్మణ్యం పైన,సాహిత్యం పైన జరుగుతున్నాయి.
ReplyDeleteకానీ ఈ దాడుల్లో ఒకనాడు హైందవ ధర్మానికి నడుం కట్టిన కమ్మ,రెడ్డి కులాల వారు చేయి కలపడం అత్యంత బాధాకరం.మాట్లాడితే కాకతీయ సామ్రాజ్యానికి సేనానులుగా పని చేసిన కమ్మ సేనానుల పేర్లు చెప్పే వీళ్ళు పాపం ఆనాడు ఆ మహవీరులు ప్రతాప రుద్రుని మరణానంతరం నియోగి,వెలమ,రెడ్డి సేనానులతో భుజంభుజం కలిపి హైందవ ధర్మ పరిరక్షణ కోసం నడుంకట్టారని మర్చిపోతారు.అలాగే ధర్మ స్థాపన కోసమే నియోగించబడ్డ బ్రాహ్మణ సోదరులు నియోగులు,వారి ఉష్ణ రుధిర ధారల ఫలంగా ఎందరో హిందువుల ప్రాణాలు నిలబడ్డాయని అన్న స్పృహ వైదీకులు,ఆచారాలు వైదీకులు నిష్టగా అవలంబించడం వల్లనే నేటికి ఆ ఆచారాలు,తద్వార వేద విఙ్ఞానం మనకు అందుతున్నాయన్న స్పృహ నియోగులు కలిగి ఉండడం లేదు.
ప్రాణం ఉంటుందని తెలిస్తే ప్రాణం మీద తీపి అడ్డుకుంటుందని,తమ భయమే శత్రువుకి బలమని మొండిగా మణికట్టు నరం తెంపుకుని ప్రాణం పోయేలోపు మిగిలే అతితక్కువ సమయంలో ధర్మ వ్యతిరేకుల్ని తుదముట్టించి నవ్వుతూ విజయాన్నీ,మృత్యువునీ ఆహ్వానించిన ఆ నలుగురు కమ్మ, నియోగి,వెలమ,రెడ్డి కులాలకు చెందిన కాకతీయ సేనానులు మనకు ఏం నేర్పుతున్నారు.మూలాలు తెలియక సాహిత్యం నుండి రాజకీయం వరకు ప్రతీ రంగంలో కొట్టుకుంటున్న వీళ్లనీ వాళ్లనీ కూడా ఒకే కులంతో సంబోధించాల్సి రావడం చరిత్ర చేసుకున్న పాపం.
జయంతితే సుకృతినోః రససిధ్ధా కవీశ్వర
నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం
---సంతోష్ సూరంపూడి
బౌద్దం వలెనె హిందూత్వం కనుమరుగు కాక తప్పదు. దానికి కారణం ఇతర మతాల వారు కాదు. ఇదంతా స్వయంకృతాపరాదం. హిందూ మతం ప్రజలకేంచెస్తుంది? మేమే దేవుడ్నిపూజించి సాంప్రదాయాలు పాటించి ఉపకారం చేస్తున్నాం అనుకుంటారు సామాన్య ప్రజలు.
ReplyDeleteహిందూమత దేవాలయాలు నడిపిస్తున్న యూనివర్సిటీలలో ఆసుపత్రులలో ఉద్యోగులను హిందువులను మాత్రమే నియమించాలి అలా జరడగంలేదు. కానీ మనవారు ఇంకో అడుగు ముందుకేసి దేవాలయాలలో కూడా ఇతర మతస్తులు పనిచేయవచ్చని ప్రకటించారు! దేవాలయాలకు అనుబంధంగా ఉన్న అన్న, విద్యా, ఆరోగ్య దానాలు కేవలం హిందువుల చేతులమీదగానే జరగాలి.
ప్రభుత్వం హిందూ దేవాలయాల భూములు అమ్ముకుంటున్నది.
ReplyDeleteముస్లీంలకొరకై షాదీమహల్ లు నిర్మించి ఇస్తున్నది! ఉచితంగా వారికి వివాహాలు చేయిస్తున్నది. ప్రభుత్వ కళ్యాణ మండపం అన్నప్పుడు అన్ని మతస్థులకూ కలిపి ఉండాలి.
సుప్రసన్నుల వారికి,
ReplyDeleteఇలా కామెంట్లకి నేను సమాధానం చెప్పడం మీ బ్లాగులో సరిపడని విధానమైతే నన్ను క్షమించాలి.
అనామకుల వారికి,
మనం చూస్తున్న దుష్పరిణామాలన్నీ కేవలం కొన్ని శతాబ్దాల నాటి నుండి పెచ్చు పెరిగినవి మాత్రమే అని నిరూపించేందుకే ఆ ఉదాహరణలు చెప్పాను.కేవలం ఒక శతాబ్దం అన్నది ఎందుకు అంటే సరిగ్గా వందేళ్లకు అటూ ఇటూ ఉన్న మన ఆయుష్షు లెక్కల్లో వందేళ్లు ఎక్కువ కానీ సనాతనమైన(పోనీ 3000 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న(చరిత్రకు అందినంత వరకు))హైందవ సంస్కృతికి ఈ వందేళ్లు ఈ ఆటంకాలు లెక్కలోనివి కాదు.బుద్ధుడి మొదలు తురుష్క గురువు షిర్డీ సాయి బాబా(క్షమించాలి) వరకూ కొన్ని కోట్లమందిని గురువులుగా స్వీకరించిన విశాల భావాలు మనవి.క్రీస్తును కూడా అలా అంగీకరిస్తారు హిందువులు.ఇబ్బంది లేదు.వేదం ప్రకృతి అంత విశాలమైనది.ఆయన్ని కూడా అక్కున చేర్చుకుంటుంది.హిందూ మతంలో లేనివి కొత్తవి ఏమీ లేవు ఎక్కడా.ఈ మూడు వందల ఏళ్లు ఒక లెక్క కాదు.
నమామి వేద మాతరం.
సంతోష్ సూరంపూడి