Monday, February 16, 2009
పాములపర్తి సదాశివ రావు
శ్రీ పాములపర్తి సదాశివరావు వరంగల్ నగరంలో మనకు సమకాలంలో మన ముందు మెదలిన అరుదైన అసాధారణమైన వ్యక్తి. జీవితమంతా తపస్వాధ్యాయాలుగా, తాను ప్రకాశిస్తూ ఎదుటివారిని తన ప్రకాశంతో జాజ్వల్యమానంగా రూపించిన మహాశయుడు. నేను ఎదిగే నాటికి అప్పటికే కాకతీయ పత్రిక సంపాదకుడుగా, కాకతీయ కళాసమితి నిర్వాహకుడుగా ప్రముఖ వ్యక్తి. ఆనాటికి చిన్న చిన్నగా పద్యాలు రాస్తూ కాకతీయలో ప్రచురణ కోసం ఒకసారి ఒక రచన అందించి వచ్చాను. (అయితే అది ప్రచురించబడలేదు.) ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంలో నేనూ, పి.ఎన్. స్వామి, ఉదయరాజు రాధాకృష్ణ ముగ్గురమూ ఒక ప్రత్యేక సంచిక వెలువరించ బూనినప్పుడు దానికి సంపాదకత్వ భారాన్ని వహించి నాటికి చాలా అందంగా విశిష్టంగా ప్రచురించారు. దానిలో ఆయన కాకతీయ శిల్పం గురించి ప్రత్యేక వ్యాసం వ్రాశారు. నేను అప్పటికి హైదరాబాదులో బి.ఎ. చదువుకుంటున్నాను. నా చేత ప్రత్యేకంగా దానిలో ప్రచురణ నిమిత్తం `స్థానిక సాహిత్య సమీక్ష' అనే పేర వరంగల్లు జిల్లా సాహిత్య వికాసం గురించి చక్కని వ్యాసం వ్రాయించారు. దానిలో చివరకు నేను మరిచిపోయిన నాలుగైదు పేర్లను చేర్చి వ్యాసాన్ని సమగ్రం చేశారు. అప్పటి నుంచీ ఆయనతో నా పరిచయం కొనసాగింది. `తత్త్వశాస్త్ర ప్రాథమిక పాఠాలు', చరిత్ర, సంస్కృతి, కళ', `జ్ఞాన సిద్ధాంతం', `భారతీయ సాహిత్య పరిణామాలు పరిశీలన' మొదలైన పరిశీలనాత్మకమైన రచనలే కాకుండా `అభ్యుదయ గేయాలు' అనే కవితా సంపుటి కూడా ఆయన రచనలలో ఉన్నాయి. కాకతీయలో సంపాదకీయాలు, ఇతర రచనలు, ఇతరుల పేర్లతో వచ్చిన రచనలు అన్నీ విలువైనవే. విశ్వజ్యోతి మొదలైన పత్రికలు ఆయన ఆధ్వర్యంలో కొనసాగాయి. వాటిల్లోనూ ఎక్కువ పాలు ఆయన చేతి రచనయే. శ్రీ సదాశివరావు పర్వతం వలె గంభీరుడే కానీ కదలకుండా ఒకే బిందువు వద్ద స్థాణువుగా నిలిచి పోలేదు. ఆయన జీవలక్షణం జిజ్ఞాస. ఒక భావనకు ఒక సిద్ధాంతానికి కట్టుబడి తన జీవితాన్నంతా ప్రశ్నించకుండా సాగిపోయిన వ్యక్తి కాదు ఆయన. ఆ పర్వతం కరిగి గంగయై ప్రవహించింది. అనేక సంస్కృతులను నాగరికతలను కాలఖండాలను స్పృశించింది. అనేక ఉపనదులను తనలోనికి సమావేశింప జేసుకున్నది. కమూ్యనిస్టు పార్టీ పక్షాన `సందేశం' పత్రికకు సంపాదకులుగా బౌద్ధం గురించీ, శాంకరాదై్వతం గురించీ రెండు ప్రత్యేక సంచికలు ప్రచురించారు. వీటిల్లో శాంకరాదై్వతం గురించిన పత్రిక ప్రతులను బేదాభిప్రాయాలు కారణంగా తగులబెట్టినారని వారికి మిక్కిలి సన్నిహితుడు నాకు ఆప్తమిత్రుడైన శ్రీ పి.ఎన్. స్వామి చెప్పారు. 1957 ప్రాంతం నుండి సదాశివరావులో మార్కి్సస్టు తత్త్వం విశ్లథమవుతూ వచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో ఆయన ప్రచురించిన `అభ్యుదయ గేయాల'లో ఈ విశ్లథ దశ స్పష్టంగా గోచరిస్తుంది. దీనిలోని `భూమాత' అన్న రచన జాతీయ చైతన్యానికి, ఉజ్జ్వలమైన గతానికి హారతులెత్తింది. `శాంతి ఆయుధంలో స్వాతంత్య్ర పథంలో సామ్రాజ్య రాక్షసిని సంహరించిన భూమి' `శూరాధి శూరులౌ రాజులేలిన భూమి' `యోధాను యోధులై పోరుసల్పిన భూమి' `వీరాధి వీరులౌ శ్రీరామ చంద్రులను', `కారుణిక మూర్తులౌ శాక్య గౌతములను', `శృంగార రూపులౌ రాధా మాధవులను', `జ్ఞాన ప్రదీపులౌ వ్యాస వాల్మీకులను' గన్న తల్లికి పూజ చేద్దాము' ఇవన్నీ ఈ కవితలోని పంక్తులు. `గతమంతా తడిసె రక్తమున కాకుంటే కన్నీళు్ళలతో, అన్నా `మంచి గతమున కొంచెమేనోయ్' అన్నా ఆ కవుల దృష్టికి సదాశివరావు దృష్టికి ఎంత భేదం ఉన్నదో గుర్తించడం అవసరం. చైనా దురాక్రమణ సందర్భములో ఆయన విశ్వజ్యోతి' ప్రత్యేక సంచికలో చైనా అధ్యక్షుడిని వెక్కిరిస్తూ వ్రాసిన వ్యంగ్యరచన నాకింకా స్పష్టంగా గుర్తే ఉంది. అప్పుడు అభ్యుదయ కవులెవరూ నోరు విప్పలేదు. శాక్యముని అన్న రచనలో `2500 ఏండ్లు గడిచిపోవనిప్పుడు తిరుగవచ్చినావ సర్వానికి మిన్నయైన జనయిత్రిని భారత మాతను చూడగ' భారతమాతను సర్వానికి మిన్నయైన జనయిత్రిగా ప్రస్తుతించారు. అందువల్లనే ఆయన `మానుషత్వము బోధింపు కానీ భావమానుషత్వమును కాదు. సత్యధర్మముల కీర్తింపును కానీ ఊహా సిద్ధాంతములుగ మాత్రం కాదు.' అని ఆచరణ ప్రాథమ్యాన్ని తెలుపుతూ సిద్ధాంత మౌఢ్యాన్ని తిరస్కరించారు. తరువాత తరువాత ఆయన అధ్యయన పరిధులు విస్తరించాయి. విశ్వ వ్యాప్తంగా వచ్చిన సామాజిక, ఆర్థిక, తాత్తి్వక, రాజకీయ సిద్ధాంతాలు, సాహిత్య, సంగీత, చిత్ర, శిల్పాదులు, విజ్ఞాన శాస్త్రాంశాలు, ఒకటేమిటి ఏదైనా ఆయన అధ్యయనంలో భాగమే అయింది. భరతుని సంగీత సిద్ధాంతం, విద్యారణ్యుల వేదశాస్త్ర పరిశోధన గ్రంథాలు, సూఫీవాదం భారతీయ చరిత్ర పునర్విలోకనం, భాగవత సంప్రదాయం ఇలా ఎనై్ననా ఆయన విచారణ పరిమితిలో నూతన కాంతులను సంతరించుకున్నాయి. వరంగల్ నగరంలో ఎనభైలలో మొదట పోతన పంచశతి ఉత్సవాలు జాతీయ స్థాయిలో జరగటానికి, చివర్లో విద్యారణ్యులను గురించిన సంగోష్ఠూలు నిర్వహింప బడటానికి ఆయనే మూలకారణం అనడం సత్యోక్తి. ఈ రెండు సందర్భాలలోనూ ఆయనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆ కారణంగా ఆయనతో కొన్ని నెలలపాటు, ఏండ్లపాటు అధ్యయనంలో, చర్చలలో, కార్యనిర్వహణలో పాల్గొనగల్గటం నా అదృష్టమనే చెప్పాలి. చివరి రోజులల్లో డాక్టర్ రాజారాం గారి తోటలో సుమారు రెండు వందల ఉపన్యాసాలు భారతీయ చరిత్రను గురించి ప్రపంచ తాత్తి్వకుల గురించీ ్టవులను గురించీ చేసిన ప్రసంగాలు అమూల్యమైనవి. వాటిని సంపాదించి ఎడిట్ చేసి ప్రచురించగలిగితే ఒక నూతన భాండాగారం వివృత కవాటం అవుతుంది. శ్రీ అరవిందులు, జిడ్డు కృష్ణమూర్తి దాకా ఆయన స్పృశించని అంశం ఉండేది కాదు.
Wednesday, February 11, 2009
మహాభారత తాత్పర్యము
ఇక్కడ ఉన్నదే ఎక్కడైనా ఉన్నది. ఎక్కడ లేనిది ఎక్కడా లేదు. అన్న వ్యాసుడి వాక్యం మహాభారతాన్ని స్థూలంగా వర్ణించేది. విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రతి అంశం దీనిలో నిక్షిప్తం కావడం వల్ల విశ్వం యొక్క తాత్పర్యం గ్రహించడం ఎంత కష్టమో, దీని తాత్పర్యం గ్రహించడం అంతే కష్టం. మహాభారత ఆరంభంలో రెండు చెట్లను వ్యాసుడు వర్ణించాడు. యుధిష్ఠిరుడనే ధర్మ వృక్షము, దుర్యోధనుడనే మన్యు వృక్షము ఈ గాథకి ప్రధాన ఆధారాలు. రెండు చెట్లు విడిగా వర్ణించడం వల్ల ఈ గాథంతా రెండు ప్రవాహాలుగా, సమాంతరంగా.. కొన్ని చోట్ల ఓతప్రోతంగా ప్రవహించినట్లు గ్రహించవచ్చు. మొత్తం గాథలో శంతనుడి కామ భావం, ఆధారంగా సత్యవతి వివాహం జరగడం భీష్ముడు రాజ్యత్యాగం చేయడం ఈ కథకు ఆధార బిందువు. అయితే, భీష్ముడి వంటి దైవాంశ సంభూతుడు, ఆద్యంతము వ్యాపించి ఉండటము, అతడు సమర సందర్భంలో ధర్మ పక్షంలో కాకుండా అధర్మ పక్షంలో నిలిచి పోవడం ఒక విలక్షణమైన విరోధాభాస. పతితమైన బ్రాహ్మణ్యం శస్త్రాన్ని ధరించడం ద్రోణుడి పాత్రలో వ్యక్తమైతే, ఆతడు ప్రతీకార వాంఛతో ద్రుపదుణ్ణి పరాభవించటం, ఏకలవు్యడి నుంచి గురుదక్షిణగా అంగుష్ఠాన్ని యాచించడం, మొత్తం యుద్ధంలో పాండవులకు వ్యతిరేకంగా ప్రవర్తించటం ఒక విచిత్రమైన సన్నివేశం. అంతేకాక ద్రోణుడి కుమారుడు అశ్వత్థామ ఎప్పుడూ ధర్మ చైతన్యంతో సంబంధం లేకుండా అసూయతో జీవించటం, యుద్ధాంతంలో అపాండవం కరిష్యామి అని చనిపోతున్న దుర్యోధనుడికి వాగ్దానం చేసి నిద్రితులైన ఉప పాండవులను సంహరించటం, గర్భస్థుడైన ఉత్తరాసుతుణ్ణి సంహరించటానికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించటం ఒక పిశాచావేశం లాగా గోచరిస్తుంది. అర్జునుడితో పాటు తాను రుద్ర ఆరాధకుడైనా, రుద్రుడి లోని ఆనుకూల్యాంశం ఇతణ్ణి ఎప్పుడూ ఆవేశించలేదు.
ధృతరాష్ట్రుడికి రాజ్యాధికారం లేకపోవడం, పాండురాజు దిగ్విజయాలు సాధించి అతని చేత నూరు అశ్వమేధాలు చేయించినా, చివరకు అరణ్యవాసంలో శాపగ్రస్తుడై మరణించటం వల్ల ధృతరాష్ట్రుడు, రాజు కావడం సంభవించింది. రాజ్యాధికారం కలిగిన గుడ్డివాడు, అతని ప్రవృత్తి అంతా అంతర్బహిర్చేతనలలో వైరుధ్యంతో పుత్ర మమకారం వల్ల పాండవుల యందు పెంచుకున్న అప్రీతి వల్ల ఒక నాటకంగా జీవితం గడపడం జరిగింది. మహా భారతానికి మొత్తం నాయకుడైన ధర్మరాజు ద్యూత వ్యసనం వల్ల ద్రౌపది దయ వల్ల కలిగిన రాజ్యం కూడా పోగొట్టుకోవడం అరణ్యవాస, అజ్ఞాత వాసములు చేయవలసి వచ్చింది. ధర్మరాజులో ఎంత మెత్తదనం ఉన్నదో అంతటి ప్రతీకారేచ్ఛ కూడా ఉన్నట్టు అది గడుసుదనం వల్ల చప్పబడినట్లు యుద్ధ పర్వాల్లో గోచరమవుతుంది. దుర్యోధనుడు క్రోధము, అసూయ ఈ రెండు లక్షణాలు మూర్తీభవించినవాడు. తనకు జన్మతః సంక్రమించని రాజ్యాధికారాన్ని పొంది దాన్ని ఇతరులతో పంచుకునే ఉద్దేశం లేకుండా దురాశ వల్ల పాండవులను చిన్ననాటి నుంచి ప్రతీకారేచ్ఛతో రూపుమాపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఈ విషయంలో అతడు చేయని దుష్కార్యం, పాపము మరెక్కడా లేదు. దుశ్శాసనుడు కేవలం సేవాధర్మం కలిగిన వాడే తప్ప అతని స్వతంత్రించి చేసిన కార్యమంటూ ఏమీ లేదు. ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో కర్ణుడు ప్రవర్తించిన తీరు సజ్జనులకెవరికైనా సిగ్గు తెప్పించేదే. దుర్యోధనుని వస్త్రాపహరణాది దుష్కార్యాలకు ప్రేరేపించి తన దుష్టమైన వాక్కుల చేత భారతానికే కళంకం ఆపాదించినాడు. అతని లోని ధర్మవేతృత, దానుగుణం, పరాక్రమము, మిగిలిన గుణాలన్నీ ఈ ఒక్క దోషంతో తుడుచుకుపెట్టుకు పోతున్నవి.
అసలు విచిత్ర వీర్యుడు చనిపోయిన తరువాత సత్యవతి ప్రార్థననుసరించి భీష్ముడే రాజ్యాన్ని గ్రహిస్తే, చరిత్ర మరొకరకంగా ఉండేది. ఆతడు రాజు కాకున్నా, కాశీరాజు సభలో ఆతని పుత్రికలను బలవంతంగా తీసుకువచ్చినప్పుడు తరువాత అంబను విడిచిపుచ్చడం, ఆమె తిరిగి రాగా స్వీకరించకపోవడం ఆ పట్టుదలను నిలుపుకోవడం కోసం గురువుతో కూడా పోరాడటం, అనేక సందేహాలకు ధర్మ వైరుధ్యాలకు తార్కాణమైన అంశం. యుద్ధం తరువాత అంపశయ్య మీద నుంచి ధర్మరాజుకు ఉపదేశం చేయడం తాను అంతకు ముందు ఆచరించిన దోషాలను తొలగించుకోవడం కోసం చేసిన ప్రాయశ్చిత్త కర్మగా కనిపిస్తుంది. అతని లోని కృష్ణ భక్తి తత్త్వ జ్ఞానం, ఇవేవీ అంపశయ్య మీదకు చేరేదాకా పనిచేసినట్టు లేవు. భీష్ముడు వసు రుద్రాదిత్యులలో వసువులు భూ చైతన్యానికి చెందిన వారు. అందువల్లనే శరీరాన్ని పోషించిన కౌరవుల యెడ ఆతడు కృతజ్ఞుడై ఉండటం జరిగి ఉండవచ్చు.
మహాభారతంలో ప్రధానంగా మూడు యజ్ఞాలు, కనిపిస్తుంటాయి. సర్పయాగము, రాజసూయం, అశ్వమేథం. సర్పయాగం ప్రతీకార బుద్ధితో ఒక వ్యక్తి చేసిన దోషానికి ఒక జాతిని సంహరించే కార్యం. అంతకు ముందు భార్గవ రాముడు క్షత్రియుల విషయంలో ఇదే పని చేశాడు. ఈ ప్రతీకార బుద్ధి వల్ల సత్వరజస్సులు అణగి తమోగుణం ఆవరిస్తుంది. భారత ఆరంభం ప్రవేశ ద్వారం ఈ తమస్సు చేత నిర్మింపబడ్డది. రాజసూయం రజో గుణ ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది. ధర్మరాజు చక్రవర్తిగా అభిషేకింపబడటం దీని లక్ష్యం. దీని కోసం అతని తము్మలు నిర్వహించిన విజయయాత్రలు హింస లేనివని జన నష్టం లేనివని చెప్పడానికి అవకాశం లేదు. ధర్మరాజు యుద్ధానంతరం చేసిన రాజసూయం ఒక చక్రవర్తి చేయగలిగిన కార్యం. దీన్ని నిర్వహించినప్పుడు ఆ యాగంలో చేయబడే సర్వ త్యాగ లక్షణం చేత అది సత్వమయంగా నిర్వహింపబడి ఉండవచ్చు.
మహాభారతంలో మూడు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఒకటి, సనత్సుజాతీయము, రెండు భగవద్గీత, మూడు విష్ణు సహస్రనామము. సనత్సుజాతీయములో మృత్యువు యొక్క స్వరూపము చెప్పబడింది. మృత్యువంటే ప్రమాదము, ఏమరుపాటు. ఏమరుపాటు లేనివానికి సదా బ్రహ్మచైతన్యంలో నిలిచి ఉండేవానికి మృత్యువు అనేది ఉండదు. మనం అనుకునే మృత్యువు దేహముల యందు మాత్రమే. జాగ్రదవస్థలో నిలిచి ఉండేవాడు నిత్య జన్మ జన్మాంతరాలలో చైతన్య ధార తెగకుండా ఉండటం వల్ల మృత్యు అనుభవాన్ని పొందనే పొందడు. అట్లాగే భగవద్గీత కూడా మృత్యు తత్వాన్నే ప్రధానంగా ప్రస్తావించింది. ``కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః'' నేను మృత్యు స్వరూపాన్ని లోకాన్ని నశింపజేయడం కోసమే ప్రవర్తిస్తున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ జీవితమంతా మృత్యుముఖంగా పయనించడమే దీని యథార్థ తత్త్వం. ఈ మృత్యు రహస్యాన్ని చెప్పడం కోసం కథాగతంగా నడుమ సావిత్రి ఉపాఖ్యానాన్ని వ్యాస మహర్షి ప్రపంచించడం జరిగింది. మృత్యువును తరించే లక్షణము ఈ గాథ ఉపనిషత్ సంప్రదాయం ప్రకారం నిర్వహించవలసిన యోగ రహస్యాన్ని చెప్పడం కోసం తెల్పబడింది. విష్ణు సహస్రనామము కూడా విశ్వం అనే శబ్దంతో ప్రారంభమై సర్వప్రహరణాయుధ శబ్దంతో పూర్తయి సృష్టి అంతా మృత్యుతీరానికి చేరుతున్న అంశాన్ని తెలియజేస్తుంది. అందువల్లనే మహాభారతానికి మృత్యువు పుత్రుడైన ధర్మరాజు నాయకత్వం వహిస్తున్నాడు. మొత్తం మహాభారతం సర్పయాగం నుంచి స్వర్గారోహణం దాకా మృత్యుహేలయై ప్రవర్తించింది. పాండవులందరూ మృత్యు పుత్రుడు తప్ప చివరకి మృతి చెందారు. అతని స్వర్గారోహణం కూడా నరక దర్శనం చేత మృత్యు తత్తా్వన్ని మరల మరల గుర్తు చేస్తుంది. అతని వెంట నడిచి వచ్చిన ధర్మరూపమైన శునకం కూడా మృత్యువునకు ప్రతీకయే కావచ్చును.
ఈ మొత్తం ఇతిహాసానికి కేంద్ర బిందువైన ద్రౌపది అగ్ని సంభూత. ఈ అగ్ని పంచభూతాలలో కేంద్ర స్థానంలో నిల్చి ఉంటుంది. పంచభూతాలు పంచపాండవులైతే, అగ్ని పార్థుడవుతాడు. ఈ పార్థుడు నరనారాయణులలోని నరుడనే తపస్వి. ఈ మృత్యుక్రీడ కోసం లోకంలో తమోమయ, రజోమయ శక్తులను తొలగించివేయడం కోసం అర్జునుడుగా ఈతడు అవతరించి లయకారకుడైన శివుని వరాన్ని పొంది కురుపాండవ యుద్ధాన్ని మొత్తం నిర్వహించాడు. భగవంతుడైన శ్రీకృష్ణుడు ఈ మొత్తం ఇతిహాస ప్రవర్తనలో ఎక్కడా ప్రత్యక్షంగా జోక్యం కలిగించుకోలేదు. ఒక్క ద్రౌపది వస్త్రాపహరణ సందర్భంలో మాత్రమే ఆయన వస్త్రప్రదానం చేసి ఆమెను రక్షించడం ద్వారా సర్వ జగత్ ప్రవృత్తికి మూలమైన స్త్రీత్వాన్ని చెదరకుండా కాపాడటం జరిగింది. మిగిలిన అన్ని సందర్భాల్లో ఆయన సాక్షీభూతుడే. భగవద్గీత ఎంత ప్రవర్తించినా, దాని సారంగా తేలేది తస్మాత్ యుధ్యస్వ అన్న మాటయే. యుద్ధం చేయమని చెప్పడం స్థితికారకుడైన నారాయణ లక్షణం కాకుండా, రుద్రాంశ ఆవరించిన శివుని లక్షణంగా కనిపిస్తుంది. మొత్తం మహాభారతంలో ఈ దృష్టితో చూసినప్పుడు ఇదంతా హరిహరుల క్రీడవలె, మహామాతృ అంశమైన కాళికాదేవి వైభవం వలె గోచరిస్తుంది. ద్రౌపదీదేవి కాళికాదేవి యొక్క రూపాంతరమే.

Sunday, February 8, 2009
గురుకుల వ్యవస్థ భారతీయ విద్యామూలసూత్రం
ప్రాచీన నాగరకతల్లో దాని నిరంతర అభివృద్ధిలో ఆ సమాజంలోని వ్యక్తుల శక్తులు అవగాహనలో లక్ష్యాలు, ఆకాంక్షలు, స్వప్నాలు అన్నీ ప్రాధాన్యం వహిస్తాయి. విద్య కూడా వీటన్నింటినీ ఆశ్రయించి జనాన్ని ముందుకు నడిపించే దివ్యరథం లాంటిది. విద్యలో నాలుగు రకాలు కానవస్తాయి.
1. జీవిక కోసం అవసరమైన వృత్తులు, నైపుణ్యాలు అభ్యాసము, వీటిని స్థూలంగా గ్రామీణ జీవన మారా్గలుగా నిర్దేశించుకోవచ్చు. వ్యవసాయం కుమ్మరి, కమ్మరి, కంచరి, మంగలి, చాకలి, నేత, కంసాలి మొదలైన విద్యలన్నీ ఈ శ్రేణిలో చేరుతాయి. సాధారణంగా ఈ విద్యకు ఇల్లే విద్యాలయంగా తండ్రియే గురువుగా కొనసాగుతుంది. ఆ గృహంలోని వ్యక్తుల పరంపరలో ఈ విద్యాసూత్రం తరానికీ, తరానికీ నైపుణ్యాన్ని సమకూర్చుకుంటూ అవసరాన్ని బట్టి సాంకేతికతను పెంచుకుంటూ ముందుకు సాగుతుంది.
2. సమాజ వ్యవహారానికి అవసరమైన వ్యాపారము, ఎగుమతులు దిగుమతులు, నిత్యావసర వస్తువుల వినిమయము, తొలుత పేర్కొన్న వృత్తుల వారు ఉత్పత్తి చేసిన వస్తువులను సమాజానికి పంచటం.. ఈ రకమైన వ్యవహారమంతా వణిక్ వృత్తిలో సార్థవాహ రీతిలో దగ్గరకూ దూరానికీ అందజేస్తూ తమ జీవితాన్ని కూడా దీని ద్వారా నడుపుకొనే విధము.
3. గ్రామాలకు, పట్టణాలకు, జనపదాలకు, రాష్ట్రానికి అనేక విధాలైన ఆపదలు, ఇబ్బందులు కలిగే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. క్రూర మృగాల వల్ల, దొంగల వల్ల, బర్బరుల వల్ల, శత్రువుల వల్ల, ప్రాకృతిక బీభత్సాల వల్ల సమాజం అల్లకల్లోలం అవుతుంది. ఈ సందరా్భలలో సమాజాన్ని రక్షించే జనశ్రేణులు రెండు రకాలుగా అవసరమవుతాయి. ప్రాకృతిక బీభత్సాలలో నష్టపోయిన సందర్భంలో వారిని సేవించే సాధు సజ్జన బృందం, శత్రువులు మొదలైన వారి వల్ల ప్రాణ భీతి ఏర్పడ్డప్పుడు ఆస్తులకు నష్టం కలిగినప్పుడు రాష్ట్రం పరాధీనమయ్యే సందర్భం వచ్చినప్పుడు రక్షించే సైన్య శ్రేణి ఒకటి. ఈ సందర్భంలో సమాజానికి సేవ చేసే ధార్మిక సంస్థలు ఉదార జన సమూహం ఎంత అవసరమో శస్త్ర బలం వల్ల ధనుర్విద్యాదుల వల్ల శత్రువులను ఎదుర్కొని దేశాన్ని రక్షించగల సైనిక సమూహమూ అంతే అవసరము.
4. సమాజ పురోగతిలో అవసరమైన భావనలు పరికల్పనలు, లక్ష్య నిర్దేశాలు భావించే వర్గం ఒకటి. వీరు సమాజాన్ని అట్టడుగు నుంచి శిఖరాల దాకా ఉండిన స్థితిని పరిశీలించి విశే్లషించి నూతన మారా్గన్ని ప్రణాళికను ఆచరణ క్రమాన్ని వ్యాఖ్యానిస్తారు. వీరి పరిశీలనలో మానవుడికి మానవుడికీ నడుమ ఉండే సామరస్యం మాత్రమే కాక, మానవుడికీ, ప్రకృతికీ ఉండవలసిన సామరస్యం, మానవుడికీ, ఈశ్వరుడికీ ఉండవలసిన సామరస్యం, అతని అంతర్బహిర్లోకాల సామరస్యం ప్రధాన వస్తువులు అవుతవి. దీనిని ఆసాంతమూ అవగాహన చేసుకోవటానికి సృష్టి రహస్యం, సృష్టి వికాసము, గ్రహ, నక్షత్ర, గోళముల స్థితిగతులు, ఋతువులు, భౌగోళిక పరిస్థితులు చరాచర జంతుజాలము భూగర్భ రహస్యము, వ్యాధులు, తన్నివారణలు, ఆసందర్భంలో మనిషికి ఓషధులే కాక ఆత్మ విశా్వసాదుల వల్ల కలిగే శక్తి ఇవన్నీ ఇక్కడ ప్రాధాన్యం వహిస్తాయి.
ఈ నాలుగు విధాలైన ప్రావీణ్యం సమాజాన్ని ముందుకు నడుపుతుంది. ఇతర సమాజాలతో అనుబంధాన్ని పెంచుతుంది. ప్రకృతితోడి సామరస్యంతో జీవనాన్ని సుఖమయం చేస్తుంది. అంతర్ముఖమైనప్పుడు శాంతిని బహిర్ముఖమైనప్పుడు సమృద్ధిని జీవన లక్ష్యంగా నిర్దేశిస్తుంది. భారతీయ విద్యానిరా్మణ భావనలో ఈ నాలుగు పారా్శ్వలు తమతమ ప్రాధాన్యాన్ని ఆశ్రయించి ముందుకు సాగుతూ వచ్చాయి. అందువల్లనే ఈనాడు విద్య అన్న భావనకు ఉన్న పరిమితి ఆనాడు లేదు. యావిద్యా సా విముక్తయే అనగా ఏది మానవుణ్ణి అనేక బంధాల నుంచి విముక్తుణ్ణి చేస్తుందో అదియే విద్య అనబడుతుంది.
పైన పేర్కొన్న క్రమంలో మొదట పేర్కొన్న వృత్తులు గ్రామంలో కుటుంబాన్ని ఆశ్రయించి ప్రవర్ధిల్లినవి. రెండవ పద్ధతి వాణిజ్యం మొదలైనవి కూడా కుటుంబాన్ని, గ్రామాన్ని కలుపుకున్న సమన్వయంలో నుంచి సాగి వచ్చినవి. ఉత్పత్తి చేసే వ్యక్తి నుంచి వ్యక్తి దాన్ని సేకరించి అందరికీ అందజేయటం దాని విలువను గ్రహించి ఉత్పత్తి దారునికి ఎక్కువగా, తనకు తక్కువగా, తన జీవికకు తక్కువగా సాధించవలసి ఉంటుంది. మూడవది రాజ్య వ్యవస్థలను, అధికార వ్యవస్థలను ఆశ్రయించి సాగవలసింది. దీనికి బలాన్ని చేకూర్చే ఉదార వితరణ శీలమైన జనసమూహము సేవాభావం గల వ్యక్తులు అవసరము. అట్లాగే సమాజ రక్షణ కోసం తమ ప్రాణానై్ననా అర్పించగల సైనికులు రక్షకులు మొదలైన వారి వ్యవస్థ అవసరము. నాలుగవది, ఇది ఉపరితలం మీద కాక, అంతర్గతంగా సమాజానికి కావలసిన భావ భూమికలోని పరివర్తనను, పురోగమనాన్ని నిర్దేశిస్తూ సాగిపోయేది. వ్యాకరణమైనా, తర్కమైనా, మీమాంస అయినా, జ్యోతిష్య శాస్త్రమైనా... ఏ శాస్త్రమైనా ప్రత్యక్షంగా సద్యః ఫలదాయకాలు కాకపోయినా, సమష్టిగా మనో భూమిక మీద పరిణామాన్ని తీసుకువచ్చింది. దీనికి కావలసింది దీర్ఘమైన సాధన. నిరంతర సమాలోచన. చర్చ. అంతర్ముఖంగా భావించటం. బుద్ధిని అన్ని పారా్శ్వలలో మేల్కొల్పటం. ఇలాంటి స్థితిలో జీవించటం వల్ల ప్రత్యక్షంగా భౌతిక జీవనానికి లాభం కానరాకపోయినా, పరోక్షంగా ఆ చక్రపు అంచులను ఒరిపిడి పెట్టి తేజోమయ సుదర్శనంగా పరిణమింపజేయవచ్చు.
నాలుగవ భావశ్రేణి ముందు క్రిందికి ప్రసరించిన కిరణాల్లోనుంచి అనేక జ్ఞాన భేదాలు శాఖలు అవతరిస్తాయి. మానవ జీవన అనుభవమంతా ఒకే ద్రవ్యరాశిగా తీసుకొని దాన్ని సార్వజనీనంగా, సార్వకాలికంగా అభివ్యక్తం చేసినప్పుడు సామాన్య శబ్దం కావ్యమవుతుంది. కూనిరాగం సంగీతం అవుతుంది. తంత్రులు గానం చేస్తాయి. చేతులు, కాళు్ల కదిలిస్తే నాట్యమవుతుంది. శిలను తాకితే శిల్పమవుతుంది. సామాన్యమైన శబ్దాదులకు తాత్కాలిక స్ఫూర్తియే ప్రధానం కాగా అనుభవ సముద్రం లోంచి పుట్టుకువచ్చిన ఈ అంశాలు సార్వకాలీనతను సంతరించుకుంటాయి. అట్లాగే దీని అనుభవంలోనికి వచ్చిన వ్యక్తులు అసామాన్యమైన సౌకుమారా్యన్ని, ఆర్ద్రతను సర్వమందు సౌందరా్యన్ని చూడగలిగిన లక్షణము సంపాదించుకుంటారు. అట్లాగే ప్రకృతిలోని కొన్ని ద్రవ్యాలను శారీరక రుగ్మతల నివారణ కోసం ఉపయోగించే గృహ చికిత్సా సంప్రదాయంలోంచి తాత్తి్వక విశే్లషణ తార్కిక సంగతి కలసి వైద్యశాస్త్రం పుడుతుంది. చరకుడు, శుశ్రుతుడు ఈ త్రోవ నుంచి వచ్చిన వారే. ఇలా అనేక శాస్త్రాలకు ప్రేరణలు నాలుగవ శ్రేణి భావ భూమిక నుంచి ప్రసరించి ప్రథమ శ్రేణి వృత్తుల జీవన మారా్గల ఒత్తిడి లోనుంచి నూతన అంశాలు విజ్ఞాన భూములై ప్రకాశిస్తాయి.
భగవన్ అధీహి మే బ్రహ్మన్ అని యాచించిన కుమారునికి తండ్రి తపస్సు చేయమని చెప్పి ఆ తపస్సు ద్వారా కుమారుడు అన్నమును, ప్రాణమును, మనస్సును, విజ్ఞానమును క్రమంగా బ్రహ్మమని భావిస్తూ తనను దిద్దుకుంటూ ఆత్యంతికంగా ఆనందమే బ్రహ్మమని తెలుసుకుంటాడు. తన కుమారుడు బ్రహ్మవిద్యాభిలాష ఉత్కటంగా కలిగినప్పుడు తనను వేధించగా యముని గురువుగా సూచించి అక్కడికి తన పుత్రుని పంపించి, అతనిని బ్రహ్మ విద్యావేత్తగా తీర్చిదిద్దడం కఠోపనిషత్తులో కనిపిస్తుంది. బృహదారణ్యకంలో జనకుడి సభలో అనేక మంది విద్వాంసులు బ్రహ్మజ్ఞానమును గూర్చి చర్చించడం, పరమార్థమును చేరుకోవటం, సమష్టిగా పరిషత్తుల వల్ల సాగినట్లు కనిపిస్తుంది. ఒక జిజ్ఞాసువు, ప్రశ్నను విప్పుకోవటానికి మరొకని దగ్గరకు చేరగా ఆతడు మరొక గురువు దగ్గరకు తీసుకుపోవటం.. ఇలా పరంపరగా తమకు సమాధానం లభించే వరకు అనే్వషిస్తూ పోవటం ఇంకొక అధ్యయన మార్గం. ఇలా ఉపనిషత్తులలో అనేక గురుకులాలు ఏర్పడి ఉన్నట్లు జ్ఞాన విజ్ఞాన ప్రసారాలు నిరంతరాయంగా సాగినట్లు సాక్ష్యాలు కొల్లలుగా కనిపిస్తాయి.
గురుకులాలు ఉపనిషత్తుల కాలంలో నగరాలకు దూరంగా జనపదాలకు దూరంగా అడవులలో ఉండేవి. అక్కడే ఆశ్రమాలు, అక్కడే గురువులు, అక్కడే విద్యాస్థానాలు శిష్యులు తమకు తగిన గురువును వెతుక్కుంటూ అతనిని ఆశ్రయించటం, అతని వల్ల తాము కోరుకున్న విద్యను సంపాదించటం నాటి ప్రధాన ధోరణి. ఈ గురుకులాలు ప్రధానంగా గురువు కేంద్రంగా, శిష్యపరంపర అతణ్ణి ఆశ్రయించిన జిజ్ఞాసు సమూహంగా సంయోజింపబడి ఉండేది. శిష్యుని అంగీకరించటం, అతనికి ప్రవేశం కల్పించటం గురువు ఇష్టం మీద ఆధారపడి ఉండేది. అట్లాగే గురువును ఎన్నుకోవటం, ఆ గురువును ప్రసన్నుణ్ణి చేసుకుని తనకు కావలసిన విద్యను సంపాదించటంలో శిష్యునికి స్వేచ్ఛ ఉండేది. ఈనాటి విద్యావిధానంలో గురువునకు కానీ, శిష్యునికి కానీ ఈరకమైన స్వేచ్ఛ కనిపించదు. గురుకులాలలో శిష్యులు క్రమశిక్షణ కలిగి గురు కుటుంబానికి శుశ్రూష చేయవలసి ఉండేది. నియతమైన శుల్కం కానీ, మరో విధి కానీ, ఉండేది కాదు. విద్యా స్వీకరణం తరువాత శిష్యుడు తనకు తోచినది, సాధ్యమైనది గురుదక్షిణగా ఇచ్చే అవకాశం మాత్రం ఉండేది. గురుకులాలలో శిష్యులకు కావలసిన అన్నపాన వ్యవస్థ గురువులే చేసేవారు. అలా పదివేల మంది విద్యార్థులకు వ్యవస్థను ఏరా్పటు చేసిన వ్యక్తి కులపతి అని వ్యవహరింపబడేవాడు. ఈ గురుకులాలలో ప్రధానుడైన కులపతి కాకుండా అనేక మంది వివిధ విద్యా విభాగాలను నిర్వహించే విద్వాంసులు ఉండేవారు. మనకు ఇతిహాసాలలో ఆశ్రమంలో ఉండే విద్యా విభాగాల పరిస్థితి కానవస్తుంది. ప్రాన ఋష్యాశ్రమాల ప్రసక్తి అనేక చోట్ల కానవస్తుంది. ఇతిహాసాల కాలంలో వశిష్ట, విశా్వమిత్ర, వామదేవ, భరద్వాజ, అత్రి, కణ్వ, గృష్ణమద ఋషుల ఆశ్రమాలు సనాతన విద్యాసంప్రదాయాన్ని, వ్యవస్థను రక్షించినట్లుగా కనిపిస్తుంది. ఈ ఋషి కులాలలో ఒక్కొక్క చోట ఒక ప్రత్యేక వేద శాఖాధ్యాయనమో, శాస్త్రాధ్యయనమో నియతంగా చేయబడేది. ఒక ఆశ్రమంలో ఉండే విద్యావిభాగాలను మనం పరిశీలించి చూస్తే ఆ వ్యవస్థ ఎంత విపులంగా విశ్వ రహస్య వేతృతను భౌతిక జగత్ పరిణామాన్ని, మానవ చైతన్య విస్తారాన్ని, సృజనాత్మక చైతన్యాన్ని వ్యాఖ్యానించేదో తెలియవస్తుంది. ఆనాటా ప్రధాన విద్యాస్థానాలు ఇవి.
1. అగ్నిస్థానం: అగ్ని ఉపాసనకు, యజ్ఞ యాగాదులకు, ఉపాసనలకు ఆధారభూతమైన స్థానం.
2. బ్రహ్మస్థానం: చతుర్వేదాలను సస్వరంగా అధ్యయనం చేసే చోటు.
3. విష్ణుస్థానం: రాజనీతి, అర్థనీతి, వార్త మొదలైన క్షత్రియోచిత విద్యలకు నెలవు.
4. మహేంద్రస్థానము: సైన్య శిక్షణకు సంబంధించిన స్థానము
5. వివస్వత స్థానము: జ్యోతిషము(గ్రహ, నక్షత్ర విద్య)
6. సోమస్థానము: వృక్షములు, ఓషధులు వానికి సంబంధించిన విద్య.
7. గరుడ స్థానము: ప్రయాణాలు, వాహనములు మొదలైన వానిని అధ్యయనం చేసే స్థానము.
8. కార్తికేయ స్థానము: సైన్య వ్యవస్థను ఏరా్పటు చేసే విధము, వివిధ విభాగాల నిర్వహణ, గ్రామ, జనపద, దేశ రక్షణకు సంబంధించిన విద్య.
వీటిని గమనిస్తే కేవలం ఉదాహరణ ప్రాయంగానే చెప్పినట్లుగా తెలియవస్తుంది. వేదాంగాలు, దర్శనాలు, ప్రాతిశాఖ్యలు, నాట్య, సంగీత, శిల్ప విద్యలు మొదలైనవి ఇక్కడ చెప్పబడలేదు.
పురాణాలలో మనకు ప్రసిద్ధంగా కనిపించే నైమిశారణ్యం ఒక విశ్వవిద్యాలయం లాంటిదే. ఇక్కడ పురాణ విద్యాధ్యయనం, ప్రవచనము నిరంతరంగా సాగేది. శౌనకుడు ఈ గురుకులానికి అధిపతి. సుమారు పదివేల మంది విద్యార్థులు ఇక్కడ అధ్యయనం చేసేవారు. మాలినీ నదీ తీరంలో కణ్వమహర్షి ఆశ్రమం ఉండేది. ఈ ఆశ్రమంలో నాలుగు వేదాల అధ్యయనానికి, కల్పసూత్రాలు, ఛందస్సు, వ్యాకరణము, నిరుక్తము, న్యాయము, శుల్బశాస్త్రము, జంతు శాస్త్రము మొదలైన అనేక శాస్త్రముల అధ్యయనము జరిగినట్లుగా తెలియవస్తున్నది. భరద్వాజ మహర్షి ఆశ్రమం ప్రయాగలో, చిత్రకూటంలో అత్రి మహర్షి ఆశ్రమము, అగస్త్య, శరభంగ మహర్షుల ఆశ్రమాలు రామాయణంలో ప్రసక్తమవుతాయి. అగస్త్య మహర్షి ఒక వైపు శాస్త్రాన్ని, మరోవైపు శస్త్రాన్ని ధరించి శ్రీరామ చంద్రునికి శత్రుసంహార కార్యక్రమంలో సహాయ పడినట్లుగా తెలియవస్తుంది. వ్యాసమహర్షి ఆశ్రమంలో సుమంతుడు వైశంపాయనుడు, పైలుడు, జైమిని అన్న నలుగురు శిష్యులు నాలుగు వేదాలను అధ్యయనం చేయడమే కాక, వారి విజ్ఞానం ద్వారా నూతన శాస్త్రాలకు ప్రవక్తలైనారు. వ్యాసుడి కుమారుడు శుక మహర్షి భాగవత సంప్రదాయాన్ని ముందుకు నడిపించి దేశంలో నూతన ఉద్యమానికి కారకుడైనాడు. వశిష్ట మహర్షి విశా్వమిత్ర మహర్షి ఆశ్రమాలు సరస్వతీ నదీతీరంలో ఉన్నట్లుగా తెలియవస్తున్నది. విశా్వమిత్రుడు మంత్రద్రష్టయే కాక, అనేక శస్త్రాస్త్రములను సంపాదించినట్లుగా, వాటిని శ్రీరామచంద్రునికి ప్రదానం చేసినట్లుగా రామాయణం తెలియజేస్తున్నది. అవతార పురుషుడైన శ్రీకృష్ణుడు సాందీపని గురుకులంలో విద్యాభ్యాసం చేసి సకల శాస్త్రాలలో ప్రావీణ్యం సంపాదించిన సంగతి భాగవతం వల్ల అవగతమవుతున్నది.
పురాణాల కాలం దాటిన తరువాత గురుకుల వ్యవస్థ విస్తరించి విశ్వవిద్యాలయాలుగా పరిణమించటం మనం గమనించవచ్చు. తక్షశిల, ఉజ్జయిని, నలంద, వారణాసి, వల్లభి, అజంత, మధుర, విక్రమశిల మొదలైనవి చాలా ప్రసిద్ధమైనవి. ఇవి కాక కాంచి, అమరావతి మొదలైన చోట్లలో విస్తృతమైన విద్యావ్యవస్థ దేశ దేశాల నుంచి విద్యార్థులను ఆకర్షించేవి. విద్యాసంవత్సరం ఉపక్రమణమనే ఉత్సవంతో ప్రారంభమై ఉత్సర్గం అనే ఉత్సవంతో పూర్తయ్యేది. అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమలు సాధారణంగా అనధ్యయన దినాలు. పెద్దలు ఆశ్రమానికి వచ్చినప్పుడు ప్రకృతి విపత్తుల కాలంలోనూ అనధ్యయనాలు కొనసాగేవి.
పురాణ కాలం తరువాత బౌద్ధ మతం వ్యాపించిన కాలంలోనూ ఈ విద్యావ్యవస్థ వలికంగా అలాగే కొనసాగింది. కొన్ని నూతన అధ్యయన శాఖలు విస్తరించినా, వలిక స్వరూపం అది మాత్రమే. ఆరోజుల్లో ప్రదానమైన విశ్వవిద్యాలయం తక్షశిల. తక్షశిలా విద్యాలయ గాథ అతి ప్రానమైన కాలం నుంచి కొనసాగుతూ వస్తున్నది. క్రీస్తు పూర్వం ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతమైన విద్యాబోధన సాగేదని చరిత్ర చెప్తున్నది. దేశంలోని నాలుగు మూలల నుంచి చైనా మొదలైన విదేశాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి గురువుల పాదాల వద్ద కూర్చొని విద్యాభ్యాసం కొనసాగించేవారు. జాతక కథల్లో తక్షశిలలోని విద్యావ్యవస్థను గూర్చిన అనేక వివరాలు కానవస్తాయి. ఒకానొక సందర్భంలో నూట ముగ్గురు రాజకుమారులు ఈ విద్యాలయంలో విద్యార్థులుగా ఉన్నట్లు తెలియవస్తున్నది. జాతక కథల్లో నూట అయిదు పరా్యయాలు తక్షశిల ప్రసక్తి కనిపిస్తుంది. క్రీస్తు శకం 455 సంవత్సరంలో హూణులు ఈ విశ్వవిద్యాలయాన్ని విధ్వంసం చేశారు. ఈ విశ్వవిద్యాలయ అధ్యయనంలో వేదములు, అష్టాదశ శిల్పశాస్త్రాలు నేర్పబడేవి. అట్లాగే వైద్యశాస్త్రం, న్యాయశాస్త్రం, ధనుర్విద్య, సైన్య విద్య ఇక్కడ ప్రఖ్యాతంగా బోధింపబడేవి. సంగీతము, నాట్యము, నాటకము, మొదలైనవి ఇక్కడి విశేష విద్యాశాఖలుగా ఉండేవి. దక్షిణాదిలోనూ శిలప్పదికారము ప్రకారం విద్యాస్థానాలు అనేకంగా ఉన్నట్లుగా సాక్ష్యాలు లభిస్తున్నాయి.
తక్షశిల తరువాత ప్రసిద్ధమైన విద్యాస్థానం వారణాసి. వారణాసిలో అనేక శాస్త్రాలు ఆపాదచూడము అధికరింపబడేవి. ఇక్కడ అనేక మంది శాస్త్రవేత్తలు సముద్రముల వలె ప్రఖ్యాతులై దూరదూరాల నుంచి వచ్చే విద్యార్థులను ఆయా శాస్త్రాలలో ప్రావీణ్యం కల్పించేవారు. ఇక్కడి విద్యావేత్తలు ఆయా క్షేత్రాలలో శిఖర స్థానాలలో ఉండేవారు. కాశీనగర ప్రశస్తి ఇటీవలి కాలం దాకా కూడా కొనసాగుతూ వచ్చింది. మహామహోపాధ్యాయులు, శాస్త్ర రత్నాకరులు, బహుముఖ ప్రజ్ఞాపారంగతులు ఇక్కడ విశే్వశ్వరుని కొలువులో విద్యాధ్యయనమే ఒక అర్చనగా కొనసాగిస్తూ వచ్చినారు. ఇరవయ్యో శతాబ్దం ఆరంభంలో తెలుగుదేశం నుండి అనేక విద్వాంసులు కాశీకి వెళ్లి అధ్యయనం చేయడం మనకు తెలుసు. మా పితామహులు శ్రీమాన్ కోయిల్ కందాడై రంగాచార్య స్వామి వారు విద్యాధ్యయనం తరువాత కాశీ పండితుల నుండి వచ్చిన ప్రశ్నలకు సమాధానం పంపించి వారి ప్రశంసలు పొందారు.
భారత దేశాన్ని ఒక పవిత్ర క్షేత్రంగా విద్యాకేంద్రంగా భావించి వేలాది మైళు్ల ప్రయాణం చేసి విద్యాభ్యాసం చేసిన వాడు పాహియాన్, హూ్యన్‌త్సాంగ్ మొదలైన వాళు్ల. పాహియాన్ తన యాత్రా చరిత్రలో ఇక్కడి విద్వాంసులు విద్యను శాస్త్రాన్ని సమగ్రంగా సరహస్యకంగా నేర్చిన వారని గ్రంథ రహస్యాలను తాత్పరా్యన్ని వ్యాఖ్యానించగల వారని పేర్కొనటం మనం గమనించవచ్చు. ప్రతి విశ్వవిద్యాలయంలోనూ స్నాతకోత్తర విద్యాకేంద్రం అక్కడి విద్వాంసులందరి కలయికగా, ఒక పరిషత్తుగా ఏర్పడి ఉండేది. ఈ విద్వాంసులందరూ ఒక్కొక్క శాస్త్రంలో నిష్ణాతులు. అప్పుడప్పుడు వీరు విద్యాలయంలోని అధ్యయనాంశాలను పరిశీలించి తగిన మార్పులను సూచించేవారు. వీరిని శాస్త్రానికి ప్రతీకలుగా ఆరోజుల్లో భావించేవారు. బౌద్ధ స్థానాల్లో విహారాలలో సంస్కృతాధ్యయనం తగిన ప్రాధాన్యాన్ని కలిగి ఉండేది. బుద్ధుడు తన బోధనలను పాలీ భాషలో వ్యాపింపజేసినా, సంస్కృతాధ్యయనం శిఖర స్థానంలో ఉండేది. ఆ తరువాత ప్రసిద్ధమైన గురుకులాలలో నలంద, వల్లభి, విక్రమశిల, జగద్గళ, ఓదంతపురి, నవద్వీపము పేర్కొనదగినవి.
వీటికంటే ప్రానమైన మిథిల ఇటీవలి కాలం దాకా కూడా ప్రముఖ విద్యాస్థానంగానే వెలుగొందింది. నవ్యన్యాయ శాస్త్రానికి ప్రధాన గ్రంథమైన తత్త్వచింతామణి.. పదిలక్షల పుటల వ్యాఖ్యానం ఇక్కడ విశేషంగా అధ్యయనం చేయబడేది. నలంద విశ్వవిద్యాలయంలో విజ్ఞాన శాస్త్రాలు, వైద్యము, భాషా శాస్త్రము యోగము, వేదాంతము, వ్యాకరణము ప్రధాన పాఠా్యంశాలు. నిన్నమొన్న భారత మాజీ రాష్టప్రతి ఎపిజె అబ్దుల్ కలాం నలంద విశ్వవిద్యాలయం యొక్క పునరుద్ధరణ గురించి సూచించటం ఆ రాష్ట్ర ప్రభుత్వం దానిని ముందుకు తీసుకుపోవుటకు అంగీకరించటం మనకు తెలిసిందే.
వల్లభి విశ్వవిద్యాలయం కథియావాడ్ ప్రాంతానికి చెందింది. విక్రమశిల విశ్వవిద్యాలయం ఎనిమిదవ శతాబ్దంలో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. వీటన్నింటిలో జైన బౌద్ధమతాలు, వేద వేదాంగాలు, వైద్యం, సాంకేతిక శాస్త్రాలు, భౌతిక శాస్త్రము, వ్యాకరణం సుష్ఠుగా నేర్పబడేవి. విక్రమ శిల విద్యాలయంలో శాస్త్రవేత్తల విద్వాంసుల చిత్రాలు కూడా చిత్రింపబడినట్లుగా చరిత్రలో సాక్ష్యాలు లభిస్తున్నాయి. నవద్వీపంలో పండితుల నడుమ శాస్త్రారా్థలు జరిగిన తీరు కావ్యకంఠ గణపతిముని చరిత్ర వల్ల మనకు విశదమవుతున్నది. వీటిలో చాలా విశ్వవిద్యాలయాలు పదమూడో శతాబ్దం దాకా వైభవంగా ప్రకాశించినవి. మనం హిందూ బౌద్ధ మతాల నడుమ ఏదో అనివార్యమైన శత్రుత్వం ఉన్నట్లుగా ఈనాడు చరిత్రలో చదువుకుంటున్నాం. కానీ ఈ విశ్వవిద్యాలయాల విద్యాప్రణాళికలను గమనిస్తే, ఈ రెండు ధరా్మలకు నడుమ సామరస్యం, సహజీవనం కొనసాగినట్లుగా తెలియవస్తున్నది. ఇస్లాం దండయాత్రలతో గ్రంథాలయాల దహనం, పండితులను సంహరించటం, విశ్వవిద్యాలయ స్థానాలను భగ్నం చేయటం మొదలైన క్రూర చర్యలతో ఇవి అన్నీ శైథిల్యాన్ని పొందాయి. ఇటీవలి కాలం దాకా భారతీయ గురుకుల వ్యవస్థ అక్షతంగా సామాన్య పండితుల గృహాలలో పితృపుత్ర సంప్రదాయంగా, గురుశిష్య పరంపరగా కొనసాగుతూ ఉన్నది. ఈనాటికీ, శృంగేరీ మొదలైన పీఠాలు శాస్త్రారా్థలు, చర్చలు కొనసాగిస్తూ ప్రాన విద్యావ్యవస్థ మూలాలను అవిచ్ఛిన్నంగా కాపాడుతూ ఉన్నాయి. గురుకుల వ్యవస్థలోని కొన్ని వలిక అంశాలను గ్రహించి పద్ధెనిమిదో శతాబ్దంలోని పాశా్చత్య విద్వాంసులు ఇంగ్లండు మొదలైన దేశాలలో తమ విద్యావిధానాన్ని పరివర్తన చేసుకున్నట్లుగా వారు రాసిన నివేదికల వల్ల అవగతమవుతున్నది. అధిక సంఖ్యాకుల సంస్కృతికి, భాషలకు వారి శాస్త్రాధ్యయనానికి దమన శీలంగా కొనసాగిన నిజాం పరిపాలనలో కూడా మారుమూల, చిన్న చిన్న పల్లెటూళ్లలో తమ పూరి పాకలలో చిన్ని చిన్ని గృహాలలో పేదలైన పండితులు ఈ శాస్త్రాలను, సంస్కృతిని, భాషలను రక్షించి తమ సృజనాత్మకతకు దీప్తిని అనుస్యూతిని కల్పించారు. తిరుపతి, శ్రీరంగం, మధుర మొదలైన క్షేత్రాలు ఎక్కడికక్కడ తమ పరిమితిలో విద్యావ్యవస్థను పరిరక్షిస్తూ వచ్చాయి. ఒక్కొక్కచోట ఒక్కొక్క శాస్త్రము, ఒక్కొక్క తాత్తి్వక సంప్రదాయము, ఒక్కొక్క ఉపాసనా మార్గము ప్రాధాన్యం వహించాయి. ఆగమాదులు, తంత్రశాస్త్రము, ఆయా ప్రాంతాలలోని చికిత్సావిధానము, గాంధర్వ విద్యలు, ముష్టి యుద్ధాలు ఎక్కడికక్కడ ప్రామాణికంగా శాస్త్ర రూపాన్ని పొంది ఆయా విద్యావంశాలలో వ్యాప్తిని పొందేవి. అన్నమాచార్య వంశం సాగించిన మూడు తరాల సంకీర్తన యజ్ఞం ఒక విశ్వవిద్యాలయం చేసే పనితో పోల్చవచ్చు. శ్రీరంగంలోని వైష్ణవాచార్యులు నిర్వహించిన ద్రావిడ ప్రబంధ వ్యాఖ్యాన ధోరణి కూడా ఒక విశ్వవిద్యాలయం చేసే కార్యక్రమమే. అట్లాగే దత్తాత్రేయ యోగ పరంపరకు చెందిన పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తి వంశం ఏడు తరాలు చేసిన సరస్వతీ సేవ పరతత్త్వ సాధన ఒక గొప్ప సంస్థ మాత్రమే చేయగలిగింది.

శ్రీ గురు తత్త్వము
ఈశ్వరుడికి, జీవుడికి నడుమ అనుబంధంగా ఉండే వ్యక్తి గురువు. ఈ వ్యక్తి వాగ్రపంలో ఉండవచ్చు. ప్రయోగ రూపంలో ఉండవచ్చు. ఆదర్శ రూపంలో ఉండవచ్చు. కొందరు గురువులు లోకసామాన్యంగా కనిపిస్తూ, ఆంతర జీవనాన్ని ఉదాత్తమైన దివ్య తేజస్సులను అవతరింపజేస్తారు. కొందరు గురువులు సామాన్య జీవులను తల్లి పసిపిల్లలను చూసినట్లు ప్రతి అంశంలోనూ ప్రతి స్ఫూర్తి లోనూ శ్రద్ధ తీసుకొని, మార్జాల కిశోరం మాదిరిగా లక్ష్యం దాకా ప్రయాణింపజేస్తారు. జీవులు సామాన్యంగా దివ్యజ్ఞాన విషయంలో గుడ్డివారైనప్పుడు గురువు కలిగించే జ్ఞానం, వారి కన్నులను తెరిపించి నూతన లోకాలను దర్శింప జేస్తుంది. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా, చక్షురున్మీలితంయేన తసై్మ శ్రీగురవే నమః అన్న గురుగీతా వాక్యం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. సాధారణంగా అనేక సంప్రదాయాల్లో శిష్యుని గూర్చి గురువు చేతిలో నుండి జన్మించినట్లుగా చెప్పుకుంటారు. సాధారణమైన జన్మ తల్లిదండ్రుల వల్ల కలిగితే, గురువిచ్చేది జ్ఞాన రూపమైన మరొక జన్మ. సనాతన సంప్రదాయంలో ఉపనయనం మరొక జన్మకు సంకేతంగా భావించటం ఉన్నది. అందువల్లనే ఉపనీతుడు ద్విజుడవుతున్నాడు. జ్ఞానం పొందిన జీవుడు జీవితాన్ని పరిపాలించుకోవటానికి జగత్తునంతా విష్ణుమయంగా భావించి ప్రవర్తించవలసి ఉంది. అందువల్ల ఈ విష్ణుమయత్వాన్ని చిత్తంలో నిలిపిన వ్యక్తి విష్ణువవుతున్నాడు. మరొక విధంగా ఐహికమైన జీవనం నుంచి విడివడి తాను మరొక జీవనం ప్రారంభించి గడచిన జీవనాన్ని ఆ బంధాలను తెంచుకొని తాను శివుడవుతున్నాడు. ఈ విధంగా సద్గురు తత్త్వము త్రిమూర్తుల కార్యక్రమాలను ఏక వ్యక్తి ముఖంలో నిర్వహిస్తున్నది. అందువల్ల గురువును బ్రహ్మయని, విష్ణువని, శివుడని సంప్రదాయం చెప్పుతున్నది.
భారతీయ సంస్కృతిలో గురుతత్త్వము తొలుత ఈశ్వరుడిలోనే వ్యక్తమవుతున్నది. నారాయణ సమారంభాం, సదాశివ సమారంభాం..... అని గురుపరంపరను చెప్పుకునే పద్ధతి ఆది గురువు పరమాత్ముడనే విషయాన్ని రుజువు చేస్తుంది. నృసింహ కరావలంబ సో్త్రత్రంలో స్వామి గురువని శ్రీ శంకరులు సంబోధించినారు. సీతారామాంజనేయ సంవాదం వంటి గ్రంథాలు శ్రీరాముని యందు గురుత్వాన్ని స్థాపిస్తున్నవి. శ్రీకృష్ణుడు జగద్గురుడనే విషయం మహాభారతం స్థాపిస్తున్నది.
ఈశ్వరుడితో ప్రారంభమైన ఈ తేజస్సు మహాత్ముల యందు ప్రతిఫలించి సంక్రమించి నెలకొని మానుష దేహం లోకి దిగివస్తున్నది. వశిష్ఠాదులు, సిద్ధార్థ శంకరాదులు, ఈ తేజస్సును మోసుకొని వచ్చి జనులకు ఈశ్వరుడితో అవిచ్ఛిన్నమైన అనుబంధాన్ని నిలబెట్టినారు.
ఆధునిక కాలంలో రామకృష్ణ పరమహంస మొదలుగా సనాతన గురుపరంపర అనేక రూపాలుగా లోకంలోకి దిగివచ్చింది. ఈ మహాత్ములందరు జనుల యొక్క భౌతిక, ప్రాణిక, మానసిక చైతన్యాన్ని ఉన్మనీ భూమికల దాకా తీసుకుని వెళ్లిన వారు. తపస్సు చేత లౌకికమైన చరిత్రను మలుపులు తిప్పిన వారు. జగత్తునంతా తమ ప్రబోధ ప్రభావం చేత చైతన్యమయం చేసిన వారు.
మన సమకాలంలో ఈ గురు తేజస్సు భీముని పట్నంలోని ఆనందవనంలో నెలకొని ఉన్న సదాశివమూర్తి అయిన సద్గురు శ్రీ శివానందమూర్తి వ్యక్తిలో ప్రకాశిస్తున్నది. శ్రీ శివానందమూర్తి సంప్రదాయమైన ఋషి సంప్రదాయాన్ని తత్తా్వన్ని, సమన్వయాన్ని మన వేషంలో, మన భాషలో, మన జీవనంలో మన వెంట నడుస్తూ దానిని మనలోకి సంక్రమింపజేస్తున్నారు. సద్గురు శ్రీ శివానందమూర్తి గారి కార్యాచరణ, ప్రణాళిక స్థూలంగా భౌతికంగానే కనిపిస్తుంది. 1974 ప్రాంతాల్లో వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో పది పన్నెండుగురు సన్నిహితులైన అనుచరులకు ఉపనిషత్తుల భగవద్గీతాదుల యోగ గ్రంథాల విపుల వ్యాఖ్య చేయటం ఆ గ్రంథాల సారాన్ని సాధకుల ఆచరణకు అనుకూలంగా, ఆ గ్రంథాల రహస్యాన్ని వివృతం చేస్తూ కొనసాగిన కార్యకాలం ఒకటి. ఆ కాలంలోనే ఆర్తులు, విషణ్ణులు, శిథిలులు, భీతులు, ఘోర రోగాలలో ప్రవర్తించేవారు చేరువైనప్పుడు మంత్ర ఔషధముల ద్వారా వారి ఆర్తిని తొలగించి జీవితానికి వెలుగుబాటను వర్షింపజేస్తూ వచ్చారు. ఈ సందర్భంలో వారి అనుచరులు కొందరు జిజ్ఞాసువులు, కొందరు ఆర్తులుగా రెండు వర్గాలుగా ఏర్పడ్డారు. క్రమంగా ఆర్తులు గురు సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ, అనుభవిస్తూ జిజ్ఞాస మార్గంలోకి ప్రవర్తిస్తూ వచ్చారు.
ఈ సన్నివేశంలో భీముని పట్నం దగ్గర పరమ గురువుల ఆదేశాన్ని అనుసరించి ఆనందవనమనే ఆశ్రమాన్ని నిర్మించటం జరిగింది. ఈ ఆశ్రమంలో చేసుకున్న తపస్సు, జప ధ్యానాదులు వేయింతల ఫలితాలిస్తాయని సాధకుల అనుభవాలు తెలియజేస్తున్నాయి. ఈ ఆశ్రమ నిర్వహణలో సద్గురువులు పరిశ్రాజక మూర్తిగా కాక ఒక తండ్రిగా, తల్లిగా, హితుడుగా, ఆత్మీయుడుగా, గురువుగా అనేక భూమికలలో దర్శనమిస్తున్నారు. వారి కార్యక్రమం క్రమంగా విస్తరించింది. భారత దేశం అడుగడుగునా అనుచరులతో సంచరించి ప్రతి స్థలాన్ని తీర్థ భూతం చేసారు. వందలాది రుద్రయాగాలు నిర్వహించారు. అనేక తీర్థయాత్రలను దర్శింపజేసి శిష్యుల పుణ్యాన్ని వేయింతలు పెంచి వారికి భౌతిక జీవన సుఖాన్ని, భద్రతను కల్పించారు.
సద్గురువులు తర్వాతి దశలో అనేక రచయితల గ్రంథాల ముద్రణకు సహాయం చేశారు. వాఙ్మయ ప్రచారానికి దోహదం చేశారు. వందలాది రచయితలకు సనాతన ధర్మం వైపు మరలునట్లుగా ప్రేరణ ఇచ్చారు. సాహిత్యాన్ని ఎలా ఉద్దీప్తం చేశారో, సంగీత, నృత్యాది కళలకు , ఆంధ్ర మూ్యజిక్ అకాడమీ వంటి సంస్థలను స్థాపించి విద్వాంసులను సన్మానించి శాస్త్రీయ సంగీతాన్ని కొత్త తరంలో అభిరుచి, రసికతను పెంపొందించి ఆ కళ యొక్క స్వచ్ఛతకు అనుస్యూతిని కల్పించారు. ఆధ్యాత్మిక సాధకులకు పౌరాణికులకు రచయితలకు కవులకు కళాకారులకు వందలాది మందికి ఉదాత్త రీతిలో సన్మానాలు నిర్వహించి భారతీయ సరస్వతీమూర్తికి పట్టాభిషేకం నిర్వహించారు.
సద్గురు శ్రీ శివానందమూర్తి భౌతిక స్థాయిలో శిష్యుల ఆపదలను తొలగిస్తూ రోగాలను తొలగిస్తూ శరీరాలకు రక్షణ కల్పిస్తున్నారు. మానసికంగా కళలను, సాహిత్యాన్ని సనాతన ధర్మ స్ఫూర్తికి అనుగుణంగా పునరుజ్జీవింపజేస్తూ ఒక మణిసేతువును నిర్మించారు. ఆధ్యాత్మిక స్థాయిలో తత్వ రహస్యాలను ఉపదేశించి సాదు మార్గంలో నడిపిస్తున్నారు. ఏక కాలంలో అనేక స్తరాలలో వ్యవహరిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఈశ్వరుని సౌలభ్యానికి మారు రూపంగా దర్శనమిస్తున్నారు. అనేక దేవాలయాల పునరుద్ధరణకు సహాయం చేస్తూనే భీమునిపట్నంలోని ఆనందవనంలో యోగగణపతిని ప్రతిష్ఠించి సాధకుల తపోభూమిగా పరివర్తింపజేశారు. ఇక్కడే అద్భుతమైన, శిల్పమహితమైన ఆద్యాది శ్రీమహాలక్ష్మి ఆలయాన్ని నిర్మించి సర్వధారి విజయదశమి పర్వదినాన దేశ సౌభాగ్యం కోసం ప్రతిష్ఠింపజేస్తున్నారు.
గురు తత్తా్వన్ని గురించి సంగ్రహంగా క్రింది నాలుగు పద్యాలు తెలియజేస్తున్నాయి.
* గురువు ఈశ్వర లీలా రథ శిఖర వైజయంతి
గురువు ఆత్మారోహ గిరిశిఖరం మీది జ్యోతి
గురువు జిజ్ఞాసువుల దాహం తీర్చే ప్రపాశాల
గురువు సుషుమ్నాద్వారం, గురువు శివుని మారు రూపు
* సంసిద్ధమైన బ్రతుకులో తానై వచ్చే వినూత్తాతిథి
అతీత జీవానుభూతుల రహస్యాల భాండాగారం
సనాతన పరంపరా తేజస్సును మన దాకా మోసుకువచ్చి
ఈ హృదయంలో ప్రతిష్ఠించి తాను మరుగయ్యే దివ్య తీర్థం
* అతి మనస్సులోనుంచి జలపాతమై దూకే కవిత
సమష్టి మనస్సులో నుంచి ప్రాకివచ్చే ప్రాగ్రూపం
ధ్యాన వేళ అభీప్సను ఊర్థ్వంగా మోసుకుపోయే జ్వలదగ్ని
పంచభూతాల సమష్టిని మనకోసం దయతో గ్రహించిన ఈశ్వరుడు
*ఆశ్రయం లభించితే చాలు అభ్యాసి తొలి ఘట్టం దాటినట్లే
గురు తేజస్సు హృదయంలో చేరి వృత్తులను నియమిస్తుంది.
ప్రలోభపెట్టే దృశాయలను, సిద్ధులను కట్టడి చేస్తుంది
గురుభావం భుజం మీద నిలుపుకొని చివరిదాకా తీసుకుని వెళు్లతుంది
(సాంపరాయం, పే.8283)

Wednesday, February 4, 2009
భారతీయ జీవన దృక్పథం
భారతీయ జీవన దృక్పథం అంటే ప్రాచ్యదేశాల దృక్పథం పాశ్చాత్య దేశాల దృక్పథం కంటే విలక్షణమైంది. పరోక్షమైన అనుభవం ఈ జగద్వ్యవహారంలో ప్రతి ఫలించటం ఒక దృష్టి ఐతే, ఇంద్రియానుభవ రూపమైన ప్రత్యక్ష ప్రపంచం మరొక దృష్టికోణం అని చెప్పాలి. `ఈశావాస్యమిదం' అన్నప్పుడు ఈశ్వరభావ పరివ్యాప్తంగా ఈ జగత్తును దర్శించి అంతర్నిహితమైన ఈ తత్త్వం బయట ఆవరించియున్న ఈ తత్త్వం ఈ రెండు ముఖాలుగా దర్శించవలసి యున్నది. తిక్కన సోమయాజి `త్రిభువన శుక దృఢ పంజర విభవ మహితునకు త్రివిష్టప నిర్మోక భుజగపతికి' అని వర్ణించి, `మూడు లోకాలు అనే చిలుకకు ఆయన పంజరం' అట్లాగే `మూడు లోకాలనే కుబుసంగా ధరించిన పామూ' ఆయనే అన్న భావాన్ని అందించాడు. `అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః' అన్న శ్రుతికి వ్యాఖ్యానం ఇది. ప్రాచ్యదేశాలలో భారతదేశంలో జీవనలక్ష్యం పరమార్థం. ఈ జీవుడు ఎరిగి ెురిగి సమర్థతతో పరిపూర్ణతతో ఈశ్వరుడుగా పరివర్తన చెందటం. పురాణాలలో సాధారణంగా ఒక కథ కనబడుతుంది. భూదేవి జీవుల పాపభారాన్ని మోయలేక ఈశ్వరుని సన్నిధికి చేరి తన భారాన్ని తగ్గించుమని, దానికోసం అవతరించమని ప్రార్థిస్తుంది. సాధారణంగా ఈ పాపభారం అధర్మమని చెప్పబడుతుంది. అధర్మానికీ ధర్మానికీ మధ్య భేదం సృష్టి ఈశ్వరాభిముఖ ప్రయాణానికీ అనుకూలంకావడమో, ప్రతికూలం కావడమో అని చెప్పవచ్చు. వీటిని దేవదైత్యశక్తులుగా భావించవచ్చు. భూమి తనలోని పరిణామ చైతన్యానికి, ఉద్గమశీలానికి నిరోధం కలిగించే శక్తులనుండి విముక్తిని కాంక్షించడం దానికోసం తీవ్రవేదనను పొందడం ఇక్కడ భూమాత ప్రయాణంగా చెప్పబడింది. ఈశ్వరావతరణం దిగివచ్చే ఈశ్వరానుగృహానికి సంకేతం. ఈ విధంగా పురాణకథ అభికాంక్షకూ, (జురీచీరిజీబిశిరిళిదీ) అనుగ్రహానికీ సంగమాన్ని కల్పించే తపస్సునకు సంకేతరూపం. పాశ్చాత్య లోకాలలో పరాపరలోకాల నడిమి విభాగం నిత్యమైంది. ఈశ్వరాభిముఖ పరిణామం ఈ మత సంప్రదాయాలలో లేనేలేదు. అందువల్లనే తూర్పుదేశాలలో కళ దివ్యమూలకమైనది. దివ్యత్వ స్పర్శలేకుండా ఏ కళా ఆవిర్భవించలేదు. అందుకే కళలు ఆత్మను సంస్కరించునని `ఆత్మానం సంస్కురుతే' అని చెప్పబడినది. ఒక కళా నిర్మాణం చేయడానికి ఆ కవిగానీ, కళాకారుడుగానీ, సంగీతవేత్తకానీ ఆ కళా రూపము తానై పరిణమించవలసి ఉంటుంది. డాంటే `ఒక చోట ఒక చిత్రమును గీయదలచినపుడు ఆ చిత్రకారుడు తానే ఆ చిత్రము కావాలి' అన్నాడు. యోగసాధకులలో, ఉపాసనలలో ఈ విషయమే మరొక విధంగా చెప్పబడింది. `శివోభూత్వా శివమర్చయేత్' `నీవు శివుడివై శివుణ్ణి పూజించాలి' అంటే భావ తాదాత్మ్యము నూతన సృష్టికి, తన్మయీభవనానికి, అస్మితను కోల్పోవడానికి ప్రధాన కారణమవుతుంది. `ధ్యాత్యా యజేత్' ధ్యానించి పూజించవలె. ధ్యానము ద్వారా ఊర్థ్వమనోలోకాల సంస్పర్శతో పరలోక చైతన్యం తన వెలుగులను నెమ్మదిగా ప్రసరింపజేస్తూ ఉంటుంది. ఆ వెలుగులను అందుకున్న వేళ అపూర్వ రూపస్ఫురణ, నాద శ్రవణ, పరీమళ ఆస్వాదన, రుచిగ్రహణ, స్పర్శానుభవములు కలుగడం అనుభవంలో ఉన్న సంగతే ఈ ధ్యానం అవ్యక్తమైన దివ్య ప్రకృతిలోని అనేక అంశాలకు అనేక రూపనామ కల్పనలను చేస్తుంది. అందువల్ల యజనమునకు పూర్వము ధ్యానము విధిగా చెప్పబడినది. లౌకికంగా కళా సృజన విషయంలో చెప్పబడ్డ అంశమే బ్రహ్మాండ సృష్టిలోనూ చెప్పబడింది. సృష్టా్యరంభానికి ముందు `సతపో7తప్యత బహుస్యాం ప్రజాయేయ ఇతి' అని బ్రహ్మ తపోభావనలో చేరినట్లు చెప్పబడింది. ఇదియే లోకంలో ధ్యానం. ధ్యానం గురించి వాయిస్ ఆఫ్ సైలెన్సు అన్న పుస్తకంలో హెచ్.బి. బ్లావెట్‌స్కీ ఇలా చెప్పారు. `ధ్యానద్వారం తెల్లని ప్రతిఫలించే చంద్రకాంతశిల వంటి ఆభరణ శిలాపాత్ర. దానిలో నిశ్చలంగా సువర్ణజ్వాల వెలుగొందుతుంది. ప్రజ్ఞా రూపమైన ఆ రూప జ్వాల ఆత్మలో నుండి వెలుగులను విరజిము్మతుంది.' ఈ ఆత్మ కాంతులకు పట్టుకునే ప్రయత్నమే భారతీయ కళాసృష్టి. పాశ్చాత్యదేశాలలోని కళల్లో వాస్తవవాదము బింబప్రతిబింబభావానికి సంబం ధించింది. లోకందేన్ని చూస్తుందో అనుభవిస్తుందో దాన్ని యథాతథంగా పునర్నిర్మించడం కళకు పరమ ప్రయోజనం. అందువల్లనే వాస్తవవాదం అక్కడ ప్రాధాన్యం వహించింది. భారతదేశంలో సాదృశ్యం అంటే సమత్వమే కానీ బింబవత్‌భావము కాదు. `తద్భిన్నత్వే సతి తద్గతభూయో ధర్మవత్‌త్వమ్' అంటే లక్ష్యమునకు లక్ష్యమైన వస్తువునకు భిన్నముగా ఉన్నదానియందలి ధర్మములు మరల మరల ప్రకాశించు పద్ధతి సాదృశ్యము. అందుకే సుందరిముఖమునకు చంద్రునితో కమలముతో సామ్యము చెప్పుటభూయోధర్మవత్త్వము చేతనే సంభవిస్తుంది. అందుకే మనకళలు వాస్తవరూపాన్ని కోల్పోయి ప్రతీకలుగా స్ఫురణలుగా సంకేతాలు మారిపోతున్నాయి. మన దర్శనము భూతమాత్రం కాకుండా ప్రజ్ఞ మాత్రమే అవుతుంది. అంటే వస్తువును చర్మ చక్షువుల ద్వారా కాకుండా ప్రజ్ఞా చక్షువు ద్వారా దర్శించవలసి ఉంది. ఋగ్వేదము `భద్రాఋతజాతసత్యా' ఋతమునుండి పుట్టుట చేత సత్యములు క్షేమకారకములై ఉన్నవి. (4518.) ఈ ఋతము సర్వసృష్టికి కారణమైన ఆధారభూతమైన మూలసూత్రము. దానినుండి ఈ జగత్తు నిష్పన్నమవుతున్నది. అలంకార శాస్త్రం కూడా `సచేతసామ్ అనుభవః ప్రమాణమ్ తత్రకేవలమ్' సౌందర్య అనుభవమునకు అత్యంత ప్రమాణమైన అంశము సహృదయుల అనుభవమే. శివతాండవమే జరిగిందంటే శివుడెక్కడో కైలాసంలోనో తారకారణ్యంలోనో చిదంబరంలోనో తీరికగా నాట్యం చేశాడని కాదు, తాత్పర్యం. ఈ తాండవం అవ్యక్తమైన పరమాత్మ, నీవారశూకవత్తన్వి, చైతన్యరూపమైన ఆకాశంలో దహరాకాశంలో నాట్యం చేసినాడని భావించాలి. జీవుల అంతశై్చతన్యంలో జగచై్చతన్యం ఆవిష్కరించబడే సంధికాలంలో ఆ చైతన్యం ెుుక్క ఆవిష్కారబిందులిప్తలోని అమేయమైన కల్లోలాన్ని వ్యక్తం చేయడమే ఈ ప్రతీకాత్మకమైన శివతాండవ వర్ణనకు తాత్పర్యం. ఇదే అంశం కృష్ణలీలలకూ వర్తిస్తుంది. అవిద్యా తమస్సులో మునిగి ఉన్న జీవులకు ఈశ్వరుని వేణుగానం వినగా కలిగిన జ్ఞానబోధోత్సవం ఈ కృష్ణలీలల్లో స్పష్టంగా దర్శనమిస్తున్నది. విక్రమార్కుని కథలలో ఒక రాజు తన భార్య చిత్రాన్ని చిత్రించమని చిత్రకారుని కోరినపుడు అతడు పద్మినీ జాతి స్త్రీ చిత్రాన్ని చిత్రించినాడట. ఇక్కడ వ్యక్తిరూపం కంటే ఆ స్త్రీ స్వభావ లక్షణాలను వ్యక్తం చేయడమే ప్రధాన అంశం అవుతున్నది. భాసుని ప్రతిమా నాటకంలో భరతుడు అయోధ్యకు తిరిగి వస్తూ ప్రతిమా గృహంలో తన పూర్వుల విగ్రహాలను చూచి ఆ ప్రతిమలకు దేవతా భావంతో నమస్కరింపబోతాడు. దేవకులికుని చేత నివారింపబడి ఆ ప్రతిమ లెవ్వరివని ప్రశ్నిస్తాడు. `అహోక్రియామాధుర్యం పాషాణానాం అహోభగవతి రాకృతీనాం' అని శిల్ప వైదగ్ధా్యన్ని ప్రశంసిస్తాడు. అక్కడ దశరథరాజు విగ్రహం రూపసామ్యాన్ని కాకుండా రఘువంశరాజుల లక్షణాన్ని ప్రకటించడం చేత భరతునికి కూడా గుర్తుపట్టడం సాధ్యంకాదు. భారతీయ శిల్ప చిత్రరీతులలో ఉండే ఈ రూపధ్యాన లక్షణాన్ని ప్రతీకాత్మకంగా తప్ప వేరుగా వర్ణించడం సాధ్యం కాదు. మూల విగ్రహం నుండి విమానం దాకా ఆలయ నిర్మాణం అటు బ్రహ్మాండానికీ ఇటు పిండాండానికీ ప్రతీకాత్మకంగా రూపొందిన అంశం జాగ్రత్తగా గమనించవలసి ఉన్నది. అనుభవమును విశ్లేషిస్తే దాని విభిన్నస్తరాలలో విభిన్న దశలలో స్థితిని గమనించ వచ్చును. లోకము ఐంద్రియక జాగ్రత్ వాస్తవవాదం సుఖదుఃఖ మిశ్రమము మనోలోకము భావుక స్వప్న ప్రతీకవాదం ప్రీతపర్యవసన్నం దివ్యలోకము ధ్యేయ సుషూప్తి అంతఃస్ఫురణ ఆనందం పై పట్టికను చూచినపుడు భారతీయ కళలకు భావలోక దశలో దివ్యలోకదశలో ఉన్న సోపానక్రమం కానవస్తుంది. పాశ్యాత్య దేశాలలో కళలకు ఆధారభూతమైన వాస్తవ వాదము నేల విూదనే ఉనికిని చాటుకుంటున్నది. కళా సృజన స్వప్న సుషూప్తిదశలకు ఉండే ప్రాథమ్యము జాగ్రద్దశకు లేదు. స్వప్నలోకం అవ్యక్తం నుంచి భావబింబాలను సంకేతాలను ప్రతీకలను ఆవిష్కరించు కుంటున్నది. చిత్తాసన్న జీవానుభవసంగమము ఇక్కడి ప్రధాన లక్షణం. ఇక్కడి అనుభవము సుఖ దుఃఖ మిశ్రీతము కాకుండా సర్వమూ ప్రీతిలో పర్యవసిస్తుంది. దీన్నే శాస్త్రం రసం అని చెప్పింది. దీనికి ఆధారం భావుకత్వం, అంటే తన అస్మితను తాను కోల్పోయి విశ్వ చైతన్యంలో సంలీనత చెందటం. ఆ స్థితిలో సర్వానుభవాలు వ్యక్తి పరిమితులను దాటి వొక అలౌకికమైన సార్వజనీనమైన అనుభవమునకు కారణమవుతుంది. దీనికి హేతువైన భావకత్వాన్ని `తనదైన అనుభూతి తనదిగాన' అన్నాడు కవి. అజంతా చిత్రాలు చూసినపుడు బుద్ధదేవుని రూపాన్ని మానుష ప్రయాణం కంటె అధికంగా ఇతరులను అల్పంగానూ చిత్రకారుడు రూపిస్తాడు. ఇక్కడ మహాత్ముడైన బుద్ధదేవుని అనుభావ విశేషం ప్రధానమై అతని రూపాన్ని ఉన్నతోన్నతంగా చేసింది. అందుకే ఇతరుల మూర్తులు చిన్నవి కావడం. ఇది తారతమ్య వివక్షకోసమే. కావ్యంలోకి శబ్దం ప్రవేశించినపుడు అది సంకేతిక అర్థపరిమితుల నుండి విముక్తమై, వేయి రెక్కలతో కావ్యాకాశంలో పరిభ్రమిస్తుంది. కానీ దివ్యశబ్దం భావ పరిమితులను దాటి మంత్రమై అతీతచైతన్యాన్ని ఇహలోక చైతన్యంతో అనుసంధిస్తుంది. అభిదాలక్షణం లోకానికి మూలమైతే ఉద్విగ్నలక్షణం కావ్య శబ్దానికి మూలమవుతుంది. అట్లాగే దివ్యశబ్దానికి అర్థాతీత లక్షణం ప్రధానమౌతుంది. లోకశబ్దం కావ్యంలోకి చేరి రసభావపుష్టిని పొంది నూతన అవతారమెత్తుతుంది. వెండి గొలుసులు లంకెవేసి ప్ర చండమగు నీ నీలి తెరలను తూర్పు వాకిలి తలుపు రెక్కల తొలగ లాగెదరెవ్వరో రాయప్రోలు సుబ్బారావు అన్నప్పుడు ఈ వెండిగొలుసులు, తూర్పువాకిలి తలుపుల రెక్కలు, తొలగ లాగటం ఈ మూడు శబ్దబంధాలు లౌకిక అర్థపరిమితులను ఛేదించుకొని నూతన ఉషస్ సమయాన్ని నిర్దేశిస్తున్నవి. ఏ అనుభవానికైనా వ్యక్తీకరించే శబ్దం దానిని సూచించటనికే ఉపయోగ పడుతుంది తప్ప సమగ్రంగా చెప్పలేదు. దివ్యస్థాయిలోనైనా భావుకస్థాయిలోనైనా, ఈ అనిర్వచనీయత ప్రధాన లక్షణమే అయినా, లోకస్థాయిలోనూ అది అనివార్యమైన లక్షణమే అవుతుంది. అందుకే సాహిత్యం శబ్దార్థ సంయోజన ఉచితంగా నిర్మించటం లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఈ ఔచిత్యము లేనప్పుడు ఆ శబ్దార్థ సంయోజన ప్రభావరహిత మవుతుంది. కుంతకుడు అటువంటి లక్షణాన్ని వ్యాధిభూతము లేదా మృతకల్పము అంటున్నాడు. ప్రభావ రహితమైన ఆడంబరము అనుభవాన్ని సూచించే అంశంలో అతివ్యాప్తి దోషాన్ని పొందుతుంది. అందుకే శాస్త్రవేత్తలు అలంకార గ్రహణ విషయంలో కాలేచ గ్రహణత్యాగౌ కాలము అనగా సందర్భమును బట్టి ఈ అలంకారాలను స్వీకరించడము వదిలి వేయడము జరుగుతుందని సూచించారు. చిత్రకళలో రంగుల మిశ్రణము రేఖల ఆవిష్కారము లోతునూ ఎత్తునూ తెలిపే శిల్పమూ ఇవన్నీ అనుభవ ద్వారానికి కవాటాలే తప్ప సాక్షాదనుభవాలు కావు. సంగీతకారుడు ఒక రాగాన్ని ఆలపించేప్పుడు స్వరాలను ప్రస్తరించినపుడు శబ్దాదుల సహాయం లేకుండా నాదమాధ్యమం ద్వారా రసానుభవాన్ని శ్రోతకు సన్నిహితం చేస్తున్నాడు. అన్ని కళలలోనూ రస ప్రపంచ వైఖరి ఇదే. ఇక్కడే కావ్యానికి కళలకు లోకానికి మధ్య విభజనరేఖ ఏర్పడుతున్నది. లోకంలో అనుభవము ప్రత్యక్షమై సుఖ దుఃఖ దాయకం కాగా కావ్యంలో కళా జగత్తులో ఈ అనుభవము పరోక్షమై సుఖదుఃఖాల పరిమితులను దాటి ప్రీతి మాత్రానుభవకారక మౌతుంది. లోకంలో ఏ అనుభవమైనా అంతో ఇంతో మన పరిజ్ఞానాన్ని పెంచుతుంది. సాధారణీకరణ లక్షణం పెరిగిన కొద్దీ శాస్త్రత్వాన్ని పొందుతుంది. ఇక్కడ సాధారణీకరణం వల్ల (ఇది ఆలంకారికుల సందర్భంలోని పద ప్రయోగం కాదు) అది ఔపదేశిక స్థాయిని పొందుతుంది. భట్ట నాయకుడు కవిత్వం వలన ఎవడు జ్ఞానాన్ని గానీ, ఆదేశాన్ని గానీ పొందడని స్పష్టం చేశాడు. `కావ్యే రసయితా సర్వే న బోద్ధాన `నియోగభాక్'. ``ప్రీతి కూడా ఒక విధమైన యోగమన్నాను. ప్రీతి అంటే రసమే అన్నారుగదా. లాక్షణికులు ప్రీతి అంటే `దయా మయాంతః కరణ విశేషం' మని ప్రాచీనులు నిర్వచించారు. ఈ వ్యవస్థను ఇలా భావించాలె. వీరు బహిరింద్రియములను స్వచ్ఛందంగా వదిలివేస్తారు. అంతరింద్రియములను అంతరాంతరమునందు సురక్షితంగా నిలిపి పెట్టుకుంటారు... మానవునకు నిసర్గమైనది ప్రీతి. ప్రీతికి రాగము తల్లి వేరు వంటిది. రాగము సుఖాశయి అన్నది యోగ శాస్త్రము సుఖము భోగాశయము కావటం కూడా సహజమే. భోగము లలిత కళాశ్రయము కావటము లోకములో కనబడుతున్నది''.రాయప్రోలు (కృష్ణశాస్త్రి కవితా స్వర్ణోత్సవం ప్రత్యేక సంచిక) 1975 పే. 12 కవితా సామగ్రి గురించి కవులు అనేక కాలంగా మూల ద్రవ్యాలను విని యోగిస్తున్నప్పటికీ వాటి ఉపయోగంలో ఎప్పుడూ కొత్తదనానికి అవకాశం ఉంటున్నది. అవే శబ్దాలు, అనే అలంకారాలు, రసపరిగ్రహణం చేత ఎపుడూ కొత్తగానే కనిపిస్తవి అంటారు శాస్త్రవేత్తలు. ఈ అభినవత సృష్టిమూల లక్షణము. ఎప్పటికప్పటికి వసంతం కొత్తదే. ఉదయం కొత్తదే. ప్రేయసి దరహాసం కొత్తదే. వక్రోక్తి జీవితంలో (వృత్తి) ఉదాహరించిన శ్లోకం ఇది. ఆసంసారం కవిపుంగవైః ప్రతి దివస గృహీత సారోపి అద్యాప్యభిన్నముద్ర ఇవ జయతి వాచాం పరిస్పందః (పేజీ 292. చౌఖంబా 1983) సృష్టా్యది నుంచీ అసంఖ్యాకులయిన కవులు శబ్దాన్ని తమ కవిత్వంగా చేసేందుకు ఆ రత్నము ెుుక్క అనంత పార్శ్వములను ప్రకాశింప జేస్తున్నారు. అయినా ఇవాళ్టికీ అది చెక్కు చెదరకుండా ఉన్నది. అలాంటి శబ్దానికి జయం కలగాలి. ఎన్నడైనా కవిత్వం శబ్దమే. దానిలో గర్భితమైందే అర్థము. అనంతార్థము. ఆదిలాక్షణికులందరూ ఈ రెంటి కలయికను, సామరస్యాన్ని నిర్దేశిస్తూ వచ్చినా చివరకు జగన్నాథ పండితుడు నిగ్గుతేల్చి శబ్దాన్నే కావ్యంగా నిరూపించటం జరిగింది. ఈ శబ్దము నాభిలో నుంచి వెలువడే మణిపద్మము. మణియై అంశు మాలికతో వేయంచాల చక్రమై విజృంభించుతుంది. పద్మమై సహస్రదళమై సృష్టికి ఆరంభ బిందువవుతున్నది. విశ్వమంతా వ్యాపించినప్పుడు సహస్రఫణామణి మండితమై తానే వ్యక్తమైన సర్వమూ అవుతున్నది. ఆకాశాభిముఖమై విశ్వోత్తీర్ణమై అవ్యక్తాన్ని వ్యక్తం చేసే సృజన బిందువు అవుతున్నది. లోకశబ్దం సంకేతార్ధ వ్యక్తీకృతికి పరిమితమైంది. కావ్యశబ్దం పరోక్షానుభవ ప్రకాశము. చెప్పినది చెప్పనట్లు, చెప్పనిది చెప్పినట్లు ఉండటం పరోక్షాభివ్యక్తి, ధ్వని సిద్ధాంతం అంతా దీనిపైన ఆధారపడి వున్నది. అందువల్ల కావ్యంలోని శబ్దం సంకేతి తార్థానికి పరిమితమైంది కానేకాదు. కని ప్రయోగనైపుణ్యం చేత లోకజీవన రహస్య ద్వారాలను వివృతం చేసే తాళంచెవి. ఈనాటికీ శబ్దం నిత్య నవీనంగా లావణ్యంగా సదా ప్రకాశిస్తూనే వుంటున్నది. అద్యావ్యభిన్న ముద్ర ఇవ. అంటే అక్షతమని. కాళిదాసు మాటల్లో చెబితే అనాఘ్రాతం పుష్పం కిసలయ మలూనం కరరుహైః అనావిద్ధం రత్నం అని. అప్పుడే తన కోసం పూచిన పూవులాగా కవికి సిద్ధిస్తుంది. ఈ ప్రపంచం అనాది కాని కవి వాక్కు నిత్య నూతనం. అదే బ్రతుకు, అదే సంసారం, అవే ఆకలిదప్పులు, కామక్రోధాలు, పగలు, కార్పణ్యాలు, అసూయలూ, ప్రవృత్తి లక్షణాలు అయినా జగత్తుగా అది నిత్యమూ పరిక్రమిస్తూ, పరిణమిస్తూ పరివర్తిత మవుతున్నది. నిన్న ఉన్నదేదీ ఇప్పుడు ఉండటం లేదు. క్షణికం అంతా. అయినా ఒక అనుస్యూతి సూత్రం దీన్ని పట్టుకొని ఉన్నది. ఈ సందర్భంలో ఏది మారేదీ, ఏది మారనిదీ గ్రహించవలసి ఉన్నది. ఇందుకు ఉదాహరణగా శ్రీమద్రామాయణ కల్పవృక్షంలోని ఈ సన్నివేశాన్ని చూడవచ్చు. విశ్వామిత్ర మహర్షి తపోనిష్ఠలో ఉన్నాడు. తపస్సును భంగింప జేయడానికి రంభ స్వర్గంనుండి, వసంతము భూమిలో నుండి ఒకేసారి తమను ఆవిష్కరించుకున్నాయి. తపోభంగం చేయడం కోసం అక్కడ ఒక యుద్ధరంగం సిద్ధమైంది. వసంతముగానీ అప్సరగానీ యుద్ధముఖంగా తీర్చిదిద్దబడటం ఇక్కడి విశేషమైన అంశం. చుఱచుఱ నెఱ్ఱనై చూచెడు చివురాకు చివురాకు వెనుక బొంచిన లతాంత బాణుండు విసరగా బట్టిన పిడిబాకు పిడిబాకు రివు్వన విసర దూసి చన్న సవ్వడి వోని సన్నని పికివాకు పికివాకుతో మేళవించి సన్న గొంతు రాగము తోడ గులుకు నచ్చరసోకు పిరువీకుగా నొక్క పెట్టద్రోచి తోచుటాలస్యముగ గింకిణీ చిణచిణ నినద కనదబ్జ పదసమానీతమధుర గీతికా రసవార్థి పొంగిన తరంగ మచ్చరయు గన్నులను హృదయమున బొడువ (బాలధమ231) రంభాముఖంగా ఇక్కడ ఇంద్రుడు మహర్షిపై చేస్తున్న దాడిని ఈ పద్యం విశిష్టంగా వ్యక్తీకరిస్తుంది. `చుఱచుఱ నెఱ్ఱనై చూచెడు చివురాకు ఆరంభం. చివురాకు, పిడిబాకు, పికివాకు, అచ్చరసోకు అనుప్రాస ఘటితములై చతురంగ బలాల వూ్యహ కల్పనను స్ఫురింప జేస్తున్నవి. సీస పద్యంలోని చివరిపాదం చివర నుంచి అందుకొని పరుగెత్తించిన గీత పద్యం అంతర్బహిరింద్రియాల విూద జరిగిన ఏకకాలికమైన దండయాత్రను అభివ్యక్తం చేస్తున్నది. భావ ప్రకాశం కళా నిర్మాణంలోని ఔచిత్యమూలాన్ని స్పృశిస్తూ (ఙ119) జాతానురాగయైన కులాంగన అనురాగ చేష్టలను వర్ణిస్తూ `వచనే అవచనమ్' అన్నది. మాట్లాడినపుడు మాట్లడదు, అని అంటుంది. కావ్యము లోకవ్యవహారాన్ని ప్రత్యక్షంగా వ్యక్తీకరించకుండా కులాంగనవలె వ్యంగ్య మార్గాన్ని ఆశ్రయిస్తుందని దీని తాత్పర్యం.
లలితాసహస్రనామం అమ్మవారిని గురించి వర్ణిస్తూ `సామరస్యపరాయణా' అంటుంది. సామరస్యం అంటే జీవనంలో ఉండే సమలయస్థితి సౌష్ఠవం (ఐగిళీళీలిశిజీగి). సమరసస్థితి సుఖదుఃఖాలకు దూరంగా ఒక శాంతస్థితిని కల్పిస్తుంది. కరుణ శృంగారములు రెండే కావ్యమందు నిజరస విపాక భోగమందింపగలవు అన్నట్లు లోకంలో సుఖ దుఃఖాలన్ని ఈ సామరస్యం తొలగడం వలననే సంభవిస్తవి. శృంగారము ప్రీతి హేతువైనపుడు కరుణము మృత్యుదశను ఆవిష్కరించే దుఃఖహేతువవుతుంది. లోకం ఈ జన్మ మృత్యువుల నడుమ ఊయలూగుతూ ఉంటుంది. జీవులు దుఃఖాన్ని పరిహరించటానికి శాంతినీ ప్రీతినీ పెంచుకోవడానికి అనేక వ్యవస్థలను ఏర్పరచుకున్నారు. సంసారమనే విషవృక్షానికి రెండే అమృత ఫలాలు. ఒకటి కావ్య రసాస్వాదన; రెండు సజ్జన సాంగత్యం, ఈ ప్రాచీన సూక్తి జీవితాన్ని ప్రియంగా చేసుకోవడానికి ఉన్న మార్గాలను స్పష్టం చేస్తుంది. కళాజగత్తులో శబ్దం సంకేతంగా మారినప్పుడు అది ెుగిరే గగనాలు ప్రవేశించే లోతులు విశ్వ జనీన స్థితిని కలిగించి, తన తనాన్ని అస్మితను కోల్పోయేటట్టు చేసి, జగదతీతమైన స్వస్థితిని పొందేట్లు చేస్తుంది. ఆనంద నిష్యందిషూ రూపకేషూ వు్యత్పత్తి మాత్రమ్ ఫలమ్ అల్పబుద్ధేః యో-పీతిహాసాదివదాహ సాధుః తసై్మనమః స్వాదు పరాఙ్మూఖాయ (దశరూపకం) ఆనందమును కలిగించే రూపకాలలో ఇతిహాసాదుల వలె వు్యత్పత్తిని మాత్రమే ఫలంగా భావించే రసపరాఙ్మూఖుడైన అల్పబుద్ధికి ఒక నమస్కారం. కళా ప్రపంచంలో పరివర్తన అసహిష్ణూత ప్రధాన లక్షణము. కళారూపం తనను తాను సాంగంగా ఆవిష్కరించుకున్న తర్వాత తనలో తాను ఎటువంటి మార్పును సహించదు. పరివర్తన అసహిష్ణూత అని దీనిని శాస్త్రం పేర్కొంటున్నది. ఆత్యంతికమైన కళారూపం ఏర్పడ్డ తరువాత శ్రావ్యత వల్ల ఔచిత్యం వల్ల ఛందఃస్పందం వల్ల ఔజ్జ్వల్యం వల్ల ఏ మార్పు దానియందు కలిగించే వీలు ఉండదు. దీనిని మరొక విధంగా చెప్పాలంటే అంతర్గతమైన నిర్మితమైన లయ భంగింపబడడానికి అంగీకరించదని తాత్పర్యము. ఈ లయ శబ్ద సంయోజన నుండి మహా కావ్య నిర్మాణందాకా అనుసంధితమై విశ్వలయతో తాదాత్మా్యన్ని భజిస్తుంది. ఈ విశ్వలయ (్పుళిరీళీరిబీ ష్టన్రీగిశినీళీ) పరమ సూక్ష్మమైన కళాభివ్యక్తి నుండి స్థూలమైన మహానిర్మాణాల దాకా పరివ్యాప్తమై ఉంటుంది. ప్రాచ్యదేశాల నిర్మాణాలలో అభివ్యక్తమయ్యే (సిమెట్రీ ఐగిళీళీలిశిజీగి) సౌష్ఠవము ఈ అంశాన్ని ప్రతిపాదిస్తుంది. ఆధునిక యూరోపీయ కళా నిర్మాణాలలో కనిపించే అస్తవ్యస్త (ఎరివీచిబివీ) లక్షణం దీనికి పూర్తిగా భిన్నమైంది. దీనియందు అపూర్వత ఉంటుంది. కానీ అంతర్గత (దీదీలిజీ ష్టన్రీగిశినీళీ) లయ లోపిస్తుంది. కళారూపాలలోని అపూర్వత ఆశ్చర్యాన్ని కలిగించడం సహజమే కానీ ప్రీతి భావాన్ని కలిగించడం అసాధ్యమైన అంశం. వెరగు, అద్భుతం, మొదలైన అంశాలు అసాధ్యసాధనాన్ని వ్యక్తం చేస్తవికానీ అంతస్సులోని శాంతిని వ్యక్తం చేయలేవు. సజ్జన సాంగత్యము కుటుంబ వ్యవస్థ నుండి సమాజంతో పూర్తిగా తాదాత్మ్యం చెందేదాకా ఉండే భిన్నభిన్నములైన స్తరాలను వ్యక్తం చేస్తుంది. పరస్పర ప్రీతి కలిగిన దంపతులు కుటుంబము విస్తృతమైన పరివారము గ్రామము దేశము నగరము ఇలా ఈ సాంగత్యబిందువు క్రమంగా విస్తరించుకుంటూ పోతుంది. దీనిలో ఏ స్థాయిలోనైనా సామరస్యం తొలగిపోయినప్పుడు సంఘర్షణ ప్రారంభమవుతుంది. ఈ సంఘర్షణ అశాంతికి పార్యంతికమైన దుఃఖానికి కారణమౌతుంది. కావ్య రసాస్వాదన మనిషి అనుభవాన్ని లోకస్థితి నుంచి అతీతంగా సాధారణీకరణ స్థాయికి ఎదిగేటట్లు చేస్తుంది. సజ్జన సాంగత్యంలో అనేకుల సమావేశం ప్రీతిని కలిగింపగా ఇక్కడ ఏకాంతంలో తానే అనేకత్వాన్ని భజించి ప్రీతిని సంపాదించు కుంటున్నాడు. `ఏపున మంటి నుండి ఉదయించిన జానకి మింటి నుండి ఆవాపముగన్న రాఘవుడు' ఈ ఇద్దరి మధ్య ఉండే దాంపత్య బంధం సృష్టి సామరస్యాన్ని ప్రతీకాత్మకంగా వ్యక్తం చేస్తున్నది. ద్యానాపృథివిసంగమము వేదాల నాటి నుంచీ సంకేతితమై మనదాకా సాగివస్తున్నది. `ధరసింహాసనమై నభంబు గొడుగై' అన్న పద్యంలోనూ ఈ ఊర్థ్వ అధోలోకాల సామరస్యము వ్యక్తమౌతున్నది. ఆకాశంలో ఒక మహా సముద్రాన్ని నిర్మించి దేవతలు ఆ జలాన్ని భూమి విూదికి కుమ్మరించారని ఋగ్వేదం పేర్కొంటున్నది. దివ్యచైతన్యం భూమికి అభిముఖంగా కదలిరావడం ఇక్కడ ప్రతీకాత్మకంగా ఉద్దిష్టమైన అంశం. స ఉత్తరస్యాత్ అధికం సముద్ర మాపోదివ్యాఅసృజత్ వర్షా్య అభి అస్మిన్ సముద్రే అధ్యుత్తరస్మిన్ ఆపోదేవేభిర్నివృతా అతిష్ఠత్ ఋగ్వేదము 109856 మన జీవితంలోకి దిగివచ్చిన మతం కానీ దేవతావ్యవస్థ కానీ ఆచార వ్యవహారాలు కానీ కుటుంబ సంబంధాలు కానీ ఈ దివ్య భూమికతోడి స్పర్శను కలిగి ఉంటవి. కానీ ఈ నేలను విడిచి ఎక్కడికో పారిపోవడానికి ఉద్దేశించినవికావు. జీవితాన్ని అనుభవించడం భారతీయ దర్శనంలో ప్రధానాంశం. `జీవేమ శరదశ్శతం నందామ శరదశ్శతమ్' ఇత్యాది వాక్యాలు జీవితాన్ని ఎంత సౌభాగ్యవంతం చేసుకోవచ్చునో నిరూపిస్తాయి. `సహనౌ భునక్తు' `శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే' ఇత్యాది వాక్యాలు సకల జీవుల మధ్య ఉండవలసిన సామరస్యాన్ని వెల్లడి చేస్తున్నవి. పంచభూతములకు చరాచరములకు భూమ్యాకాశములకు ోభ కలిగించని శాంతి భావన సృష్టికీ మానవునికీ నడుమ ఉండవలసిన సామరస్యమును వ్యక్తం చేస్తున్నవి. సమాజంలో మానవ సంబంధాలు గ్రామీణ వ్యవస్థ సజీవంగా ఉన్నంత కాలం సామరస్యం కేంద్రంగా పరస్పర సహకారము, పరస్పర అనుబంధము, పరస్పర పరిపూరకత అనే భావనలు ఆధారంగా నిలచి ఉండేవి. ఐహికలోక శాంతికి ప్రధాన భావనలు ఈ సామరస్యము మీద ఆధారపడ్డవి. మనిషి తనలోని అంతర్ వ్యక్తితో తనకు తన చుట్టూ ఉన్న సమాజంతో తనకూ తన చుట్టూ ఉన్న ప్రకృతిలో, తనకూ విశ్వనియామకమైన ఋతముతో నెలకొల్పవలసిన సమన్వయాన్ని జీవనానికి ఆధార సూత్రాలుగా ఏర్పరచినట్లు మనకు స్పష్టమౌతుంది. పారిశ్రామిక నాగరికత సాంకేతిక విప్లవము మానవ జీవితానికి ఈ సమన్వయ భావం నుండి చాలా దూరం దాకా తీసుకువెళ్ళాయి. విధ్వస్తమయిన సామరస్యము కారణంగా తనలో తాను మానవుడు అస్తిత్వ విచికిత్సతో అంతులేని అంధకార గుహలలో పరిభ్రమిస్తున్నాడు. ప్రకృతిని విడిచి ఈ సామరస్య సూత్రాన్ని విడిచి మానవుని సుఖ సాధనయే పరమార్థంగా ఏర్పరచుకొన్న సిద్ధాంతాలు మానవ సమాజ పునర్నిర్మాణ సూత్రాలు ఘోరంగా విఫలం చెందాయి. సమాజంలోని అంతరైక్య సూత్రాలు భంగింపజేసే కుల మత భాషాప్రాంతాది భేదాలు దుఃఖాన్ని సంోభాన్ని రోజు రోజుకూ అధికం చేస్తూనే ఉన్నవి. నిత్య జీవితంలో మనం ఆచరించే పండుగలు అలవాట్లు పద్ధతులు సూక్ష్మంగా వివేచించినపుడు మనకు జీవనాన్ని ఇప్పటివరకు అనుశాసించిన సామరస్య సూత్రాలు సౌందర్య శాస్త్ర అనుభవాలు లౌకికాలౌకిక భూమికల అనుసంధానాలు స్పష్టంగానే వ్యక్తమవుతాయి. పూజాదులలో మనం వాడే యంత్రాలు రేఖాగణితం సూత్రాలు ఆధారంగా రూపొందినవి. వీటిలో ముఖ్యంగా కనిపించే అంశాలు బిందు, త్రికోణ, చతురస్ర వలయాలు ఈ నాల్గింటి కలయికల చేత ఓత ప్రోత లక్షణము చేత ఈ దేవతా యంత్రాలన్నీ రూపు దిద్దుకున్నాయి. ఈ లక్షణమే పండుగలలో మనం ఇళ్ళలో వాకిళ్ళలో వేసే ముగ్గుల వల్ల అభివ్యక్తం అవుతున్నవి. ఇక్కడ కూడా బిందు త్రికోణ రేఖావలయాలే ప్రధానాంశాలు. ఈ ముగ్గులన్నింటిలోనూ సమలయ సౌష్టవము ప్రధానాంశంగా ఉండటం మనం గమనించవలసిన అంశం. మన ప్రాంతంలో భాద్రపద అశ్వయుజ మాసాలలో స్త్రీలు అన్ని స్థాయిలలోనూ జరుపుకునే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు ఉన్నాయి. బొడ్డు అంటే నాభి, కేంద్రము, బిందువు. ఈ బిందువు శ్రీచక్ర మధ్యంలో ఉండే బిందువే. ఈ బిందు రూపిణియైన మహామాతను మేరు ప్రస్తారంలో నిర్మించుకుని అర్చించటం దీనిలోని ప్రధానాంశం. శ్రీవిద్యా సంప్రదాయంలోని శ్రీచక్రార్చనమెంత ముఖ్యమైనదో బొడ్డెమ్మ పండుగ కూడా అంతే ముఖ్యమైనది. బతుకమ్మ పండుగ కూడా నవరాత్రులతో సమాంతరంగా గౌరీదేవి ముఖ్య అర్చనీయగా ఆచరింపబడటం సృష్టి వికాసానికి జీవన ఉద్వేలతకు సంకేతాలయిన పూలు ప్రధాన ద్రవ్యంగా వాడటం మన బ్రతుకు సారాంశాన్ని చైతన్యాన్ని అభివ్యక్తం చేస్తున్నది. ఈ పండుగను చేయడానికి సామాజికంగా ఏ విధి నిషేధాలు లేవు. అందువల్ల లిటిల్ ట్రెడిషన్, గ్రేట్ ట్రెడిషన్ అల్ప సంప్రదాయము మహా సంప్రదాయములు అనే పేర సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయడం వృధా ప్రయాస. అన్ని స్తరాలలో ఒకే సందేశం, ఒకే భావన, ఒకే తత్త్వం, భిన్న భిన్న రూపాలలో ఆచరణలోనికి దిగిరావడం దీనిలోని రహస్యం. మనం ఆచరించే పండుగలలో ఎక్కడా మత ప్రసక్తికి ప్రాధాన్యం లేదు. పారి వారిక, సామాజిక సమన్వయమే ఇక్కడ ఆధారభూతమైన అంశం. పండుగల ఆచరణలో అన్నమయ ప్రాణమయ మనోమయ భూమికలకు సామరస్యాన్ని సాధించడం ప్రధానమైన లక్షణం. గృహాలంకారాలలో వాస్తు నిర్మాణాలలో ఏకరూపత సామరస్యం పూర్వం ప్రధానాంశాలయితే ఇప్పుడు అపూర్వత లయభంగము వైవిధ్యము వైరుధ్యము ప్రధానాంశా లవుతున్నవి ద్వార బంధాలకు ఉండే ఏనుగు ముఖాలు చిలుక కొయ్యలు ఈనాడు ప్రదర్శనశాలలో చూడవలసే ఉంది. మతము, ఉపాసన మొదలైన అంశాలు ఎంతో వైవిధ్య పూర్ణంగా మనకు కనిపించినా ఒక సామరస్యభావన నెలకొల్పే ప్రయత్నం ఎప్పటికప్పుడు జరుగుతూనే వచ్చింది. స్త్రీ పురసరూపమైన దేవతా సామరస్యము అర్థనారీశ్వర మూర్తిలో అభివ్యక్తం అయింది. అలాగే హరిహరాభేదభావన సమన్వయం కోసమే ఆవిష్కరింపబడింది. అసలు తత్వానికి ఏ రూపమూ ఏ నామమూ లేదని అది అనిర్వచనీయమైన బ్రహ్మతత్త్వ మేనని `విష్ణూరూపాయ నమశ్శివాయయని పల్కెడు భక్తజనము వైదిక ధ్యాయిత కిచ్చమెచ్చు పరతత్త్వము గొల్చెద' అంటున్నాడు తిక్కన సోమయాజి. ప్రతికాలంలోనూ ప్రతి కొత్త సంప్రదాయం వచ్చినపుడల్లా ఈ సమన్వయ భావం ముందుకు వస్తూనే ఉన్నది అందుకే శ్రీ శంకర భగవత్‌పాదులు షణ్మత స్థాపకులు అయినారు. వైదిక వైదికేతర సంప్రదాయాలు పురాణాల నాటికి సమన్వయం పొందాయి. శ్రీ విద్యాసంప్రదాయంలో దశమహా విద్యలు అని దేవీ ఉపాసనలు పది విధాలుగా చెప్పబడ్డవి. కాలాంతరంలో వైష్ణవ మార్గానికి చెందిన దశావతారాలతో వీటికి ఐక్యభావన కలిగించడం జరిగింది. కృష్ణస్తు కాళికా ప్రోక్తా రామమూర్తిశ్చ తారిణీ వరాహో భువనాప్రోకా నృసింహో భైర వీశ్వరీ ధూమావతీ వామనస్యాత్ ఛిన్నా భృగు కులోద్భవః కమలా మత్స్యరూపఃస్యాత్ కూర్మస్తు బగళాముఖీ మాతంగీ బౌద్ధ ఇత్యేషా షోడశీ కల్కి రూపిణీ(దశ మహా విద్యలు కొమరవోలు వేంకట సుబ్బారావు (2000) పే 190) దేవీ దేవతల నడుమ వలెనే ఈ సామరస్యము మానవ జీవితాలలో సాధించడానికి సమష్టి కుటుంబ వ్యవస్థ దాంపత్యము కేంద్రంగా ఏర్పడింది. సృష్టికి ఆధార భూతమైన ప్రకృతి పురుషూల వలెనే కుటుంబానికి స్త్రీ పురుషూలు కేంద్ర స్థానంలో ఉండే పరిపాలించవలసి ఉన్నది. మొత్తం ఈ చక్రానికి కేంద్రబిందువు తల్లి. బహిర్వలయం తండ్రి. ఈ రెంటి నడుమ సంబంధము పరస్పరాధార భూతము. లోకానుభవంలోకి వచ్చే అర్థకామానుభవంలో ధర్మానుసంధానము దానికి ఒక సుస్థితిని కల్పిస్తుంది. కుటుంబంలోని స్త్రీ పురుషూల నడుమ బంధువుల నడుమ అతిచార స్థితికలుగకుండా కామభావాన్ని క్రమీకరించడం నిమిత్తం. పరిహాసాలు వెక్కిరింపులు ఏర్పడ్డాయి. అకలష్మంగా అట్లాగే వదినె మరదుల మధ్య మాతృవత్ భావన అలాగే రూపొందింది. మన దేశంలో అనాధిగా వస్తున్న సంప్రదాయాల్లో అతిథి అభ్యాగతుల సమర్చన ఒకటి. ఈ అతిథిని సాక్షాత్తు ఈశ్వరునిగా భావించి పూజించుమని ఈశోపనిషత్ చెప్పిన `తేన త్యక్తేన భుంజీథాః అన్న వాక్య తాత్పర్యము గోచరిస్తుంది. సమాజంలో కృతజ్ఞతా భావము విశ్వరూపంలో విస్తరించడానికి ఋణభావన ఏర్పరచబడింది. దేవ ఋణం ప్రకృతితో తాదాత్మా్యన్ని పితౄణము కుటుంబంతో తాదాత్మాన్ని ఋషిఋణము జాతి వారసత్త్వంతో విజ్ఞానంతో తాదాత్మా్యన్ని సూచిస్తూ ఉన్నవి. నిత్య జీవితంలో సౌందర్య శాస్త్రానికి ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నా లేకపోయినా బ్రతుకులోని లయను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రతిక్షణమూ ప్రతికార్యమూ దోహద పడుతుంది. క్రమ రాహిత్యాన్ని అసౌష్ఠవాన్ని అనే చిత్యాన్ని పరిహరించగలిగితే జీవితమంతా సౌందర్య స్థానం అవుతుంది. మన పరిసరాలలో ఉన్న ప్రతివస్తువూ ప్రతిపూవూ ప్రతి మబ్బు, ప్రతి వాయువీచిక మనను అనుకరిస్తూనే ఉంటాయి. సమన్వయానికి దూర మైనప్పుడు చిత్తశాంతి కోల్పోయినపుడు జీవితాన్ని స్వార్థం కేంద్రంగా నిర్మించుకోవలసి నపుడు లయ తప్పిన జీవితం పరిహార్యం, ఆక్షేపణీయం, జుగుప్సావహం అవుతుంది. జీవితంలో నిగ్రహంతో శాంతచిత్త స్థితితో సాగించవలసిన లయను కళా రూపాలలో అంతర్ముఖీనమైన, అనుద్విగ్నమైన చిత్రవృత్తితో సాధించవలసి వస్తుంది. ఆయా కళావిష్కరణలన్నీ రచయిత శిల్పమైతే వ్యర్థ పదార్థాన్ని తొలగించటం చేత పొందుతున్నారు. లయ విరహితమైన భౌతిక జగత్తులోకి లయను ఆవిష్కరించటం కళా ధర్మమవుతున్నది. కూనిరాగం ఒక పాటగా, ఒక పదంగా, ఒక కీర్తనగా, ఒక స్వరరాగ మేళగా రూపొందటం లయ పొందుతూవున్న పరమ ఉన్నత స్థితిని వ్యక్తీకరిస్తుంది. శ్రీ అరవిందులు లయను గురించి ఇలా అన్నారు `లయ యేర్పడటం కవిత్వ ప్రేరణలో భాషా శక్తి వంటి అంతర్గత భాగమే. లయ సాధారణంగా తానై వస్తూనే భాషకూ, భావాల తోడి అనుసంధాన్ని యేర్పరస్తుంది. ఈ అంశాలన్నీ ఎక్కడో వెనకాల సంసిద్ధమయ్యే ఉన్నాయి. వాటిని స్వీకరించి ప్రసారం చేయటమే మిగిలింది. సామాన్యంగా మన భౌతిక మనస్సే, కలతయే నిరోధం కలిగించేది.' లయను సాధించేందుకు తొలిప్రయత్నం అస్తవ్యస్త పరిస్థితిని తొలగించటం. రెండు యధోచితంగా నూతన వ్యవస్థను యేర్పరచటం. యధోచిత నూతన వ్యవస్థా నిర్మాణ సందర్భంలో విశ్వలయతో అనుబంధం పొందినప్పుడు అది తప్పకుండా సాధ్య మవుతుంది. అస్తవ్యస్త పరిస్థితిని చూచినపుడు వ్యథ పొందిన తాను, సామాన్య లయ రహిత స్థితి నుంచి బయటపడకుండా మరొక పరిస్థితిని కలిపించే ప్రయత్నం చేయటం, తాను నిర్మూలించిన వ్యవస్థ నిర్మాణానికి హేతువులైన స్వార్థము, భయము, అరక్షణ భావము మొదలైన అంశాల జోలికి పోకుండా అలాంటివే మరొక రూపం పొందిన ఆ భావాలే ఆధారంగా నిర్మించటం వల్ల మరొక పూర్వ వ్యవస్థా వికృత సంతానం ఆవిర్భవిస్తుంది. 20వ శతాబ్దంలో కుప్పకూలిపోయిన సామ్యవాద వ్యవస్థలకు ఈ తత్తా్వన్ని అవగాహన చేసుకోక పోవటమే ప్రధాన కారణం. వ్యక్తులకు, వ్యక్తుల సమూహాలకు (సమాజాలకు) అత్యధికంగా ఒక ముద్రవేసి ఒక లక్షణాన్ని ఆపాదించి మన సిద్ధాంతం నిర్మించరాదు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తి ఎదిగిపోయే ఒక విశిష్ట విలక్షణ భావ సంపుటి. దైవాసుర సంఘర్షణ అన్నది సైద్ధాంతికంగా భావముల మధ్య ఘర్షణయే కాని, వ్యక్తుల, సమూహాల జాతుల నడుమ సంఘర్షణ కాదు. ధృతరాష్ట్ర దశరథ శబ్దాలు ప్రతీకలు. రావణ వర్గంలో విభీషణుడు నియంతృత్వానికి భీతి చెందని వాడున్నాడు. కౌరవ వర్గంలో ధర్మానికి దుర్వా్యఖ్యలు వినక ధైర్యంగా ఎదుర్కొనే వికర్ణులూ ఉన్నారు. ప్రాతిభాసికమైన వైరుధ్యం ఆత్యంతికం కాదు. అందువల్లనే భాసుని వంటి మహా నాటక కర్త పాంచరాత్రంలో కౌరవ పాండవులకు సమరసభావం కుదిరి యుద్ధం నివార్యమైనట్లుగా చిత్రించాడు. దుర్యోధననిలో ఉన్న ధర్మజీవుణ్ణి వెలికి తీసుకొని వచ్చి రెండు సమూహాల నడమ ఉండే సామరస్యమును ప్రత్యక్షంగా వ్యాఖ్యానించాడు. దుర్యోధనుడు ద్రోణాచార్యులకు గురుదక్షిణ నీయబోతాడు. ఆతడు గురు దక్షిణగా అర్థరాజ్యం పాండవుల కిమ్మంటాడు. అనేక సన్నివేశాల తరువాత పాండవులకు రాజ్యం సంక్రమిస్తుంది. ఈ సన్నివేశంలో వైరస్యం ఉన్నవాళు్ల కౌరవ పాండవులు. ఇద్దరికీ సామరస్యం కుదిరించే కార్యబిందువు ద్రోణుడు. రెండు పక్షాలకు సమానుడైన గురువు అతడే. కౌరవ పాండవ పక్షాలు అనే రెండు బిందువులు తమ తమ సామరస్యం కోసం చేరుకున్న ద్రోణుడనే బిందువు దగ్గర సంగమించారు. ఇదొక త్రిభుజం. వైరస్యమున్న రెండు దూర బిందువులు శిఖరం దగ్గర వైరస్యాన్ని కోలుపోవటం ఇక్కడ ప్రధానాంశం. జీవితాన్ని గురించి ఒక తాత్తి్వక సూక్తిగా `సత్యం శివం సుందరం' అన్న త్రిపుటి వ్యాప్తిలో ఉన్నది. ఆధునిక భారతీయ తాత్తి్వక భావ మర్యాదలో నుంచి ఈ పదబంధం పుట్టింది. ఉపనిషత్తులలో పేర్కొన్న పదబంధం కాదు. బ్రహ్మతత్త్వమును గురించి సత్యం, జ్ఞానం, అనంత బ్రహ్మ అనీ శాంతం శివం అదై్వతం అని వాటిల్లో వర్ణింపబడింది. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అన్న పాశ్చాత్య సాహిత్య భావ ప్రతిఫలనం నుంచి ఈ పదబంధం పుట్టి ఉంటుంది. ఈ పదబంధంలో శివశబ్దమే కేంద్రం. సత్యమూ, సుందరము శివము లక్ష్యముగా కొనసాగాలి. చివరకు చేరవలసిన బిందువు అదే శివఏవ కేవలం, మనిషి పురోగమించిన కొద్దీ అనేకములైన విరుద్ధాంశాలు సమన్వితాలవుతూ పోతవి. అప్పటికి మనకు సృష్టిమూలంలో ఉన్న ఏకత, సమగ్రత ఆవిష్కారమవుతవి. గాంధీజీ ఒకచోట ఇలా అన్నారు. `చిమ్మచీకటి నడుమ వెలుగు ఉంటుంది. మృత్యువు నడుమ జీవనం ఉంటుంది. ద్వేషం మధ్యలో ప్రేమ ఉంటుంది.' పైకి అత్యంత విరుద్ధాలుగా కానవచ్చే అంశాల నడుమ ఒక సహజీవనం ఎలా ఉంటుందో సర్వమునందూ ఈశ్వరాంశ ఎలా నిగూఢమై ఉన్నదో ఈ వాక్యాలు స్ఫుటం చేస్తవి (గాంధీ శతాబ్ది సంచిక విశ్వభారతి 1969). ఇక్కడ సత్య శివముల నడుమ అనుసంధాన బిందువు సుందరము. జీవలోకము అత్యంత ప్రయత్నముతో సాధనతో తపస్సుతో సాధించుకొన్న ఉన్నత స్థితి ఈ సౌందర్య లోకము. ఈనాడు మానవ జీవనంలో వచ్చిన పరిణామాలు విద్యుచ్ఛక్తి, దూరయానాలు, కంప్యూటర్ ఇవన్నీ మనిషిని అతిగా విస్తరించిన లోకసంబంధాలతో అంతర్ముఖుణ్ణి కాకుండా నిరోధిస్తున్నవి. మనుష్యూడు ఇవాళ కేవలం `బహిర్ముఖుడు' మాత్రమే. జీవనదులు కలుషితాలవుతున్నవి. వనసంపద నిర్మూలిత మవుతున్నది. పక్షులు దూర దూరాలకు వలస పోతున్నవి. అనేక జీవకోటి క్రమక్రమంగా నశించి పోతున్నది. ప్రకృతిలో సమతులనం భంగింపబడుతున్నది. మానవ జీవితాన్ని చూస్తే సమష్టి కుటుంబాలు క్రమంగా తొలగిపోతున్నవి. మానవ సంబంధాలలో ఆర్ర్దత, ఆత్మీయత లోపించాయి. భాగవతంలో కృష్ణలీలలు చదివితే ఒకటి రెండు తరాల తరువాత శ్రీకృష్ణూడు కాన్వెంట్‌లో చేరక ఇంకా ఇంట్లో ఎందుకు ఉన్నాడనే ప్రశ్న పుట్టవచ్చు. ఉమాపతిధరుడనే కవి సదుక్తి కర్ణామృతంలో శ్రీకృష్ణూని అద్భుత లీలలను వర్ణించాడు. పశువులను మేపడానికి వెళ్లిన శ్రీకృష్ణూడు ఇంటికి రాలేదు. నందుడు ఆందోళనలో ఉన్నాడు గోపబాలకులు భయంతో తాము అతన్నెక్కడ చూచిందీ చెబుతున్నారు. ఒకడంటాడు యమునా పులినతలంలోనని, రెండోవాడు అది కాదుకాదని పర్వతం క్రిందుభాగంలో చూచానంటాడు. మరొకడు అదీకాదని మర్రిచెట్టు నీడలో చూచానంటాడు. నాల్గవవాడు కాదుకాదు నేను అతణ్ణి రాధ తండ్రి ఇంటి ముంగిట్లో చూచానంటాడు. ఇలా చెబుతూ వుండగానే ఆతడేమో నందగోపుని ఇంట్లో నుంచే బయటకు వచ్చాడు. ఈ శ్లోకంలో ఒకరినోటను మరొకరు కాదుకాదని నిషేధించటం ఎంత అందంగా పొదుగబడిందో చూడవలసిందే. కాళిందీ పులినేమయా, నన మయాశైలోపకంఠే, నన న్యగ్రోధస్యతలేమయా, నన మయా రాధా పితుః ప్రాంగణే దృష్టః కృష్ణ ఇతీరితస్య సభయం గోపైర్యశోదాపతే విస్మేరస్య పురోహస న్నిజగృహా న్నిర్యన్ హరిః పాతు వః (స.క. శ్లో 255) శ్రీ కృష్ణ ప్రసక్తి వచ్చింది కాబట్టి మన పండగలు చాలావరకు కాలగర్భంలో కలసిపోయిన సంగతి గుర్తువస్తున్నది. కృష్ణాష్టమి తెల్లవారి ఉట్ల పండగ. అదొక వినోదం. అదొక సాహసం. శ్రీకృష్ణానుభావంతో, తాదాత్మ్యం సిద్ధికోసం మనం ఆ వాతావరణంలోకి వెళ్లే ప్రయత్నం. అన్నమయ్య కీర్తనలలో ఉట్ల పండుగను వర్ణించే పాట ఎంతో అపురూపమైంది. ఉట్లు ఎన్నో రకాలు. వాటిల్లో పెట్టే సామాగ్రి వివిధతా పూర్ణమైందే. బాలులతో వీధులలో పారాడు వారు కోలలెత్తుక వుట్టీ గొట్టీ జుండి నారికడపువక్కలు, నానిన సనగలు చారపప్పు తేనెలు చక్కెరలును పేరిన నేతులు నాన బియ్యాలు నుట్ల నవే చేరి యశోద బిడ్డకు జెప్పేరు సుండీ చక్కిలాలు నడుకులు సనిగెపప్పులును చెక్కిన మెత్తటి తోట చెఱకులును పెక్కువగా నుట్లలో బిందెల నించిన వవె చక్క నెశోద బిడ్డకు జాటేరు సుండి నువు్వలు చిటిబెల్లాలు నున్నని చిమ్మలులు నువు్వటిడ యును చిన్ని నురుగులును ెువ్వారు వెంకటపతి కెరిగింప నారగించి కివ్వకివ్వ నవ్వ నణకించీ జుండీ (కొత్త సంపుం 1256) (`రసమయి'లో శ్రీ వేటూరి ఆనందమూర్తి వ్యాసం `ఉట్లపండగ' నుంచి)(ఆగస్టు 2003) మనం ఆ పండుగలకే కాదు ఆ భావతాదాత్యా్మనికీ దూరమైనాము. ఆ చిరుతిండ్ల పేర్లే మనకు ఈనాడు తెలియక పోవచ్చు. త్రవు్వకుంటూ పోతే ఇలా ఎనై్ననా గతకాలంలోని సదంశాలను లెక్కించుకోవచ్చు. అయితే లెక్కించితే వ్యతిరేకాంశాలూ ఉంటాయి. మొత్తం మీద సమాజాన్ని అత్యంతాల్పమైన ప్రభుత్వ వ్యవస్థ, ఆత్మీయత మీద ఆధారపడ్డ కుటుంబ వ్యవస్థ, సమష్టి క్షేమాన్ని కేంద్రంగా భావించిన కుటుంబ వ్యవస్థా కాపాడుతూ వచ్చాయి. వికేంద్రీకృతమైన పరిమిత విస్తృతి కలిగిన సమాజంలో ఉన్నంత పరస్పర ధార్మిక నియమన రీతి ప్రపంచమంత విస్తరించి ఏకకేంద్ర వ్యవస్థితమైన వర్తమాన ప్రపంచంలో ధర్మం నిర్వచించేది ఆ ఏక కేంద్రమే. యుద్ధాలు నడిపినా, వాటినుంచి తొలగినా వారి యిష్టమే. ఎక్కడికక్కడ నియంత్రణలూ, ప్రతినియంత్రణలూ ఉండవలసిందే. వర్తమానం దిక్కు చూపలేనప్పుడు మనుష్యూడు స్వయం నియంత్రణ కోసం గతంలోకి త్రవు్వకుంటూ పోతాడు. రామాయణం మళ్లీ మళ్లీ రూపు ్టట్టుతుంది. `సర్వ ధర్మ మూల బీజంబుగా' శ్రీమద్రామాయణ కల్పవృక్షం ఆధునిక కాలంలో పునరుద్గతం కావటానికి ఇదే హేతువయింది. కన్నడంలో కె.వి. వుట్టప్ప 1949లో `శ్రీరామాయణ దర్శన' రచించితే అదే భాషలో వీరప్ప మొయిలి `శ్రీరామాయణ మహాన్వేషణ' రచిస్తున్నారు. అస్థిపంజరాలు ఒకటే అయినా ఆత్మలు వేరు. దర్శనాలు వేరు. అన్వేషణలు వేరు. అయితే ఈ రామకథాపరంపర అనాది నుంచీ సాగివస్తున్నదే. కాలము, తత్త్వగవేషణ, భావుకత్వం, నూతన శిల్పాను సంధానం ఇవన్నీ వినూత్నంగా అనుస్యూతికి దోహదం చేస్తున్నది. ఒక మహావృక్షం యుగాలుగా అలాగే ఉన్నట్లు కనిపించినా మూలం తప్ప ప్రతిదీ మారిపోతున్నది. స్కంధము, శాఖలు, పత్రపుష్పాలు అన్నీ. ఇదీ జీవంతమైన సంప్రదాయం, ఈ జీవంతమైన సంప్రదాయం క్రొత్త దర్శనానికి కారణం అవుతున్నది. ప్రతి యుగం సత్యాన్ని కొత్త సౌందర్యంతో ఆవిష్కరించుకొని మరల మరల `శివ' శిఖరం వైపుగా అధిరోహింప జేస్తున్నది. ఇది అనుస్యూతి. ఇది సంప్రదాయం. నూతన సౌందర్య దర్శనం. ఇదే మృత్యువుకు తొలగించేది. మహాభారతం చెప్పింది. మృత్యువు అంటే అత్యంత విస్మృతి అని. `ప్రమాదంవై మృత్యురహం బ్రవీమి తథా అప్రమాదం అమృతత్వం బ్రవీమి.' ఏ దశలో మృత్యువు ఆ దశలోనిదే (ఉద్యోగ424 సనత్సు జాతీయం) ఈ అనుస్యూతిని విస్మరించటం మృత్యువును పొందటం. అంటే సంప్రదాయాన్ని విస్మరించటం. అది నిత్య పరివర్తన శీలమైంది. అందుకే అలంకార శాస్త్రం చెప్పింది `క్షణే క్షణే యన్నవతా ముపైతి తదేవరూపం రమణీయతాయాః' అని. నిత్యపరివర్తన శీలమైన ఈ సంప్రదాయం పాతబడిన ఆకులను బెరడులను పుష్పాదులను పరిత్యజిస్తుంది. మృత్యు లక్షణాలను తొలగించుకొని ప్రాణోద్విగ్న వసంత లక్షణాలతో ప్రకాశిస్తుంది. మహాయోగి శ్రీఅరవిందులు ఈ నిత్యలక్షణాన్ని ఇలా చెప్పారు. అవిద్య సరిహద్దులు వెనక్కు తగ్గుతవి. అధికాధిక జీవులు వెలుగులోకి ప్రవేశిస్తారు ప్రకృతి అంతస్సులో గర్భితమైన దివ్యత్వాన్ని ప్రకటిస్తుంది దివ్యచేతన మానుష లీలలను వెల్లడిస్తుంది. భౌమజీవనం దివ్యజీవనం అవుతుంది. (సావిత్రి 111)

Subscribe to:
Posts (Atom)