Thursday, July 16, 2009
కృష్ణశాస్త్రి కావ్య సౌందర్యము
దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరు ఆధునికాంధ్ర సాహిత్యంలో పారిజాతనికుంజం వంటి చోటు. లలిత కోమల కాంత పదావళితో భారతీయ సాహిత్యంలో జయదేవుని స్థాన మెల్లాంటిదో ఆధునికాంధ్ర సాహిత్యంలో శిరీష కుసుమ పేశల సుధామయోక్తులతో కృష్ణశాస్త్రిదీ అల్లాంటిదే. ఈ శతాబ్దంలో భావ కాల్పనిక కవితా ప్రస్థానం ప్రారంభించిన రాయప్రోలు, గురజాడల మార్గంలో ఒక భావుకతా శిఖరం నిర్మించిన కవి వతంసుడు కృష్ణశాస్త్రి `తలిరాకుజొంపముల సందుల త్రోవల నేలవ్రాలు తుహినకిరణ కోమలరేఖ'యై తెలుగు సాహిత్యంలో కృష్ణశాస్త్రి పద్యం వినూత్న అభివ్యక్తి లోకాలకు తలుపులు తెరచింది. ఆధునిక నాగరతతో వ్యస్తమైన జీవనంలో సహజమైన ప్రకృతితోడి సామరస్యం గల జీవనం నుంచి, దూరంగా తొలగిపోయిన ఈనాటి మానవుడు మళ్ళీ ప్రకృతి తోడి తాదాత్మా్యన్ని వాంఛిస్తున్నాడు. ఈ తాదాత్మ్యం కోసం ఈ సభ్యతల వలలో చిక్కుకుని పోయిన మిగిలిన వారికంటే తా నొంటరి తనాన్ని పొంది ప్రకృతి ెుుక్క నిసర్గమైన సాన్నిధ్యంలోకి వెళ్లాలని ప్రయత్నం ప్రారంభించాడు. `ఆకులో ఆకునై, పూవులో పూవునై, కొమ్మలో కొమ్మనై, నునులేత రెమ్మనై, ఈ యడవి దాగిపోనా ఎటులైన ఇచటనే ఆగిపోనా' అని ప్రశ్నించుకున్నాడు ఈ భావ యాత్రలో కవి గలగలని వీచు చిరుగాలిలో కెరటమై జలజలని పారు సెలపాటలో తేటనై పగడాల చిగురాకు తెరచాటు తేటినై పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై తరులెక్కి అల నీలగిరినెక్కి మెలమెల్ల చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై పరిణమించాలని సంకల్పించాడు. నేల విూద నుంచి నింగిదాకా ప్రాకి అన్ని చైతన్యస్థానాలలో తానే అదై, అన్నీ తానై పోవాలని భావన చేస్తున్నాడు. ఈ భావతాదాత్మ్య దశలో వ్యష్టియైన తన వ్యక్తిత్వం సమష్టిలో లీనమవుతున్నది. అప్పుడు తనకు మిగిలేది `సర్వభూతస్థ మాత్మానం, సర్వభూతాని చాత్మని పశ్యతే (ెుూగయుక్తి) వ్యష్టి బిందువు నుండి సమష్టి సముద్రంలోనికి చేసే మహాప్రయాణం. అందువల్ల జగత్తు తోడి తాదాత్మ్యం సులభంగా సిద్ధిస్తుంది. కాల్పనిక కవితాతత్త్వం ఈ స్థితికి చెందిందే. మనోలోకంలో సమష్టివ్యధలు, బాధలు కల్లోలాలు అన్నీ కవిలో ఆత్మీయతను పొంది, గాఢదశలో అభివ్యక్తమవుతవి. ఈ సర్వత్ర సమదర్శనమన్న స్థితిని పొందటానికి కవి ఎంతో ఒరిపిడిని పొందవలసి ఉన్నది. అది ఒక ఏకాంతస్థితి `ఆకలా దాహమా చింతలా వంతలా ఈ కరణి వెర్రినై ఏకతమ తిరుగాడ' భావుకులుకాని అన్నమయ ప్రాణమయకోశాలకు నిబద్ధులైన వారికి ఈ బాధ, ఘర్షణ, ఉన్న స్థితితో అసంతృప్తి మొదలైన అంశాలు పొందే విలక్షణుడైన కవిని చూచినప్పుడు వెర్రివాడుగానే గోచరిస్తాడు. ఏ మార్గంలోనైనా ఈ స్థితి ఉండనే ఉన్నది. వర్తమానంలో ఉన్న ఈ దుఃఖం వల్ల, కట్టుబడుల వల్ల సంకుచితుడైన మానవుడు స్వేచ్ఛ కోసం పరితపిస్తున్నాడు. ఈ దాస్యశృంఖలాలు క్రౌర్య కౌటిల్య కల్పిత కఠిన దాస్యశృంఖలాలు. ఇవి తమంత తామే చెదరిపోవాలి. జీవితంలోని దుఃఖాన్ని గుర్తించడంలో కాల్పనికవులు బుద్ధదేవుని వలె లోకాన్ని దర్శించారు. దుఃఖం నుండి విముక్తి వాళ్లకు లక్ష్యమైంది. అయితే దుఃఖమూలంలోకి వెళ్లినప్పుడు వాళు్ల ఈ వేదనలన్నీ అనుభవించవలసి వచ్చింది. ఈ గాఢమైన మనస్సులోకి, అగాధంలోకి తమంత తాముగా ప్రవేశించి ఆ గాఢాంజన గర్భంలోనుంచి చీల్చుకుంటూ పైకి రావలసి వచ్చింది. అప్పటి స్థితి తిమిరలత తారకా కుసుమములు తాల్ప కర్కశశిలయు నవజీవ కళల దేర మ్రోడు వెుూక చివురులెత్తి మురువు సూప నున్న స్థితి తిమిరిలత అన్న స్థితి అగాధమై సృష్టిపరిణామం ప్రారంభంకాని సృష్టి దేవాలయంలో చిరుదీపం కూడా వెలుగని సంకల్ప పూర్వదశ కావచ్చు. రెండవది సంపూర్ణమైన కఠిన శిలాస్థితి. మూడవది చైతన్య స్పందం స్ఫురించే వ్రెుూడు వెుూక, ప్రాణ వికాసంలో క్రమ దశ ఈ విధంగా వ్యక్తమౌతున్నది. ఇలా మూల ప్రకృతిలోకి, దుఃఖ గర్భంలోకి ప్రవేశించి దాని నుండి సంఘర్షించి నూత్న జగత్తును స్పష్టించే సంకల్పంతో ఆ పరిమితులను ఛేదిస్తూ పురోగమనం చేయటం కాల్పనిక కవిత్వానికి పరమలక్ష్యమయింది. ఈ స్థితిలోని పరిణామదశలు ఎన్ని ఉన్నవో అన్నింటినీ స్పష్టరేఖలతో వ్యక్తం చేసిన కవి కృష్ణశాస్త్రి. `యుగయుగంబుల నీశ్వర యోధులగుచు' ఈ వ్యక్తులు స్వేచ్ఛకై తమ ప్రాణ సుమములు అర్పిస్తున్నారు. ఇందువల్ల అమల జీవిత ఫలము ధన్యతను పొందుతున్నది. ఇంతటి ఘర్షణ ఫలితం సామాన్యమైందికాదు. జగత్తు తనతో పాటు పరిణామానికి ఉన్ముఖమై తన పరిమితులనుండి ఉన్ముక్తమై వెంట వస్తూ వున్నది. భయము కలిగించు కష్టాతపంబు మరచి కరము కలగించు వంత చీకట్లు మరచి విశ్వమే పరవశమయి వెంటరాగ తాను ఈశ్వర యోధుడై ముందుకు సాగగా తన వెంట పరవశమయిన జగత్తు కదలి వస్తున్నది. జగత్తులోని దుఃఖాన్ని తొలగించటమే ఈశ్వర యోధుని లక్షణం. ఈశ్వరాభిముఖంగా ఈ జగత్తు పొందే పరిణామక్రమాన్ని వేగిరపరచి దానికి ఆనందమయస్థితిని కలిగింప జేసేందుకు మార్గం వేయటమే కవియైన ఈశ్వర యోధుని ప్రవృత్తి. ఈ ఈశ్వర యోధుని ఉన్ముక్తమైన ఉన్మాదప్రాయమైన దశ `స్వేచ్ఛాగాన'మన్న రెండవ ఖండికలో వ్యక్తమౌతున్నది. `పక్షి నెు్వద చిన్న ఋక్షమెు్యదను, మధుపమెు్యద చందమామ నెు్యదను, మేఘ మెు్యద వింతమెరపు నెు్యదను అలరు నెు్యద చివురాకు నెు్యదను' అంటూ `మాయ మెు్యదను నా మధుర గానమున' అంటాడు. తనకూ తన గానానికీ అభేదం. ఆ స్థితి పొందిన వారికి మళ్ళీ ప్రకృతి ఆవరణంలోకి వచ్చే అవసరం ఉండదు. వాళు్ల జీవన్ముక్తులు, అందుకే అంటారు కవి `దిగిరాను దిగిరాను దివినుండి భువికి' అని అంటే ఆ చైతన్య పరిమితిలోనికి తిరిగిరానని తాత్పర్యం. కవి అనేక చిత్తస్థితులను వర్ణిస్తాడు. లోకంలో వైరుధ్యం ఉన్నది. సుఖ దుఃఖాలు ఉన్నవి. సుఖముగా ఉన్న దశలో అట్టడుగున ఉన్న దుఃఖాన్ని గుర్తించగలగితే ఈ దుఃఖ స్పర్శలేని స్థితి కోసం పరితపించే దశ వస్తుంది. వైరుధ్యాల వల్ల సంక్లిష్టమైన దశ ఉంటుంది. ఏది ఏమిటో గుర్తించలేము. అమల మోహన సంగీత మందు హృదయ దళన దారుణ రోదన ధ్వనులవిందు ఈ అనిత్యమైన నిరంతర పరిణామ శిథిలమైన జీవితం నుండి జీవుడు ఈశ్వర చైతన్యంలోకి విశ్రాంతి పొందే ఒక దశను కవి వర్ణిస్తాడు. నీలభ్రసరసిలో నిండు జాబిల్లి రాయంచవలె నిహారము సల్పుచుండె కమ్మతెమ్మరలు శాఖా పత్రములనొ కల్లోలినీ తరంగములనో దాగె నాట్యంబు మధుర గానంబును మరచి గాటంపు నిద్దురగాంచె శైవలిని సర్వేశ్వరుని హస్త జలజ యుగ్మమున విశ్వమే హాయిగా విశ్రాంతి జెందె ఈ వర్ణన మాండూక్యములో వర్ణించిన అవస్థాత్రయంలో మూడవ దశను సంబంధించింది. జాగ్రత్స్వప్న సుషూప్తిదశల్లో అనుభవస్థానమైన పురుషూని క్రమంగా విశ్వతైజసప్రాజ్ఞులుగా వ్యవహరిస్తారు. ఇక్కడ భోక్త ప్రాజ్ఞదశలో ఉన్నప్పటి దశ. ఈ ఖండికలో వర్ణితమైంది. సామాన్య దశలో ఉండగా ప్రేరకమైన భావం ఎక్కడినుంచో అపూర్వమైంది స్ఫురిస్తుంది. అతని పాట అన్న గీతంలో `మందమలయానిలోర్మికా మాలికలను లలిత సుకుమార మధుర బాలస్వరంబు నెత్తి, పాడితి వేమేమొ హృదయ కమల వికస నోద్భోధకంబగు వింతగీతి' అప్పుడు తన అనుభవం ఎలా ఉందో వెంటనే వివరిస్తాడు కవి. `సందె వేళ పొలముగట్టు, చల్లగాలి చేతిలో చేయి నునులేత చిత్రములును, ఈవు నేను పిట్ట లటుల నేమియనక, సర్వమును జేర నొక్క యపూర్వభావ ముదయమెు్య కుమార నా హృదయమందు' `మొగముగంటి కనులగంటి మొగిలుగంటి పాటవిను చుంటి' ఈ విలక్షణమైన దశలో అనుభవిస్తున్న కవీ, పాడుతున్న కుమారుడూ ఇద్దరే ఉన్నారు. `ఈవునేను పిట్ట లటుల' అంటే జీవేశ్వరులను పక్షులుగా వర్ణించిన శ్రుతి తప్పక స్మరించబడుతుంది. `ద్వాసవర్ణా సయుజా సఖాయ' అని. విశ్వనాథ ఈ కాలంలోనే `ఈ అనిలాధ్వమందు నినదించెడు మువ్వల మ్రోత దూరమై పోయిన గోతతిన్ పిలుచు పోలిక యేదొ వినిస్వనించెదున్' అన్నిచోట ఈ అవ్యక్త లోకపు ఆహ్వాన గీత స్ఫురణను వర్ణించినాడు. ఈశ్వర భావవేళ దీనుడైన ఈ జీవుని పరిస్థితిని రవీంద్రుడు గీతాంజలిలో వర్ణించినాడు. కృష్ణశాస్త్రి ఒక గీతంలో ప్రసవ కోమల రమణీయ పథము బట్టి పోవుచుందువు లావణ్యమూర్తి నీవు ఏనొ దీనుడ, నే నీడనైన నొదిగి అడుగిడగ లేక నిట్టూర్పువిడువలేక పొరలు కన్నీటి కాల్వలు కురియలేక మ్రోడునై రాయినై నిల్చిపోదు నకట ఇక్కడ పరిణామానికి ముందు జీవుడు రాయిగా మ్రోడుగా నిలిచివున్న దశలను నీడలో నొదిగి ఉండటం, ప్రకృతి పరిమితుల్లో దుఃఖమయజగత్తులో మిగిలి పోవటాన్ని సూచిస్తుంది. బ్రహ్మసమాజ భావన కృష్ణశాస్త్రి కవిత్వానికి ఆధారపీఠం, విశిష్టాదై్వతంలోని సగుణోపాసన స్థానంలో నీరూపమైన ఈశ్వరభావన నిలిపితే బ్రహ్మభావన నిలచి వుంటుంది. అందుచేత ఈశ్వర శరణాగతి వల్ల ఎటువంటి జీవునికైనా నిష్కృతి ఉన్నదనే తత్త్వమార్గం బోధిస్తుంది. ఈశ్వరుడు దోషభోగ్యుడు. ఈశ్వరుని ఈ లక్షణమే అతనిని మనకు నిత్యసన్నిహితుణ్ణి చేస్తుంది. `మలినబాష్ప మౌక్తినము్మ మిలమిల నీ కనుల నిలువ, తళతళమని తారలు నటియించునురా పాపీ !' `కురియుమురా కన్నీటి మరిమరి విలపింపుమురా సరముగూర్చి పరమేశుడె తాల్చునురా పాపీ' శరణాగతి అనన్య గతికత్వము ఈ రెండు లక్షణాలే జీవుణ్ణి ఈశ్వరుని దగ్గరకు చేర్చే అంశాలు. అప్పుడు జీవుని మలినాశ్రుధార పరమపావన జాహ్ననీ ప్రతిభగాంచుతుంది. తావకీన పదసరోజ దళములందు నిలువ నిమ్మొక్క వేడి కన్నీటి చుక్క కడల ప్రసరించు నెత్తావి కమ్మదనము త్రావనివెుూ్మ ప్రభూ ! దాని తనివితీర ఈ జీవయాత్ర పరిమితిలో కృష్ణశాస్త్రి దుఃఖం సమష్టిజీవ దుఃఖమే కాని లౌకికమైన దుఃఖం కాదు. దానికి పరమమైన గమ్యం ఈశ్వర ప్రాప్తి. అవధరింతువు ప్రతి దివసాంతవేళ నిత్య నూతన తాండవ నృత్యకేళి ఓంుు నటరాజ తలలైన ఉపలేక భువనములు దుర్భరానందమున నడంగ ఆటలో పాటలో నేర్చినట్లు దేవ ఏనుగూడ నీవలె నటియింపనిము్మ ఎడతెగని యాత్ర నెట్లొ సాగించు వరకు ఎట్లొ నీ దర్శనము్మ సాధించు వరకు కృష్ణశాస్త్రి చెప్పిన ఈ అనంత యాత్ర సర్వజీవుల యాత్రయే. కాల్పనిక కవిగా కృష్ణశాస్త్రి కవిత్వం విశిష్టమైన స్థానాన్ని ఆక్రమించింది. ఒక పరిమితుల్లో విమర్శకులు దీన్ని భావకవిత్వం అని పిలిచారు. ఆత్మాశ్రయధోరణిలో సాగిన మార్గంలో ఈ కవిత్వంలో ప్రధానస్థానాన్ని ప్రేమ ఆక్రమించింది. ఈ ప్రేమ ప్రకృతికీ, స్వేచ్ఛకూ ఈశ్వరుడికీ పరిమితం కాకుండా స్త్రీ పురుష సంబంధాన్ని విలక్షణంగా విచారించింది. సమాజంలో స్త్రీ పురుష సంబంధాలు, ధర్మ స్ఫూర్తి కోల్పోయిన వివాహవ్యవస్థ కాఠిన్యాన్ని, మౌఢ్యాన్నీ స్త్రీ పురుషూలకు సమాన స్థానం లేక పోవటాన్నీ కల్పించినప్పుడు స్త్రీపుంసయోగంలో ప్రేమకు పట్టాభిషేకం చేసిన ఘనత భావ కవిత్వానిది. స్త్రీని కేంద్రంగా ఆరాధ్య దేవతగా భావించి ఈశ్వర స్థానం కల్పించే వరకూ ఈ కవిత్వం ప్రవర్తించింది. కృష్ణశాస్త్రి వివాహవ్యవస్థ కన్నా స్త్రీ పురుషూల మధ్య స్వేచ్ఛనూ ప్రణయాన్నీ లక్ష్యంగా ప్రతిపాదించినాడు. ప్రేయసిని `తానే సృష్టించుకొన్నాడట. ఎలాగ? తన మనస్సుకు ఎన్నడో ఎక్కడో సోకిన ప్రతి సౌందర్య ఖండాన్నీ, తన హృదయాన్ని ఎన్నడో పలకరించిన ప్రతిప్రేమ శకలాన్నీ ఏరి ఏరి తెచ్చుకుని, అన్నిటినీ కలిపి కలిపీ ఆమెను సృష్టించు కున్నాడట' ఈ మాటలు కవి చెప్పినవే. ఈ ప్రేయసి నితాంత వియోగిని, నిశీధిని, కఠోర ప్రణయశాలిని. అలాంటి ఆమెను గూర్చిన తన అన్వేషణము అనంతమైంది. ఈ భావసుందరిని నిజజీవితంలోకి సాక్షాత్కరించుకునే పని కృష్ణశాస్త్రి కవిత్వం సూచించదు. ఇది ముగియబోని, ఏ యర్థమెరుగరాని వేసటేలేని వెర్రి యన్వేషణము్మ ఈ ప్రవాస యాత్రారతి నిటులె నేను కదలిపోవుదు నాశావకాశములకు ఒక్కనిట్టూర్పు వోలిక ఒక్క మౌన బాష్పకణమటు, ఒక గాఢ వాంఛపగిది ఇంత నూతనాభివ్యక్తి సముదాయంతో కృష్ణశాస్త్రి తెలుగుకవిత్వానికి నూతన దిశాభిగమ్యం నేర్పాడు. తానే ఈ మార్గంలో కవులందరికీ గురుపీఠమైనాడు.
Thursday, July 9, 2009
ఈ తరంవారి భాగ్యం
తెలుగు సాహిత్యంలో సంస్కృతేతిహాస పురాణాలను మళ్ళీ అనువచించే సంప్రదాయం ఒకటి ఆదినించీ ఉన్నది. `మునివృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థ' మేర్పడ నన్నయ్యభట్టు తెలుగులో మహాభారతం పలకడం ప్రారంభించినాడు. తిక్కన ఎఱ్ఱనలు ఆ మార్గమే అనుసరించినారు. అయితే మూలం ఆధారంగా సమకాలీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, శ్రోతల జ్ఞాన గ్రహణ పరిమితుల దృష్టిలో ఈ అనువచన ధోరణి ప్రారంభమయింది. అందువల్లనే మూలంలోని అనేకాంశాలు సామాజిక ధార్మికాంశాలు ఈ రచనలో కనిపించవు. ముఖ్యంగా భగవద్గీత, సనత్సు జాతీయము మొదలైన అనేక ప్రముఖ గ్రంథ భాగాలు లోపించినవి. అయితే మూలం ఒక ఆధారమై కవుల స్వేచ్ఛాచారణానికి అవకాశ మిచ్చిన ఈ రచనలు నన్నయాదుల కవితా శక్తికి నికషోపలాలు అయినవి. మహాభారత మూల గ్రంథ నిర్మాణవైఖరి, ఇతిహాస కథాంశ ప్రత్యేకతలు, అనేక జ్ఞాన విజ్ఞాన భాగాలు తొలగి పోయినవి. ఈ స్వాతంత్య్ర ధోరణి వాల్మీకి రామాయణం తెలుగులోకి తెచ్చినప్పుడు కూడా ప్రతిఫలించింది. భాస్కర రంగనాథులు రెండు మార్గాలను ఎన్నుకొన్నా, అనువచన పద్ధతి నన్నయాదుల మార్గమే. అవాల్మీకీయ కథాంశాల ప్రకారం కూడా ఎక్కువగానే ఈ రామాయణాలలో చోటు చేసికొన్నది. శ్రీనాథుని కాలంలో నైషధాదుల అనువాదం వచ్చేసరికి ఈ స్వాతంత్య్రం కొంచెం కుంచించుకుపోయింది. అయినా భాషలోని పూర్వ సంప్రదాయం `ఔచిత్యంబు పోషించియు, అనౌచిత్యంబు పరిహరించియు' సాగింది. ఇతిహాసం, పురాణం ఈ రెండూ వస్తు ప్రధాన రచనలు. కావ్యాలు భావ ప్రధానాలు. నాటకాలు పదప్రధానాలు. అందువల్లనే కవుల ప్రయత్నమంతా పురాణేతి హాసాల అనువచనమే. శ్రీనాథుని నైషధం వదలివేస్తే కావ్యాలు నాటకాలు ప్రాచీన సాహిత్యం పట్టించుకున్నవాళు్ళ లేరనే చెప్పాలి. ఏమైనా అనువాదం చేయవలసి వస్తే నాటకాలు కూడా కావ్యాలుగా రూపొందాయి. 19వ శతాబ్దంలో పాశ్చాత్య సాహిత్య సంపర్కం వల్ల, సాహిత్య దృష్టి ప్రధానం కావడంవల్ల, కవుల ప్రతిభా విశేషాలను అంచనా వేయడం అంతస్థులను నిర్ణయించ ప్రారంభం కావడంవల్ల రచనా ప్రపంచంలో మార్పు వచ్చింది. కవుల కౌశలం ఎంచుకునే ధోరణి పెరిగింది. సాహిత్యానువాదం ఆయా కవుల ప్రతిభా ప్రకటనకే కాని అనువక్త ప్రతిభా ప్రకారం కోసం కాదని ఒక నిశ్చిత భావం ఏర్పడ్డది. అందుకే శరపరంపరగా కావ్యనాటకాదుల అనువాదం ప్రారంభం అయింది. మూల రచయితకు న్యాయం జరుగలేదనే ధోరణిలో ఒకే గ్రంథానికి అనేకానువాదాలు ఏర్పడ్డవి. ఒక్క మేఘదూతానికి, ఒక్క శాకుంతలానికి ముపై్ఫ పైగా అనువాదాలు రావడానికి ఇదే కారణం. ఇదే శతాబ్దంలో పురాణేతిహాసాల అనువాదం కూడా మళ్ళీ జరిగింది. శ్రీపాద వారు మళ్ళీ భారతం నిర్మించడం ఈ దృష్టితోనే. వావిలికొలను సుబ్బారావు గారి రామాయణం ఈ మార్గంలో నడచి సాగిన మరో రచన. ఆయన అనువాదంతోపాటు రామాయణానికి ప్రచారంలో ఉన్న వ్యాఖ్యానాలు ఆధారంగా ఒక బృహద్వా్యఖ్య నిర్మించి మందరమనే పేర అందించారు. వాల్మీకి రచనకు ఏఏ వ్యాఖ్యాన విశేషాలు అన్వయిస్తున్నవో అవన్నీ దీనికీ అనువర్తించగలవని వావిలికొలను వారి అభిప్రాయం. వావిలికొలను వారి దృష్టిలో రామాయణ రచన ఒక విశిష్ట స్థానంలో ఉన్నది అనే కాధ్యాత్మిక సంప్రదాయాల బీజగర్భితత్వం దీనిలో ఉన్నదని. అయితే, మనకు రామాయణం వేదోపబృంహణార్థమని భావించే ధోరణి ఒకటైతే కావ్యకళాదృష్టతో ఆద్యంతమూ విలువగల రచనగా ఆదికావ్యంగా పరిగణించడం ఇంకో దృష్టి. ఈ దృష్టిలో వాల్మీకి రచనను యథాతథంగా `తుచ తప్పకుండా' తెలుగులోకి తెచ్చే ప్రయత్నం ఇంత కాలానికి `రామానుజ రామాయణం' వల్ల జరిగింది. రామానుజ రామాయణం రచించిన మిత్రులు శ్రీ శ్రీ.న.చ. రామానుజా చార్యులుగారు నాకు ఆప్తమిత్రులు. తనలో నిద్రించి ఉన్న కవితా కుండలినిని మనో వాల్మీకంలోనించి తట్టిలేపి యేభై సంవత్సరాలు దాటిన ప్రాయంలో వాల్మీకి రామాయణాన్ని తెలుగులోనికి తీసుకువచ్చారు, దీక్షగా ఆరున్నర సంవత్సరాల యజ్ఞంగా. రామాయణ మూల రచనకు ఆధ్మాత్మిక, ధార్మిక, సామాజిక, భాషా సంబంధి, కళాత్మక ముఖాలు అనేకంగా ఉన్నవి. అయతే ఈ అనువాదంలో భాషా కళాముఖాలకే ప్రాధాన్యం ఉన్నది. వీలైనంతలో ఆయన శ్లోకం ఇముడగల దేశిచ్ఛందస్సులను ఎన్నుకోవడం, వీలైనంతలో దేశి శబ్దజాలాన్ని ఉపయోగించడం ఈ రచనలో ఉన్న విశేషాలు. శ్రీ.న.చ. రామానుజాచార్యులుగారు వ్యాఖ్యానాలు పరిశీలించి అర్థ విస్పష్టతను సాధించారు. అయితే ఆ ధోరణిలో విస్తరించి వ్యాఖ్యానించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఆ ప్రలోభానికి లొంగక పోవడం తన వ్యక్తిత్వాన్ని మరుగు పరచుకోవటానికి చేసే ప్రయత్నం ఒక అసాధారణ సాఫల్యంగా నేను భావిస్తున్నాను. అనువాదం చేసే సందర్భంలో పద్యం క్రమంగా సారళ్యం పొందింది. `బడు' ను పరిహరించినా, సంస్కృత వాక్య విన్యాస ధోరణిని పరిహరించడం సాధ్యం కాలేదు. కొంచెం ఆ మార్గం అలవాటయితే, సంస్కృత రామాయణం చదువలేని వాళు్ళ, దాన్ని చేరలేనివాళు్ళ దీన్ని చదివి వాల్మీకి ప్రతిబింబాన్ని పోల్చుకోవచ్చును. ఈ అనువాద కార్యానికి తొలి ప్రోత్సాహం శ్రీ ఉషశ్రీది. అయితే ఈ రచనా సందర్భంలో అనువాదాన్ని మూలంతో సరిపోల్చుకుంటూ వినే అవకాశం నాకు చాలావరకు కలిగింది. నా పరిమితిలో కొన్ని చోట్ల చర్చించటం. శ్రీ.న.చ రామానుజా చార్యులుగారు కొన్ని చోట్ల మన్నించడం జరిగింది. కొన్నిచోట్ల తమ దృక్పథాన్ని విశదీకరించడం జరిగింది. ఒక విధంగా నాకు రామాయణాధ్యయనం చేసే అవకాశం, వాల్మీకిని అత్యంత సన్నిహితంగా ఎరిగే స్థితీ కలిగింది. శ్రీ.న.చ. రామానుజాచార్యులుగారి మాట ఎంత `కచ్చితమో' జీవితంలో ఎంత క్రమశిక్షణో రచనలోనూ అంతే కచ్చితమైన క్రమశిక్షణ గల లక్షణము వ్యక్తమవుతుంది. ఎక్కడా అసమగ్రతతో ఆయన రాజీపడలేదు. ఎంత క్లిష్టమైన ఘట్టంలోనూ `నామూలం లిఖ్యతే' అన్న మార్గం ఆయన వీడలేదు. పారిభాషిక పదబహుళంగా ఉండే యజ్ఞ ఘట్టమూ, విశేషణాల పరంపర కలిగిన ఆదిత్య హృదయము, దేశ భౌగోళిక స్వరూపాన్ని వర్ణించే కిష్కింధలోని మార్గోపదేశమూ, అన్నీ ఈ క్రమశిక్షణలో సాగినవి. విశిష్టాదై్వత సంప్రదాయంలో బహు విశేషభావనలకు తావిచ్చే రామాయణ విశేష శ్లోకాల సంపుటికి `తని శ్లోకి' అని పేరు. ఆ శ్లోకాల రచనలో కూడా కత్తివాదర మీద నడకలాగా ఈ అనువక్త రచన సాగించి దీనికి రామానుజ రామాయణం అన్న పేరుంచడంలోని ఔచిత్యాన్ని ఋజువు చేశారు. అయితే శ్రీ.న.చ. రామానుజాచార్యులుగారు గురుకుల క్లిష్టూలవునో కాదో కాని ఆంధ్ర మహాభారత సముద్రము దరియంగ నీదిన ప్రయోగదక్షులైన విద్వాంసులు. ఏ సందేహం కలిగినా పూర్వకవి ప్రయోగమును చప్పున ఉదాహరించగలవారు. కవిగా ఆయనకు ఈనాటిలోకం మీద ఉన్న నిరసన ధోరణి అంతా మూర్ఖ శతకంలో మిక్కిలి కటువుగా వ్యక్తమవుతున్నది. రామానుజ రామాయణంలోని అనువాద ధోరణిని పరిశీలించడం, పైన పేర్కొన్న అంశాలు ఆధారంగా జరగాలి. తేషాం కేతురివ జ్యేష్టా రామో రతికరః పితుః బభూవ భూయో భూతానాం స్వయంభూ రివ సమ్మతః (బాల1823)దీని అనువాదం వారిలోన పెద్దవాడు రాముడు పతా కము్మవోలె ప్రీతికరుడు తండ్రి కఖిల భూతతతికి ఆత్మభవుం డట్లు సమ్మదము్మ గూర్చు సంతతము్మఈ అనువాదంలో `పతాకము్మ' అన్నమాట పాదాంతంలో గురువు మీద విరిగి విలక్షణమై తన వ్యక్తిత్వ ప్రత్యేకతను చాటుతున్నది. ఇక్కడ కవి పదాన్ని ఎన్నుకోవడంలో `కేతు' శబ్దం తొలగిపోయి మరింత అసందిగ్ధతను చాటుతున్నది. ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి గుణా ద్రూపగుణాచ్చాపి ప్రీతి ర్భూయో భ్యవర్ధత (బాల7726)దీని అనువాదం ప్రీతిపాత్ర యెు్య సీత రామునకును తండ్రి కూర్చినాలు తానగుటను గుణము వలన రూపగుణమున సైతము పెంపు మీరు చుండె ప్రీతి మిగులఈ పద్యంలో మూలం ఎక్కడా చెక్కుచెదరక పోవడం, సంస్కృతం పలుకుబడి తెలుగులోకి అందంగా దిగిరావడం గమనించవచ్చును. అసిధారావ్రతంగా ఈ అనువాద కార్యం నిర్వహించిన రామానుజా చార్యులుగారిని అభినందించడం తప్ప మనం చేయగలిగిన దేముంది? వాల్మీకి గిరి సంభూతయైన రామాయణ మహానది తెలుగు క్షేత్రంలోకి ఇంత సులభంగా ప్రవహించడం ఈ తరం తెలుగువాళ్ళ భాగ్యం. ఈ యజ్ఞం పూర్తిచేసి అవబృథ స్నానం చేసిన రామానుజాచార్యులుగారిని వారి షష్టిపూర్తి సందర్భంగా హృదయ పూర్వకంగా అభినందించడం, వాల్మీకిని ఇష్టపడే సాహిత్య ప్రవాహ వీథీ సాంయాత్రికు లందరికి ధర్మం.
అంతర్ముఖుడు శ్రీ నవీన్
మన కవులు-రచయితలు-2
నవీన్ నాకు 1960 ప్రాంతాల నించి పరిచయమే. `అంపశయ్య' ద్వారా అంతవరకు తెలుగు సాహిత్యంలో అంతగా ప్రచలితంకాని చైతన్యస్రవంతి సంవిధానాన్ని ప్రయోగించి తొలి నవలను పూర్తి చేశాడాయన. 1955 ప్రాంతాలలో మేము నేను, పేర్వారం జగన్నాథం ప్రభృతులం `సాహితీబంధు బృందం' స్థాపించటం ప్రధానంగా కళాశాల విద్యార్థులుగా, సాహిత్య రంగంలో ప్రక్రియగా ఉండటం కోసం మేము హైదరాబాదు చదువుకోసం వెళ్లగానే మా ఆర్‌ట్స కాలేజి అధ్యాపకులు పి.జి, లాలే, ఇరివెంటి కృష్ణమూర్తి, జి.వి. సుబ్రహ్మణ్యం ప్రభృతులు కాళోజీ సోదరులు కేంద్రంగా మిత్రమండలిని స్థాపించటం జరిగింది. 195758లలో. అయితే మిత్రమండలి పక్షానికో, వారానికో సమావేశమై యువ రచయితల రచనలకు పదునుపెట్టింది. ఒక కార్యశాల వలె నడిచింది. ఆ కార్య శాలనించి బయటకు వచ్చిన రచయితలలో నవీన్ ఒకరు. వరంగల్లు సాహిత్యంలో తొలి నాళ్లనుంచీ రెండు రకాల స్రవంతులు సమాంతరంగా ప్రవహించటం ఉన్నది. దేశీయత కళామయత, అంతర్బహిర్ముఖాలు, ఆధ్యాత్మికత అధిభౌతికత జంటలు జంటలుగా సాగివస్తుంటవి. పాల్కురికి సోమన, పోతన్న నాటి నుంచీ ఈనాటి వరకు ఈ జంట జంటల పద్ధతి సాగిపోతూనే ఉంది. సర్వతః బహిర్ముఖంగా కనిపించే కాళోజీ ఉర్దు, పారశీక కవితా సౌందర్యానికి పరవశమయ్యే వ్యక్తియే. శ్రీ గార్లపాటి రాఘవరెడ్డి భక్తి కవితా ధోరణికీ, ఉదయరాజు శేషగిరిరావు `మనోరమ' అనే శృంగార పద్యలహరికీ తన్మయమయ్యే లక్షణం ఉన్నవారే. కాళీజీ ప్రభృతులు నిర్వహించిన మిత్రమండలిలో నుంచి వెలువడడ్డ శ్రీ నవీన్ రచయితగా అంతర్ముఖుడైనాడు. అతని నవలలూ కథలూ ఎంతగా లోకాన్ని వర్ణించినట్లు కానవస్తూన్నా ఆత్యంతికగా అంతర్జగత్తులో విలీనమయ్యేవే. నవీన్ రచనల విూద ఒక సౌందర్య అనుభవ ముద్ర ఉన్నది. ఈ ముద్ర చలం ద్వారా ఆయనకు సంక్రమించింది. అందువల్ల జీవితాన్ని పై అంచులో వర్ణిస్తూ వర్ణిస్తూనే చివరకు ఆయన అంతర్జగత్తులోకి జారిపోతాడు. పైన బుద్ధిబలం వల్ల, హేతువాదం వల్ల ఏ ఏ పరివేషాల కానవచ్చినా అసలైన నవీన్ కేవలం వాటి పొరలు చించినప్పుడే కానవస్తాడు. ``మనస్సును కలచి కలచి మేధస్సును, సంఘటన అనే కవ్వంతో చిలికి చిలికి జీవిత రథ చక్రాల క్రిందపడి నలిగి నలిగి ప్రతిపాత్రను కలం కుంచెతో బొమ్మ గీసి గీసి, ప్రతి అక్షరాన్ని మార్చికూర్చి, ఇటుక మీద ఇటుకకను పేర్చినట్టుగా పేర్చిపేర్చి తన బాధను ప్రపంచబాధగా, ప్రపంచబాధను తన బాధగా చేసుకొని, జీవితం అనే సూది మొన మీద నిరంతర తపస్సు చేసి చేసి అప్పుడు గదా కథ పుడుతుంది అప్పుడు గదా నవల పుడుతుంది. అదో తపస్సుఅదో సాధన అదో ప్రసవవేదన.... అదో అన్వేషణ, అదో తీరని దాహం'' (అంతస్స్రవంతి పేజి. 41) ఒక రచయిత రచనాక్రమాన్ని సోపాన పద్ధతిలో వెల్లడిస్తున్నారు శ్రీ నవీన్. `ఇటుకమీద ఇటుక పేర్చినట్టుగా పేర్చిపేర్చి' ఇంతవరకు రచయిత జాగ్రదవస్థలో చేసే కార్యం. అంతస్సులోనికి ప్రవేశించే ప్రయత్నం. తన వు్యత్పత్తీ లోకానుభవమూ, అభ్యస్త సాహిత్య విద్యావైదుష్యమూ వెల్లడించేవి. తరువాత భాగం ఆయన అంతస్సును గురించి తెలియజేస్తుంది. `తన బాధను ప్రపంచబాధగా ప్రపంచబాధను తన బాధగా' చేసికొని ... ఇది అంతర్బహిస్సుల సంధి దశ. ఈ మాటలు మహాప్రస్థానం పీఠికలో చలానివి. ఒకటి కృష్ణశాస్త్రిని గురించి, రెండవది శ్రీశ్రీని గురించి చెప్పినవి. వ్యక్తి క్రమంగా విశ్వచైతన్యంగా పరివర్తించటం విశ్వచైతన్యాన్ని తన వ్యక్తిత్వంలోనికి స్వాయత్తం చేసుకోవటం . . . ఈ రెండూ ఉన్మేషనిమేష దశలు, ప్రతి రచయితా రచనావేళలో ఈ దశల్లో ఎక్కడో ఒకచోట తప్పక నిలిచివుంటాడు. తరువాత మూడవదశ వర్ణించబడింది. ఇది అత్యంతమూ ముఖ్యమైంది. ఒక విధంగా నిర్వికల్పసమాధివంటి దశ. అహంత సరిహద్దులు చెరిగిపోయిన స్థితి. ఆ స్థితి `జీవితం అనే సూదిమొన మీద చేసే నిరంతర తపస్సు'. సర్వ చరాజగత్తులోని జీవచైతన్యమూ సుసూక్ష్మీకరింపబడి కేంద్రితమై రచయితకు ఆధార స్థానమవుతుంది. ఈ ఆధార పద్మం మీద నిలిచి ఉంటాడు రచయిత. సృష్టికర్త. ఈ కేంద్రీకృతమైన సర్వజీవన చైతన్యాన్ని గర్భీకరించుకున్న బిందువు మీద ఉన్న రచయిత మనం ఎరిగిన లోకంలోని వ్యక్తి మాత్రమే కాదు అతడు తనకుమించిన జగత్తునంతనటినీ తనలోనికి చేదుకున్నవాడు. ఒక వ్యక్తావ్యక్త సంధి బిందువు మీద ఉన్న స్థితిని చెప్పుతాడు. అప్పుడది తపస్సుతీవ్రభావనఅవుతుంది. అప్పుడది సాధన అంతర్జగత్తునుంచి ఎప్పుడు చేదుకునే ప్రయత్నం అవుతుంది. అదే తానెరుగని అపూర్వమైన నూతనా విష్కారం కోసం చేసే ప్రయత్నం అవుతుంది. శ్రీ నవీన్ ఈ విధంగా రచనాప్రక్రియలోని భిన్నభిన్న దశలను ఇంత విశదంగా చెప్పారు. రచయితగా ఉన్న ఆయన వివేకం స్థాయిని ఇది తెలియజేస్తుంది. అంతర్బహిర్జగత్తుల మధ్య సమన్వయంలోనే గొప్పరచన వెలువడుతుంది. శ్రీ నవీన్‌లో ఈ ఘర్షణ `అంతస్స్రవంతి'లో వ్యక్తమయ్యే సన్నివేశం ఉంది. రచయిత భార్య రజని అంటుంది ``ఎప్పుడూ మల్లెపూల సువాసనలేకాదు. . . అప్పుడప్పుడు కిరోసిన్ కంపు కూడా భరించాలి'' అని. భౌతిక ఆధిభౌతిక జీవనాల మధ్య వారధిని నిర్మించుకోవలసిన అవసరాన్ని ఈ సన్నివేశం స్పష్టం చేస్తుంది. రవి తన పాఠకురాలు సుధకు రాసిన ఉత్తరం సన్నివేశంలో ఈ సమన్వయం కుదరకపోవటం వల్ల వచ్చే వైరుధ్యం కానవస్తుంది. ఇక్కడ రవి స్వాప్నికుడు. రజని భూమి. ఈ భూమ్యాకాశాల నడుమ సమన్వయం నవల చివర దాని సమావేశంలో సాధ్యమయ్యింది. రవికి సంప్రదాయ సిద్ధమైన పతివ్రత వంటి విలువలమీద నమ్మకం లేక పోయినా తన సహచరి ఇల్లాలు ఆయనకు సర్వమూ అవుతున్నది. `నువ్వే నారాణిని నా ఎంకివి నా ఊర్వశివి నా పార్వతివి కోమలివి నా అమృతానివి తాను మెచ్చిన స్త్రీల వ్యక్తిత్వాలన్నింటినీ తన ఇల్లాలు రజనిలో చూసుకోగలుగుతాడు రవి. అందువల్లనే ఆమె తన సంగమకాంక్ష తీర్చని వేళలో కూడా దగ్గరకు లాగి జోకొట్టింది. అతనికి ఓ చక్కని కలవచ్చింది. మత్తుగా ఉంది. తెల్లగా మంచుముద్దలు, పచ్చటి మైదానాలు సూర్యకిరణాలలో తళతళలాడే పర్వతాలు. ఎతై్తన యూకలిప్టస్ చెట్లు కాదు ఆపిల్ చెట్లు, గుత్తులు గుత్తులుగా ఆపిల్ పళు్ళ. `వాటి అందమంతా కళ్ళతోటే జుర్రేస్తున్నాడు' (పేజి. 1213) అతని శరీరం కోరిన అనుభవం స్వప్నంలోకి పరివర్తిత మయ్యింది. ఆ పళ్ళను డబ్బాలలో పెట్టి మేకులు కొట్టడం, పాలవాడు తలుపు బాదం ఇవి భౌతిక జగత్తులోనికి దించే వాస్తవాంశాలు. అయితే నవల చివర నాయికా నాయకుల సంగమ దృశ్యం వర్ణించబడింది. అనుభూతి జగత్తులోంచి ఈ వర్ణన భౌతిక పరిమితులను దాటిపోయింది. దాంపత్యజీవన తత్తా్వన్ని వ్యాఖ్యానించింది. ``వాళ్ళిద్దరూ రెండు శరీరాలుగా రెండు ప్రాణాలుగా అంతమైపోయారు. ఏకప్రాణిగా ఆవిర్భవించే ఆ క్షణాలు అతనికి మహత్తరంగా, మహాద్భుతంగా, మధుర మనోజ్ఞంగా కనిపిస్తాయి. అలాంటి క్షణాలు నిత్యమై శాశ్వతమై, అనంతమై'' ``ఈ సృష్టిలో ఇంత ఆనందం ఇంత హాయి తనకు మరొకటిలేదు. రాగం, ద్వేషం, కోపం, తాపం, ఈర్ష్య, ద్వేషం అన్నీ అంతమైపోయిన క్షణాలు'' (పేజి 178) అనిర్వచనీయమైన అనుభవాన్ని చెప్పే గొప్ప ప్రయత్నం ఇది. అందుకే శ్రీ నవీన్‌లో జీవితాన్ని గురించిన ఒక తాత్తి్వక దృక్పథం సమగ్రమైంది ఉన్నది. ఇలాంటి దృక్పథం అనేది లేకపోతే ఏ రచయితా సృష్టినీ మానవ జీవితాన్ని వినూత్నంగా వ్యాఖ్యానించలేదు. ఇన్ని పాత్రల ఇంగితాన్ని స్పష్టంగా విశదీకరించలేడు. అంతస్స్రవంతి చివర జీవితాన్ని గురించి నవీన్ ఇలా అంటాడు. ``సృష్టి విచిత్రమైంది. సృష్టి అనంతమైంది. సృష్టి ఆద్యంతాలు లేనిది. సృష్టి ఒక ఆవిచ్ఛిన్న ప్రవాహం. నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. దానికి విరామం విశ్రాంతి లేవు. అనుక్షణం సృష్టికి ప్రతిసృష్టి జరుగుతూనే ఉంటుంది. అదే జీవిత రహస్యం. అదే జీవితాని కర్థం'' సృష్టి ెుుక్క అనుస్యూతిని, నైరంతర్యాన్ని చెప్పిన ఈ రచయితకు ఈ జగత్తుమీద ఉన్న ``మమకారం'' గొప్పది. ప్రజాతంతువును త్రెంచరాదు అని చెప్పే వైదికసూక్తి దీన్నే చెప్పింది. యూరోప్ దేశాన్ని ముంచెత్తిన నైరాశ్యవాదాల పాలబడకుండా, వ్యవస్థ సార్థకమైన ఉనికిని సమర్థించే నవీన్ మనకున్న కొద్దిమంది మంచి రచయితలలో ఒకరు.

Friday, July 3, 2009
నిజమైన గురజాడ చైతన్యం
మన కవులు-౧
ఒక రచయిత చైతన్యం ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1. వ్యక్తి సంస్కారము వాతావరణము 2. సమకాలీన చైతన్యము 3. ఆ వ్యక్తి సమష్టి చైతన్యాన్ని అందుకోవడం, తన వ్యక్తిత్వంలో అన్వయించుకోవడం ఈ అంశాలలో మొదటి రెండు సాధారణంగా స్ఫురించేవేకాని, మూడో అంశం సమష్టి అవచేతనలో వ్యక్తమయ్యే స్వరూపాన్ని అవగాహన చేసుకోవడం జరిగితేనే అది నిజమైన రూపంలో సాక్షాత్కరిస్తుంది. సమష్టి అవచేతనలోని సంస్కారం రచయిత వైయక్తిక జాగ్రత్ప్రయత్నం లేకుండానే రచనలో నిరూపితమవుతుంది. గురజాడ ప్రధానంగా 19వ శతాబ్దం ఉత్తరార్థంలో జీవించినాడు. అవి భారత దేశంలో పునరుజ్జీవనోద్యమం ముమ్మరంగా కొనసాగుతున్న రోజులు. దానికి రెండు ముఖాలు. ఒకటి 1857 ఉద్యమం ెుుక్క కొనసాగింపులో దేశ స్వాతంత్య్రానికి సమగ్ర జాతీయ శక్తుల సాక్షాత్కారానికి జరిగిన మహాప్రయత్నం. రెండోది ఆంగ్లపాలనా సంస్కారాలవల్ల ఆత్మన్యూనతా భావంతో ప్రారంభమై ఆంగ్ల విద్యాప్రాబల్యాన్ని కోరడం, బ్రహ్మసమాజ ఉద్యమం, సంఘసంస్కారోద్యమము మొదలైన రూపాలలో వ్యక్తమైంది. మొదటి మార్గంలో శ్రీ రామకృష్ణూల, దయానందుల, వివేకానందుల ఆధ్యాత్మికోద్యమాలు సంగమించి భారతీయాత్మను పునఃదర్శించే ప్రయత్నం జరిగింది. బంకించంద్రుని రచనలు ఈ ప్రేరణలోనుంచి ఉద్గమించినవే. మొత్తం జాతిని స్వాతంత్య్ర సమరానికి సమాయత్తం చేసిన ``వందేమాతరం'' ఈ రోజుల్లో ఆవిర్భవించింది. రెండో మార్గంలో ఉద్యమం జాతి పతనస్థితి నుండి ఉద్గతిని పొందేందుకు పాశ్చాత్య విజ్ఞానము, సంస్కారమూ అవసరమని భావించడం జరిగింది. దేశీయ మత స్వరూపాన్ని కూడా క్రైస్తవ మతము మాదిరిలో రూపొందించే ప్రయత్నం జరిగింది. బ్రహ్మసమాజ స్వరూపం ఈ రూపమైందే. మైఖేల్ మధుసూదన్ దత్ వంటి కవులు ఈ చైతన్యంతో పరిస్పందించినవారే. ఈ రెండు మార్గాలు ఇలా ఉండగా గురజాడ మనస్సు రూపొందే రోజులలో ఆయన ఒక జమీందారీలో జీవించాడు. విజయనగరం సంస్థానంలో ఆయన ఉద్యోగి. ఆ జమీందారీ ప్రభావం ఆయన మీద ఉండటం సహజం. ఆనందగజపతి రాజుగారి ప్రోత్సాహంతో ఆయన బ్రహ్మ సమాజంలోనూ, థియోసాఫికల్ సొసైటీలోనూ సభ్యుడుగా చేరినట్లు చరిత్ర చెప్పుతున్నది. తన చైతన్యమూ, తన పరిసరాలు ఆయనకు జమీందారు మీద ప్రత్యయాన్ని కలిగించినవి. ఆయన కన్యాశుల్కం రాయడం ఆనంద గజపతి ప్రోత్సాహం తోనే. అట్లాగే ఆయనకు ఆ కుటుంబం మీద ఉన్న భక్తివిశ్వాసాలు నీలగిరి పాటల్లోనే స్పష్టంగా వ్యక్తమవుతవి. ఆ వాతావరణం, ఆంగ్లేయ ప్రభుత్వానికీ, తన జమీందారుకీ ఉన్న సంబంధం ఆ ప్రభుత్వం మీద అమితమైన విశ్వాసం ప్రకటించేటట్లు చేసింది. ``కన్నుగానని వస్తుతత్వము కాంచనేర్పరు లింగిరీజులు, కల్లనొల్లరు వారి విద్యల కరచి సత్యము గరపితిన్'' ``ఆంగిలేయుల ధర్మరాజ్యము జ్ఞానమును స్వాతంత్య్రమిచ్చుచు సంతతము వర్ధిల్లు గావుత'' ఆనాటి ఆంగ్ల విద్యావంతులు సంస్కారోద్యమపరులు అందరూ ఇలాగే ఆలోచించేవారు. వీరేశలింగంగారు కూడా రాజకీయంగా ఇలాంటి అభిప్రాయం గలవారే. 1915 దాకా గురజాడ, 1919 దాకా వీరేశలింగం జీవించిఉన్నా ఉవ్వెత్తున లేచిన జాతీయోద్యమాన్ని వాళు్ల ఏ విధంగానూ బలపరచలేదు. అందువల్లనే గురజాడ అప్పారావు దేశభక్తి గీతం కూడా దేశ స్వాతంత్య్రాన్ని కోరే గీతం కాదు. ఆంగ్లేయులు దేశంలోకి తెచ్చిన ``నాగరీకరణ'' యుగానికి స్వాగతం చెప్పడమే దీనిలోని ప్రధానాంశం. ``అన్ని దేశాల్ క్రమ్మవలెనోయ్ దేశి సరుకుల నమ్మవలెనోయ్ డబ్బు తేలేనట్టి నరులకు కీర్తి సంపద లబ్బవోయ్'' ఈ గీతం ఆంగ్లేయులు వ్యాపారం ద్వారా దేశాలను ఎట్టా కబళిస్తూ వచ్చారో అలాగే వస్తువుల ఉత్పత్తి ద్వారా, ఎగుమతిద్వారా దేశాన్ని సంపన్నం చేయవలెనని ఆయన భావించడం జరిగింది. అయినా ఆంగ్లేయ రాజ్యం దేశీయ ఉత్పత్తులను ఎగుమతులను ప్రధానంగా దెబ్బతీసిన చారిత్రక సత్యం గురజాడ దృష్టికి రాలేదు. ఇక్కడ దేశి సరుకులు పెంచవలె ననడంలో గాంధీజీ నడిపిన స్వదేశీ ఉద్యమచ్ఛాయ ఏ మాత్రమూ లేదు. ఇటు ఉగ్రవాదోద్యమాల ెుడగానీ, అటు కాంగ్రెసు వారి ఉద్యమంమీదగానీ ఆయనకు సానుభూతి లేదు. ఒక కాంగ్రెసు సభకు వెళ్లి వచ్చి దాన్ని వెక్కిరిస్తూ గేయం రాసిన సంగతి కూడ మన గుర్తుంచుకోవాలి. దేశభక్తి గీతం ప్రధానంగా వ్యక్తిగతమైన సంస్కారాన్ని మాత్రమే కాంక్షిస్తుంది. అది ఆంగ్ల సామ్రాజ్యానికి ఏ హానీ చేయదు కనుక. దేశం అంటే కేవలం ఒక భౌగోళిక పరిమితి మాత్రమే కాదనీ, ఒక జన సమూహం మాత్రమే కాదనీ కొన్ని వేల సంవత్సరాలుగా పెంపొందించుతూ వచ్చిన సంస్కృతి చైతన్యానికి ప్రాతినిధ్యం వహించే స్థల వ్యక్తి కాలాల సంగమమనేభావం గురజాడకు అంగీకార్యం కాదు. ఒకవిధంగా ``దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషూలోయ్'' అన్నమాట ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పుతుంది. సర్వచైతన్య భావపరమేశ్వరిగా దేశాన్ని దర్శించిన వందేమాతరం గీతాన్ని వెక్కిరించడం కూడా ఈ గీత రచనలో గూఢమైన ఉద్దేశ్యం. అందువల్లనే దేశభక్తి గీతం సంకుచితమైన సమకాలీన మానవులను మాత్రమే దేశమని నిర్దేశిస్తుంది. ``దేశాభిమానం నాకు కలదని. . .'' ఇత్యాదిగా చెప్పిన అంశం జాతీయోద్యమం ెుడల ఆయనకు సానుభూతిలేని లక్షణం స్పష్టం చేస్తుంది. ఈ గీతంలో ఎక్కడా విదేశీపాలన ఎడల నిరాసం లేదు. ఇతర స్థలాలలో ఆంగ్లేయ ప్రభుత్వం చిరకాలం నిలువవలెనని కోరడం, ఈ గీతంలో విదేశీ పరిపాలన ప్రసక్తిలేక పోవడమూ ఈ రెంటిని సరిగ్గా అంచనా వేస్తే ఈ గీతం ఒక విధంగా ప్రభుత్వ విధేయంగా ఉంటూ వారి పాలనను ప్రోత్సహించుతూ వారి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడమే దేశభక్తిగా కవి ప్రతిపాదించినట్లు గోచరిస్తుంది. అయినా సంస్కారం విషయంలో కూడా గురజాడది పరిమితమైన దృక్పథం మాత్రమే. వీరేశలింగం ప్రధానంగా సంఘ సంస్కారి. ఆయన తన ఈ దృక్పథంతో ఎప్పుడూ రాజీపడలేదు. గురజాడ కన్యాశుల్కంలో అన్ని పాత్రలలోనూ మానవులలోని వెలుగు చీకట్లు ప్రదర్శించాడే తప్ప సంఘ సంస్కారాంశాన్ని ప్రతిపాద్యాంశంగా చూపలేదు. ఇంకా పరిశీలిస్తే గిరీశం పాత్ర ద్వారా సంఘ సంస్కారోద్యమం ఎట్లా విఫలమైందీ నిరూపించడం ఆయన ఈ విషయంలో నిశ్చయ భావానికి వచ్చాడని చెప్పే అవకావం ఇవ్వడం లేదు. కన్యాశుల్కంలో బాల్యవివాహాన్నీ, కన్యాశుల్కాన్ని నిరసించడం కనిపిస్తుంది. విధవా వివాహ విషయంలో ధైర్యంగా పరిష్కారం చూపించలేదనే చెప్పాలి. నాటకం చివర గిరీశం టక్కరితనం నిరూపించడం, బుచ్చమ్మ వివాహం విషయంలో అను కూలమైన సూచన ఏమీ చేయకపోవడం ఇక్కడ మనం గమనించాలి. అయితే గురజాడ ప్రధానంగా ఆశించిన సంస్కారం వర్ణభేదములన్నీ మాసి పోవలెననీ, లోకమంతా ఒక యిల్లు కావలెననే అంశం. వర్ణభేదనిరాసం మధ్య యుగాలనుంచీ భక్తి ఉద్యమాలలో ప్రసరిస్తూ ఉన్న భావస్రోతస్సే. అయితే ఆధునిక జీవన పరిస్థితులు ఆ భావాన్ని ఆచరణలో సాధ్యం చేసినవి. ఈ అంశంలో ఆంగిలేయులు, ఆంగ్లేయ విద్యావంతులూ సమభావం కలిగిఉన్నారు. అయితే స్వయంసంపూర్ణమైన గ్రామీణ వ్యవస్థ ఛిన్నాభిన్నం కావడం, నూతనమైన భూస్వామ్య వ్యవస్థ ఏర్పడటమూ, తత్ఫలితంగా నాగరీకరణమూ, నూతన వృత్తులూ వర్ణభేద వికాసాన్ని అత్యంతావసరం చేశాయి. అప్పటికే వర్ణ వ్యవస్థ తన ప్రాథమిక భావాన్ని కోల్పోయి స్వరూప మాత్రంగా నిలచివున్నది. ఈ వర్ణవ్యవస్థలోని ప్రాథమికమైన భావంతో ఆయనకు పేచీలేదు. `విద్య నేర్చినవాడె విప్రుడు, వీర్య ముండినవాడు క్షత్రియుడు' అని వర్ణవ్యవస్థ ెుుక్క భావరూపాన్ని వ్యాఖ్యానించుతారు. ఈ భావచ్యుతి పొందిన వ్యవస్థ తొలగిపోవలెననే అంశం పునరుజ్జీవనోద్యమంలోని రెండు ముఖాలూ ప్రబలంగా కోరినవే. అప్పటికీ శ్రీరామకృష్ణ, దయానంద, వివేకానందులు వర్ణభేదనిరాసమునూ, అస్పృశ్యతా రాహిత్యాన్ని ప్రపంచించదమే కాకుండా తమ తమ పరిధులలో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. వసుధైక కుటుంబమన్న భావం కూడా వివేకానందులు ఆమెరికాలో చేసిన ఉపన్యాసాలలో స్పష్టంగా ప్రతిపాదించిన అంశమే ఈ సన్నివేశంవల్ల గురజాడలో ముత్యాలసరాలు రాసేనాటికి ఈ రెండు భావాలూ గాఢంగా వ్యక్తం కావడానికి అవకాశం కలిగించినట్లు భావించవచ్చు. `ముత్యాలసరా'లన్న ఖండికలోని `జీవితేశ్వరి' ద్వారా గురజాడనాటి సంస్కారోద్యమానికి ప్రతిపక్షాన్ని కూడ మృదువుగా సమకూర్చినట్లు తోస్తుంది. ``కలసి మెసలిన యంత మాత్రనె కలగబోదీ యైకమత్యము'' ఇది ఆమె మాట. కేవలం పంక్తి భోజనాలు చేయడం ద్వారా ఈ మార్పు రాదు. సామాజిక పరిస్థితులలో సంస్కారంలో మార్పులు రావాలి. ఈనాటికీ మన ప్రవృత్తిని ప్రశ్నిస్తున్న ప్రశ్న యిది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కలసి మెలగుతూ వున్నా దేవాలయ ప్రవేశం కలిగించినా ముప్పయ్యా రేండ్ల తరువాత కూడా ఈ కులపు వ్రేళు్ల ఇంకా బలపడుతూ వుండటం మనం చూస్తూనే వున్నాము. ఈ ప్రయత్నాలలో ప్రధానమైంది మానసిక సంస్కారం. అది కలిగించే ప్రయత్నం భక్తి ఉద్యమాలు చేశాయి. వర్గాలలో ఉన్న న్యూనతాధిక్య భావాలమీద దెబ్బతీశాయి. సమైక్యానికి పునాది వేశాయి. సంస్కారోద్యమాలు రాజకీయాల నీడలు పడినాక వాటికి ప్రచారమూల్యం పెరిగింది. భావ పరివర్తన వెనుకబడింది. ఈ నాగరిక వల్ల వచ్చిన మరో మార్పు సమష్టి కుటుంబ విచ్ఛేదం. ఈ అంశం కూడా ఈ గీతంలోనే ``జీవితేశ్వరి'' ప్రశ్నించింది. అయితే గురజాడ రచనల్లో కాల్పనికోద్యమ ప్రభావం కూడా బలంగా కనిపిస్తుంది. ఆయన రచనల్లో ప్రేమ ప్రాధాన్యం స్పష్టంగా పేర్కొనబడింది. ``దేశమనిెుడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్'' అన్నచోట ``ప్రేమ కలుగక బ్రతుకు చీకటి మరులు ప్రేమని మది తలంచకు'' అంటాడు. ``కాసులు'' అన్న గీతంలో వివాహవ్యవస్థలో ప్రేమ ప్రాధాన్యం తగ్గిపోవడాన్ని సృష్టీకరిస్తాడు. ``మగడు వేల్పన పాతమాటది ప్రాణ మిత్రుడ నీకు'' అని స్త్రీ పురుషవ్యవస్థలో ఆ యిరువురి సమ ప్రాధాన్యాన్ని వివరిస్తాడు. సతుల సౌరను కమలవనమునకు పతుల ప్రేమయే వే వెలుగు'' అంటాడు. ఈ వాక్యంలోని రూపకం స్త్రీ పురుషూల సంబంధాలలోని సామరస్యాన్ని ప్రాధాన్య క్రమాన్నీ సూచిస్తుంది. ఈ గీతంలో ``అమలిన శృంగార'' భావబీజాలు నిక్షిప్తాలై ఉన్నాయి. గురజాడ ముందు పేర్కొన్నట్లుగా బ్రహ్మ సమాజంలోను, దివ్యజ్ఞాన సమాజం లోనూ సభ్యుడుగా ఉన్నవాడే. ఆయన మతవిషయాలలో ఆధునికోద్యమాల ప్రభావం ఉన్నవాడు. కాని నాస్తికుడు కాడు. ``మనిషి'' అన్న గేయంలో విగ్రహారాధనకు అంటే బాహ్యాచార ఆడంబరాలకు ప్రాధాన్యం యిచ్చి మాధవసేవకు ప్రాధాన్యం యివ్వని మౌఢ్యాన్ని తిరస్కరిస్తాడు. మధ్య యుగాలలోని భక్తి ఉద్యమాలలోని ఈ భావం ఆధునిక యుగంలో శ్రీ రామకృష్ణాదుల ముఖాన ప్రస్ఫుటమైంది. ఈశ్వరుడు సర్వసంస్థుడు. ఆయన ఉనికిని రాయి రప్పలకూ, కొండ కోనలకూ పరిమితం చేయటం తప్పు. భక్తులకు ఈశ్వరుడు కన్ను దెరచిన కానబడుతాడు. ఈ కన్ను దివ్యచక్షుస్సు. ఎరిగి కోరిన ముక్తిని యిస్తాడు. ఇక్కడి ఎరుక జ్ఞానము, కోరిన భక్తితో చేసే సమర్పణము. అనంత కరుణామయుడైన ఆ ప్రభువు కరిగి భక్తవశుడై ముక్తినిస్తాడు. ఈశ్వరభక్తి సంబంధించిన సంప్రదాయ రూపకాలు నీలగిరి పాటల్లో స్పష్టంగా గోచరిస్తవి. ఉమాపతి యర్చన అన్న గీతంలో ఉదకమండలం ఉమాపతి అర్చన ెుట్లా కోటి గుణితమైన పుణ్యఫల మిస్తుందో సూచిస్తాడు. తెలమబ్బులలో ఉదక మండలమే హిమాలయముగా గోచరిస్తుంది. అక్కడి ప్రకృతి అంతా ఈశ్వరార్చనకు సామగ్రి అయింది. ఆశ్రీతవరదుడైన అంబికారమణుడు రాణిని రక్షించవలెనని ఈ గీతం తాత్పర్యం. `చిత్తరువుని చూడ' అన్న గీతంలో విష్ణూప్రసక్తి కూడా వస్తుంది. గురజాడ రచనల్లో ``కన్యక'' ``పూర్ణమ్మ'' రెండూ గొప్ప గీతాలు. వీటిలోనూ, కన్యా శుల్కంలోనూ అసలు వివాహం ప్రధానమైన అంశం. ఆ విషయం కవిని ోభ పెట్టినట్లుగా గోచరిస్తుంది. ఈ రెండు గీతాలలో దక్షయజ్ఞంలో సతీదేవి దేహత్యాగం ప్రాగ్రూపం (ఆర్కిటైప్) పని చేసినట్లుగా గోచరిస్తుంది. కన్యకలో రాజు దక్షుని స్థానంలో ధర్మస్వరూపాన్ని మరచి అహంకరించి మైమరచిన స్థితిలో గోచరిస్తాడు. అందుకే దక్షయజ్ఞంలో దక్షుని వలె రాజు నశిస్తాడు. పట్నమేలే రాజు పోెును, మట్టి కలసెను కోట పేటలు పదం పద్యం పట్టి నిలిపెను కీర్తు లపకీర్తుల్'' అని పూర్తి చేస్తాడు. అతని కోట కూలి నక్కల కాటపట్టయింది. అందుకే కన్యక రాజు ఎదురు పడ్డప్పుడు ``ఇంటిదైవం వీరభద్రుని దేవళానికి పోయి యిప్పుడె పళ్ళెరం సాగించి వత్తును'' అంటుంది. వీరభద్రుని పళ్ళెరం అనేది శైవుల యిళ్ళలో శుభాశుభ కార్యాలలో జరిపే ఒక కర్మకాండ. ఈ కర్మలో వీరభద్రుడు విజృంభించి దక్షునియజ్ఞాన్ని విధ్వంసం చేసిన వృత్తాంతం గీత నృత్యాలలో ఖడ్గఖేలనంతో స్మరింపబడుతుంది. ఈ లక్షణం వల్ల కన్యకకు సతీదేవితో సామ్యం లభించింది. పూర్ణమ్మ కూడ ఇలాంటి ఇతివృత్తమే ఈ కథలో పూర్ణమ్మ బాల్యం నుంచీ దుర్గ భక్తురాలు. కన్యక కథలోనూ దీనిలోనూ దుర్గాదేవి ప్రసక్తి కనిపిస్తుంది. గురజాడకూ ``దుర్గా''దేవికీ ఉన్న సంబంధం ఇంకా లోతుగా పరిశీలించదగింది. ఈ గీతంలో కవికి దుర్గోపాసన విషయంలో ఆసక్తి ఉన్న విషయం స్పష్టంగా గోచరిస్తుంది. గుడి పరిసరాల వర్ణన ఆమె దుర్గమత్వాన్ని (కొండల, కోనల, కొలనుల ప్రసక్తి వలన) సూచిస్తున్నది. ఆమె బంగరు దుర్గ. శ్రీ సూక్తంలో చెప్పబడిన ``హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం'' అన్న వర్ణన ెుుక్క సారమంతా ఈ బంగరు దుర్గ అన్నమాట వ్యక్తం చేస్తుంది. దుర్గ ెుట్లా హిరణ్మయో పూర్ణమ్మ కూడా పుత్తడిబొమ్మ. ఈ వర్ణన భక్తునికి భగవంతుడికి కలిగే అభేదాన్ని వ్యక్తం చేస్తున్నది. దీన్నే కంఠోక్తిగా పూర్ణమ్మ మరణించి నప్పుడు ``కన్నుల కాంతులు కలువల చేరెను, మేలిమి చేరెను మేనిపసల్, హంసల చేరెను నడకలబెడగులు దుర్గను చేరెను పూర్ణమ్మా'' అని వర్ణించాడు. పంచభూతాలలో తత్తదంశలు విలీనం కాగా చివరకు ఆమె ఆత్మ ఆమె ఆరాధ్యయైన దుర్గలో ఐక్యాన్ని పొందింది. ఉపాసనా మార్గం విషయంలో కూడా దీనిలో కొన్ని అంశాలు కనిపిస్తుంది. ఏ ఏ వేళల పూచే పూవులు ఆయా ఋతువుల పండే ఫలాలు అన్నీ దుర్గకు ఆమె అర్పించేది. ప్రకృతి, కాలము రెంటి సంయోజనంవల్ల కలిగే చైతన్యస్పందం అంతా ఈశ్వరార్పితం కావలసిందేనని తాత్పర్యం. చివరకు దుర్గకు తన్నుతాను సమర్పణ చేసుకొన్న విధానికి ప్రతీకగా ఆమె మెడలో హారములమరెను'' అంటాడు కవి. ఈ కావ్యంలో అభివ్యక్తమయ్యే పూర్ణమ్మ దివ్యప్రకృతికి సూచనగా ఆమె మృతిని వాచ్యం చేయలేదు. ఒక విధంగా ఆమె పేరులో ఉన్న పూర్ణశబ్దం కూడా ఆద్యాదేవికి ప్రాగ్రూపంగా గూఢార్థ స్ఫోరకమేమో విచారించవలసి ఉన్నది. ఈ విధంగా విచారణ చేసినప్పుడు గురజాడ చైతన్యంలో ఈ క్రింది అంశాలు ప్రధానంగా కానవస్తవి.
1. గురజాడ ప్రధానంగా సంస్కారోద్యమంలో ప్రభావితుడైనవాడు అయినా ఆ ఉద్యమాలలోని పరిమితులను గ్రహించినవాడు. ఈ రంగంలో మానసిక సంస్కారానికి ప్రాధాన్యం యిచ్చేవాడు.
2. రాజకీయంగా ఆంగ్లేయ రాజ్యాన్ని అభిమానించేవాడు, ఆంగ్లేయుల సాంస్కృతిక సామ్రాజ్యవాదాన్ని (కల్చరర్ ఇంపీరియలిజం) ఆహ్వానించే వాడు. ఆ సామ్రాజ్యం వల్ల దేశీయ గ్రామవ్యవస్థ ఛిన్నభిన్నమై వృత్తులు కోల్పోయిన ప్రజలు ఎట్లా ోభించిందీ గ్రహించినవాడు కాదు. జాతీయోద్యమానికి అనుకూలుడు కాదు.
3. ఆస్తికుడు. మత విషయాలలో నూతనోద్యమాలలోని సమన్వయ దృక్పథాన్ని అనుసరించినవాడు.
4. దేవీ ఉపాసనామార్గంతో తాదాత్మ్యం కలిగినవాడు.

Subscribe to:
Posts (Atom)